For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ శివలింగం ఎలా కదులుతుంది మిస్టరీ ఏంటి..?

|

చాలా మంది హిందువులు శివలింగాలను, జోతిర్లింగాలను దర్శించుకోవడం పరిపాటి. శివలింగాలకు పూజలు చేయిస్తుంటారు. ఇది చాలా కాలం నుండి వస్తున్న ప్రాచీన ఆచారమే. శివలింగం శివున్ని సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివం అంటే శుభప్రథం అని, లింగం అంటే సంకేతం అని అర్థం. దాదాపు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే పూజలు అందుకుంటుంటాయని అందరికీ విదితమే ..!

ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ చెప్పబోయేది ప్రత్యేకమైనది. బహుశా మీరు కూడా ఇప్పటి వరకూ చూసుండరు కాదు కదా కనీసం వినుండరు కూడా... అదే కదిలే శివలింగం .. శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?! భలే చెప్పార్లే ఎక్కడైనా ఉంటుందా ఆ వింత అనుకుంటున్నారా ? నిజమండి బాబోయ్ ..! అక్కడ దీని గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పుకుంటుంటారు.

నిజమేనండి ఇక్కడి దేవాలయంలో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని దుగ్దేశ్వరనాథుడు. మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు.

spirituality

మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం. ఇక్కడి శివాలయం లోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది. రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం లో శివలింగం చాలాసార్లు కదులుతుంది.

దుగ్దేశ్వరనాథ్ ఆలయం రుద్రపూర్ లో ఎన్ని కోటలున్నా, రాజభావంతులున్నా ప్రత్యేక ఆకర్షణ మాత్రం దుగ్దేశ్వరనాథ్ ఆలయమనే చెప్పితీరాలి. ఎందుకంటే ఆలయ 'ప్రత్యేకతే' దానిని అంత గొప్పగా మార్చేసింది.

spirituality

స్వయంభూ లింగం ఆలయంలోని శివలింగం మామూలు శివలింగాల మాదిరి పానమట్టం మీద కాకుండా భూమి మీద ప్రతిష్టించబడి ఉంటుంది. ఇదొక స్వయం భూ శివలింగం (వాటంతటవే ఉద్భవించాయి).

అద్భుత ఘట్టం ఆలయంలోని శివలింగం ఒక అద్భుతం. ఈ శివలింగం కదులుతుంది. చాలా సార్లు కదులుతుందట ..! అది "గంటైన కావచ్చు, రెండు గంటలైన కావచ్చు లేదా పూర్తి ఒకరోజైనా కావచ్చు" అని అక్కడి పూజారులే స్వయంగా చెబుతుంటారు.

spirituality

క్యూ లో నిల్చొని మరీ ..! శివలింగం కదిలే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు గుంపులు గుంపులు గా వస్తుంటారు. ఒక్కసారి శివలింగం కదలటం ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదట. .. ! ఈ విడ్డూరాన్ని చూసేందుకు భక్తులు క్యూ లైన్ లో నిల్చోనిమరీ చూస్తుంటారు.

అంతే మరి ! ఈ శివలింగం ఎంత లోతు వరకు ఉంటుందబ్బా ... ! అని చాలా మంది తవ్వి చూసారట .. ఆ తరువాత ఎంత తవ్విన జాడ తెలియకపోవడంతో నాలుక్కర్చుకున్నారట!

ఈ లింగం భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉన్నాదో తెలుసుకోవటానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవటంతో విఫలమయ్యారట.చూసే అదృష్టం ఉండాలేగాని ఇలాంటి అబ్బురపరిచే దేవాలయాలు ఎన్నున్నాయో మన దేశంలో కదండీ!

English summary

Is it True ? Lord Shiva Lingam Moving At Rudrapur Temple

Rudrapur is a town in Deoria district of Uttar Pradesh. Here, Dugdheshwar nath temple is major attraction and also it is one of the oldest temple in deoria district. Some people says that in the temple shivalinga is moving, when we touch the lingam stop its motion. It's True or Not ? Let's go to Uttar Pradesh.
Desktop Bottom Promotion