లక్ష్మీదేవి అనుగ్రహం వెనక ఉన్న ఆసక్తికర రహస్యాలు..!

మహాభారతంలో.. ఇంద్రుడు, మహాలక్ష్మీ గురించి ప్రస్తావించారు. అయితే తాను భూమిపై ఎక్కడ ఉంటాను, ఎలాంటి ఇంట్లో ఉంటాను, ఎలాంటివాళ్లను అనుగ్రహిస్తాను అనే విషయాలను లక్ష్మీదేవియే స్వయంగా ఇంద్రుడికి వివరించింది.

Posted By:
Subscribe to Boldsky

లక్ష్మీదేవి కరుణా, కటాక్షాలు, అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే.. ఇంట్లో సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయనేది హిందువుల నమ్మకం. అందుకే.. ఆ సిరిసంపదల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు.

goddess lakshmi

అలాగే లక్ష్మీ అనుగ్రహం పొందినవాళ్ల ఇంట్లో ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు, పేదరికం ఉండదు, కావాల్సిన సమయానికి డబ్బు అందుతుంది. వాళ్లకు ఉండాల్సిన అన్ని సంపదలు పొందగలుగుతారు. అందుకే.. లక్ష్మీదేవి అంటే.. చాలా శక్తివంతమైన, పవిత్రమైన అమ్మవారుగా పూజిస్తారు.

మహాభారతంలో.. ఇంద్రుడు, మహాలక్ష్మీ గురించి ప్రస్తావించారు. అయితే తాను భూమిపై ఎక్కడ ఉంటాను, ఎలాంటి ఇంట్లో ఉంటాను, ఎలాంటివాళ్లను అనుగ్రహిస్తాను అనే విషయాలను.. లక్ష్మీదేవియే స్వయంగా.. ఇంద్రుడికి వివరించింది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం వెనక ఉన్న రహస్యాలు తెలుసుకుందామా..

గౌరవం

ఏ ఇంట్లో అయితే మనుషులు తక్కువగా మాట్లాడతారో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. అలాగే పెద్దవాళ్లను, తల్లిదండ్రులను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.

శుభ్రంగా

ఏ ఇళ్లు అయితే నిత్యం శుభ్రంగా, పండుగ వాతావరణం కనిపించేలా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కరుణా కటాక్షాలు ఉంటాయి. ప్రతిరోజూ గుమ్మం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు అందంగా పసుపు, కుంకుమతో అలంకరించాలి.

లక్ష్మీఫోటో

ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని.. ప్రతిరోజూ పూజించే వాళ్ల ఇంట్లో.. ఆ తల్లి అనుగ్రహం, కటాక్షం ఉంటుంది.

మహిళల మనస్తత్వం

ఏ ఇంట్లో అయితే.. అందమైన మహిళ, మరియు మంచి ఉద్ధేశ్యం కలిగిన మహిళ ఉంటుందో.. ఆ ఇంటిని ఎల్లవేళలా.. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.

బద్దకంలేని వాళ్లు

ఇంట్లోని వాళ్లు శుభ్రంగా ఉంటూ, మంచి బట్టలు ధరించడం, బద్ధకంతో లేకుండా ఉంటే.. ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం పొందుతారు.

కోపానికి దూరం

ఏ ఇంట్లో అయితే.. ఆ ఇంటి యజమాని కోపం, ఆవేశానికి దూరంగా ఉంటూ.. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తాడో.. ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుంది.

ధాన్యాలు

సిరిసంపదలకు నిలువెత్తు నిదర్శనమైన ధాన్యాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి.. వాటిని ఏ ఇంట్లో అయితే బంగారం లాగా చూసుకుంటూ భద్రపరుచుకుంటారో.. ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుంది.

స్వార్థం

మనుషులను స్వార్థం, అహంకారానికి దూరంగా ఉంటూ.. మానవత్వాన్ని నమ్ముతూ.. అందరితో సఖ్యంగా మెలిగే వాళ్ల ఇంట్లో లక్ష్మీ కరుణా కటాక్షాలు ఉంటాయి.

తెల్లపావురం

ఏ ఇంట్లో అయితే తెల్లపావురాలను పెంచుకుంటారో, వాటిని ప్రేమగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీ దేవి అడుగుపెడుతుంది.

మహిళలను

అనారోగ్యంతో ఉన్న మహిళను మగవాళ్లు పట్టించుకోకపోతే, ఇతర మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.

ప్రేమ, ఆప్యాయత

మనుషులు ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేవాళ్లు ఉండే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది. డబ్బు లేదు అన్న సమస్య దరిచేరదు.

స్వచ్ఛమైన మనసు

శరీరాన్ని, మనసుని స్వచ్ఛంగా, శుభ్రంగా పెట్టుకునే మనుషులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. చూశారుగా.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. మీకు ఉండాల్సిన లక్షణాలు, ఇంట్లో ఉండాల్సిన అలవాట్లు ఇవే.

English summary

Know These 15 Secrets About Where Goddess Laxmi Resides in a Home

Know These 15 Secrets About Where Goddess Laxmi Resides in a Home. It is believed that Goddess Laxmi blesses her followers with immense wealth and assets, and never let them stay without resources.
Please Wait while comments are loading...
Subscribe Newsletter