For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షిర్డీ సాయి మహత్యం

By Nutheti
|

కోట్లాది భక్తుల కొంగుబంగారం షిర్డీ సాయిబాబా. ఆయన జన్మదినం సందర్భంగా ఊరువాడలన్నీ సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. షిర్డీ ఆలయాలన్నీ సాయి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వాడవాడలా భజనలు.. ప్రత్యేక పూజలు.. అంటూ సాయిని భక్తులు మనసారా పూజిస్తున్నారు.

సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటివరకు ఎక్కడ ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే 1835 నుంచి 40 మధ్యలో జన్మించి ఉంటారని.. కొంతమంది భావిస్తారు. సెప్టెంబర్ 28ని సాయిబాబా జన్మదినంగా భక్తులు వేడుకలు జరుపుకుంటారు.

సబ్ కా మాలిక్ ఏక్.. అంటే అందరి ప్రభువు ఒక్కరే అని గొప్ప సిద్ధాంతం ప్రభోదించారు షిర్డీ సాయిబాబా. ఎలాంటి నియమాలు అవసరం లేదు.. నిర్మలమైన మనస్సుతో పూజించిన వారిని కరుణిస్తానని భక్తులకు చెప్పారు షిర్డీ సాయి. ఇవాళ షిర్డీ సాయి బాబా జన్మదినం సందర్భంగా.. ఆయన చెప్పిన సిద్ధాంతాలు స్మరించుకుని తరిద్దాం.

షిర్డీ సాయి మహత్యం

షిర్డీ సాయి మహత్యం

సాయి బాబాను గురువు, సాధువు, ఫకీరు అని.. పలురకాలుగా పిలుచుకుంటారు భక్తులు. కుల, మతాలకు అతీతంగా.. అందరూ సమానులు అని ప్రభోధించారు సాయినాథుడు. అందుకే ఆయన్ను ముస్లింలు, హిందువులు పూజిస్తారు. మసీదులో నివసించిన సాయినాథుడు.. గుడిలో సమాధి అవడమే అందుకు నిదర్శనం.

షిర్డీ సాయి మహత్యం

షిర్డీ సాయి మహత్యం

తాను దైవాన్ని కాదని.. కేవలం గురువుగా భావించాలని భక్తులకు వివరించారు సాయి. అంతేకాదు భగవంతున్ని ఏ విధంగా ఆరాధించాలి.. వినయ విధేయులుగా ఎలా ఉండాలో తానే స్వయంగా ఆచరించి భక్తులకు మార్గనిర్దేశం చేశారు షిర్డీ సాయి.

షిర్డీ సాయి మహత్యం

షిర్డీ సాయి మహత్యం

నీటితో దీపాలు వెలిగించినా.. భక్తుల పాపకర్మలను తానే స్వయంగా కడిపారేసినా.. భక్తుల కోర్కెలు తీర్చినా.. తానెప్పుడూ దైవం అని చెప్పుకోలేదు సాయినాథుడు. తనకు దేవుడు అప్పగించిన కార్యాలని నిర్వహించడానికి వచ్చిన గురువుగా మాత్రమే వచ్చానని చెప్పేవారు. ఈ సృష్టిలో దైవానికి మించినది ఏదీ లేదని... భక్తులకు ప్రబోధించారు సాయి. అయితే బాబా సద్గురువే కాదని.. భగవంతుని స్వరూపమని.. ఆయన లీలలు సాక్షాత్తు చూశామని.. ఆయనతో కలిసి జీవించిన వాళ్లు విశ్వసించారు.

షిర్డీ సాయి మహత్యం

షిర్డీ సాయి మహత్యం

సాయిబాబా మహిమలు ఎన్నో ఉన్నాయని.. ఆయనతో కలిసి జీవించినవాళ్లు.. కొన్ని పుస్తకాల్లో ప్రస్తావించారు. దీర్ఘకాలిక రోగాలు నయం చేయడం, ఖండ యోగ సాధనలు, భక్తుల మనసులో విషయాలు తెలుసుకోవడం వంటి మహిమలు తాము స్వయంగా చూసినట్లు వివరించారు. విభూధి ద్వారా బాబా కొన్ని వ్యాధులను నయం చేసినట్లు కూడా ప్రస్తావించారు. అలాగే ఒక మహిళకు చూపు లేదు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. కంటిచూపు రాలేదు. విదేశాలకు వెళ్లినా ప్రయోజనం ఉండదని.. డాక్టర్లు చెప్పారు. అయితే.. తనకు కంటిచూపు ప్రసాదిస్తే.. శాల్వా సమర్పించుకుంటానని సాయిని వేడుకుందామె. ఏడాదిలోపే ఆమెకు చూపు ప్రసాదించారు సాయినాథుడు.

షిర్డీ సాయి మహత్యం

షిర్డీ సాయి మహత్యం

చిన్నతనం నుంచి కేబీ గవాంకర్ బాబాను అమితంగా పూజించేవాడు. అయితే ఒకరోజు బాబాను బ్రతిమాలి ఫోటో తీసుకుంటానని కోరాడు. కానీ బాబా అంగీకరించలేదు. పదే పదే వేడుకోవడంతో.. తన పాదాలు మాత్రమే తీసుకోవాలని బాబా చెప్పారు. కానీ అతను బాబాను తీయడానికి ప్రయత్నించాడు. కానీ చివరకు బాబా రూపం ఫోటోలో కనిపించలేదు.

షిర్డీ సాయి మహత్యం

షిర్డీ సాయి మహత్యం

తన భక్తులు రెండు నియమాలు తప్పకుండా పాటించాలని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు షిర్డీ సాయి. శ్రద్ధ, సబూరి అన్న లక్షణాలు ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలని సూచించారు. శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, దీక్ష అని సబూరి అంటే ఓర్పు, సాధన అని సందేశమిచ్చారు. అందరిపైనా ప్రేమ కురిపించేవారు సాయి. మూగజీవులను కూడా ప్రేమతో చూసుకోవాలని సూచించారు.

English summary

Miracles Performed By Sai Baba

Sai Baba, the saint of Shirdi, rules the hearts of his devotees and it can't be denied that even those who aren't a devotee, are still in awe of Sai Baba's life and personality. Some worship him as a God and the others consider him a great saint who was sent to the earth by the Gods to relieve humanity of its miseries.
Story first published: Monday, September 28, 2015, 15:16 [IST]
Desktop Bottom Promotion