కార్తీక మాసంలో దీపారాధన..దీపదానం చేయడం వల్ల పొందే ఫలితం ఏంటి..!?

కార్తీక దీపం: కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయాల్లో ఆకాశదీపాన్ని వెలగించడం ఆచారం. కార్తీక దీపాలను దేవాలయాలు, మఠాలయందు సూర్యోదయానికి ముందు, సాయం సంధ్యా సమయంలోనూ వెలిగించాలి. ఇంటముంగి

Posted By:
Subscribe to Boldsky

పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆయన కాంతి సోకినప్పుడు మనలోని అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయి. 'పరంజ్యోతి'ని ఆరాధన చేస్తున్నామనే అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంటుంది.

Karthigai Deepam Festival-Festival Of Lamps

కార్తీకమాసం మొదటిరోజున దేవాలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తారు. ధ్వజస్తంభానికి తాడుకట్టి, చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. ఆ దీపం ధ్వజస్తంభంపై వెలుగుతూ ఈశ్వరునికి ఉత్సవం నిర్వహిస్తుందనే భావనతో ఇలా చేస్తుంటారు.

Karthigai Deepam Festival-Festival Of Lamps

కార్తీకమాసంలో శివారాధనకు ఎంతటి ప్రాశస్త్యం ఉందో, విష్ణు ఆరాధనకూ అంతే విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తూ 'దామోదరమావాహయామి' లేదా 'త్య్రయంబకమావాహయామి' అని అంటారు. దామోదర నామం విష్ణు సంబంధమైనది. త్య్రయంబకుడు అంటే పరమశివుడు.

Karthigai Deepam Festival-Festival Of Lamps

ఈ నామాలు చెబుతూ తమ ఇష్ట దైవాలను ఆవాహన చేస్తారు. ఈ దీపకాంతులు మనలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక సాధన సజావుగా సాగేలా ప్రోత్సహిస్తాయి. ఉపాసనా శక్తిని పెంచుకోవడానికి కార్తీక మాసం అనుకూలమైన సమయం. అలాగే శివ కేశవులు ప్రీతి కోసం దీపదానం చేస్తారు. నదీ ప్రవాహాల్లో అరటి దొప్పల్లో ఉంచిన దీపాలను వెలిగించి వదులుతారు.

Karthigai Deepam Festival-Festival Of Lamps

ఈ మాసంలో ప్రతి రోజూ పర్వదినమే అయినా ప్రత్యేకమైన ఫలితాలను ఇచ్చే తిథులు కొన్ని ఉన్నాయి. వాటిలో భగినీ హస్తభోజనం, నాగుల చవితి, క్షీరబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. ఈ నెలలో ఉసిరి చెట్టు కింది చేసే వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. కార్తీకా మాసంలో నదీ స్నానానికి ప్రత్యేక
స్థానం ఉంది.

Karthigai Deepam Festival-Festival Of Lamps

కార్తీక దీపం: కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయాల్లో ఆకాశదీపాన్ని వెలగించడం ఆచారం. కార్తీక దీపాలను దేవాలయాలు, మఠాలయందు సూర్యోదయానికి ముందు, సాయం సంధ్యా సమయంలోనూ వెలిగించాలి. ఇంటముంగిట ఇంటిలోనూ తులసికోటీ వద్ద దీపాలను వెలగించాలి. దీపారాధన వల్ల కష్టాలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది.

Karthigai Deepam Festival-Festival Of Lamps

దీపారాధనం.. మోక్షకరం: ఈ మాసం అంతా శివాలయాలలో ఆకాశ దీపాలు వెలిగించాలి. దీపదానం చేయాలి. నదీ ప్రవాహాలలో దీపాలు వెలిగించి వదలాలి. శివ కేశవుల ప్రీతి కోసం దీపదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.

Karthigai Deepam Festival-Festival Of Lamps

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ॥ దీపారాధన చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. జ్ఞానవ్యాప్తికి - వితరణకు సంకేతం. వాతావరణం తేమగా ఉండి క్రిమికీటకాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి, దీపం వెలిగించడం వల్ల అవి నశిస్తాయి. వాతావరణం శుభ్రం అవుతుంది. జ్ఞానాన్ని వితరణ చేయడం. దీపదానంలోని విశిష్టత.

Karthigai Deepam Festival-Festival Of Lamps

ప్రమిదలో వత్తులు వేసి - నువ్వుల నూనె వేసి తాళ్ల సాయంతో దీపాలు వెలిగించమే ఆకాశదీపం. విశిష్టమైన వనభోజనాలు: కార్తీకమాసంలో వన భోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. వన భోజనాలు శాస్త్రీయమైనవి. ఉసిరిచెట్టు నీడన, పనస ఆకులో భోజనం చేయాలి. ఉసిరిని ఔషధీ భాషలో 'ధాత్రి' అంటారు.

కార్తీక మాసంలో దీపదానం: కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల ఎలంతో ఫలదాయకం. దీపాన్ని ఉసిరికాయ మీద ఉంచి దానంగా ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి.

English summary

Karthigai Deepam Festival-Festival Of Lamps

Karthigai Deepam is celebrated in the month of 'Karthigai' (October-November) This festival is celebrated when the full moon is in conjunction with the constellation Karthigai. It is the festival of lights, continued from Diwali.The spiritual significance of celebrating Karthigai Deepam festival, is symbolised in the functioning of a lamp. The oil used to light the lamp, symbolises the innate tendencies in one, which, is responsible for the ego to thrive.
Please Wait while comments are loading...
Subscribe Newsletter