రావణుడి భార్య మండోదరి జీవితం గురించి భయంకర వాస్తవాలు..!

రామాయణంలో మండోదరి లంకాపతి రావణుడి రాణి అని, భోగభాగ్యాలు అనుభవించిందని భావిస్తారు.కానీ కొంతమందికి మాత్రమే ఆమె జీవితం ఒక పోరాటంలా సాగిందని తెలుసు. పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు తన జీవితమంతా త్యాగాలమయం.

Posted By:
Subscribe to Boldsky

రామాయణంలో మండోదరి లంకాపతి రావణుడి రాణి అని, భోగభాగ్యాలు అనుభవించిందని భావిస్తారు. కానీ కొంతమందికి మాత్రమే ఆమె జీవితం ఒక పోరాటంలా సాగిందని తెలుసు. పుట్టినప్పటి నుంచి.. చనిపోయేవరకు తన జీవితమంతా త్యాగాలకే సరిపోయింది. ఆమె మండోదరిగా ఎలా మారిందనేది.. చాలా ఆశ్చర్యపరిచే కథ.

mandodari life

రామాయణం ప్రకారం మండోదరి చాలా అందమైన మహిళ. చాలా సంప్రదాయబద్ధమైన, నిజాయితీ కలిగిన మహిళ. తన భర్త సీతను బంధించడాన్ని వ్యతిరేకించింది మండోదరి. అలాగే బాధ్యాతాయుతమైన భార్యగా, సరైన మార్గంలో నడవటానికి భర్తకు సరైన నిర్ధేశాలు సూచించిన మహోన్నత వ్యక్తి మండోదరి.

మండోదరి ఎలా జన్మించింది ? ఆమె జననం వెనక ఉన్న ఆసక్తికర కథ, ఆమె రాణిగా ఎలా మారింది ? రావణుడు మరణించిన తర్వాత మండోదరి జీవితం ఏమయింది ? అనే.. ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

మధుర

మండోదరి అసలు పేరు మధుర. మండోదరికి ముందు ఈమె జీవితం మధురగా సాగింది.

పార్వతి శాపం

మధురపై ఆగ్రహించిన పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆమె కప్పగా మార్చింది. 12 ఏళ్లు కప్పగానే జీవితం గడిపింది.

ఎందుకు ?

ఒకసారి పార్వతి లేనప్పుడు కైలాసాన్ని సందర్శించింది మధుర. అప్పటినుంచి.. ఈమె శివుడితో రహస్యంగా రతిక్రీడ చేస్తోందని.. కథలు వినిపించాయి. ఈ విషయంపై ఆగ్రహించిన పార్వతి.. ఆమెను కప్పగా మారేలా శాపం ఇచ్చింది.

శివుడి అభ్యర్థన

శివుడి అభ్యర్థన మేరకు మధురపై విధించిన శాపాన్ని జీవితకాలం నుంచి 12 ఏళ్లకు తగ్గించింది పార్వతీదేవి. దీంతో 12ఏళ్ల పాటు మధుర బావిలో కప్పగా జీవించింది మధుర.

మాయాసురుడి ధ్యానం

అశురుల రాజు మాయాసురుడు, అతని భార్య హేమలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కానీ వీళ్లు కూతురు కావాలని.. దేవుడి అనుగ్రహం పొందడానికి ధ్యానం చేసేవాళ్లు.

మధురా శాపం ముగిసే సమయం

మరోవైపు మధురాకు పార్వతి విధించిన శాపం ముగుస్తోంది. ఆమె తన అసలు రూపానికి మారిన తర్వాత.. సహాయం కోసం బావిలో ఏడుస్తూ ఉంది.

ధ్యానం చేస్తున్న జంట

ధ్యానం చేస్తున్న మాయాసురుడి జంటకు ఆమె ఏడ్పు వినిపించింది. అంతే ఆమెను తమ కూతురిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వాళ్లు ఆమెకు మండోదరిగా పేరు పెట్టారు.

రావణుడు

ఒకసారి రావణుడు మాయాసురుడి రాజ్యానికి విచ్చేశాడు. అప్పుడు మండోదరిని చూసి.. ఆమె అందం చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానిని.. రావణుడు చెబితే.. మాయాసురుడు వ్యతిరేకించాడు.

యుద్ధం

రావణుడు యుద్ధం చేసి.. మండోదరిని వివాహమాడతానని.. రావణుడు హెచ్చరించాడు. కానీ మండోదరి.. రావణుడి బలం గుర్తించి.. తన తండ్రిని రావణాసురుడు చంపేస్తాడని భావించి.. రావణుడితో పెళ్లికి అంగీకరించింది.

సీతను బంధించడంపై వ్యతిరేకత

రావణుడు సీతను అపహరించుకునిపోయి.. బంధించినప్పుడు మండోదరి వ్యతిరేకించింది. ఆమెను తన భర్త రాముడి దగ్గరకు పంపించమని ప్రాధేయపడింది. రాముడు ఏదో ఒకరోజు లంకను నాశనం చేస్తాడని ఆమెకు తెలుసు.

యుద్ధం తర్వాత

యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత.. యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. అప్పుడు రాముడిని చూసి ఆమె.. రాముడు విష్ణువు అవతారమని గ్రహించింది.

విభూషణుడు

మండోదరిని పెళ్లి చేసుకుని, లంక రాజ్యాన్ని పాలించమని రావణుడి తమ్ముడు విభూషణుడికి రాముడు సూచించాడు. మొదట విభూషణుడితో పెళ్లికి తిరస్కరించిన మండోదరి తర్వాత రాజ్యపాలన కోసం అంగీకరించింది.

పాలన గురించి బోధన

మండోదరి తన మిగిలిన జీవితాన్ని తన రెండో భర్తకు రాజ్యపాలనపై సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు.. లంక రాజ్యం నిజాయితీగా, సరైన మార్గంలో నడిచేలా జాగ్రత్తలు తీసుకుంది.

English summary

Life of Mandodari after Ravana's death

Life of Mandodari after Ravana's death. Mandodari's Strange Life: This is What Happened to The Beautiful Wife of Ravana After His Death.
Please Wait while comments are loading...
Subscribe Newsletter