For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Raksha Bandhan 2021: ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి 5 స్టోరీస్

రక్షా బంధన్ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

|

అసలు రాఖీ సాంప్రదాయం ఎలా వచ్చిందో తెలీదు కానీ, ఈ ఆచారం మాత్రం అనాదిగా ఉందని తెలిపే ఆధారాలు చాలా ఉన్నాయి. రక్షా బంధనం గురించి కొన్ని కథనాలున్నాయి. భారతీయ సాంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.

. ఈ పండుగ మూడు, నాలుగు రకాలుగా ఉంది. రక్షాబంధనం (రాఖీ) పండుగగాను, హయగ్రీవ పూజ, వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగాను అందరూ జరుపుకుంటారు. భవిష్యోత్తర పురాణంలోనూ,మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్నిఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ణ, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అరోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. రాఖీ పండుగకు వివిధ రకాల కథలున్నాయి.

నిజానికి, భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యదారాలు లేవు. కానీ, పురాణాలలో తెలిపిన విధంగా, వివిధ రకాల కథలు ఉన్నాయి.వాటిలో కొన్ని ఇక్కడ తెలుపబడ్డాయి.

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

రాక్షస రాజైన బలిచక్రవర్తి తన భక్తితో శ్రీవారిని తన ఇంట్లో బంధిస్తాడు. అప్పుడు మహాలక్ష్మీ ఓ సామన్య స్త్రీగా మారి బలిచక్రవర్తి ఇంటికి వచ్చిన అతనిని సోదరునిగా భావించి చేతికి రక్షాంధన్ కడుతుంది. దాంతో ఏమి బహుమతి కావాలో కోరుకోమని చక్రవర్తి అడుగగా, వెంటనే మహాలక్ష్మీ తన నిజస్వరూపంలోకి వచ్చిన తన స్వామిని విడిచి పెట్టాలని కోరుతుంది. దాంతో శ్రీహరిని విడిచిపెడతాడు.

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

ద్రౌపది -శ్రీకృష్ణుని బంధం

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

కర్ణావతి అనే మహిళ చిత్తోర్‌గడ్‌ రాణిగా ఉండేవారు. భర్త అకాల మరణంతో రాజ్యభారం ఆమె మీద పడుతుంది. దీంతో ఇది సరైన సమయంగా భావించిన గుజరాత్‌ సుల్తాన్‌ బహుదూర్‌ షా చిత్తోర్‌ గడ్‌పై తన సేనలతో దండెత్తుతాడు. అతనిని ఎదుర్కొనేందుకు ఏమి చేయాలో పాలుపోని కర్ణావతి సాయం చేయాలని కోరుతూ మొఘల్‌ చక్రవర్తి హుమాయూన్‌కు ఒక రాఖీని పంపుతుంది. ఈ రాఖీతో కర్ణావతిని తన సోదరిగా భావించిన చక్రవర్తి ఆమెకు అండగా నిలువడమే కాకుండా బహుదూర్‌షాను యుద్ధంతో ఓడిస్తాడు. ఈ చారిత్రక ఘటనకు సాక్ష్యం ఈ రాఖీ. అప్పటి నుండి ఈ పండుగను ఉత్తర భారతీయులు జరుపుకుంటూ వస్తున్నట్టు ఇంకో కథనం ఉంది.

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

శ్రీరాముడు లంకలో వున్న సీతని రావణాసురుని చెర నుంచి విడిపించడానికి వానరసేన సహాయం కోరినప్పుడు, వానరులు బండరాళ్లని సముద్రంలోకి విసిరి ‘‘సేతుబంధనం'' నిర్మిస్తారు. రాముడు ఆ వారథి మీదుగా లంకని చేరుకుని సీతను రక్షించాడు అని రామయణ కథ చెప్తూ కొబ్బరికాయని సముద్రంలోకి విసిరివేస్తూ వుంటారు. అంతే కాదు కొబ్బరికాయని మూడు కన్నులుగల శివునిగి భావిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో తీరవాసులు పాటిస్తారు.

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

వ్రుత్తాసురుడనే రాక్షసునితో యుద్దం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అతనికి విజం కలగాలని కోరుతూ ఇంద్రుని భార్య ఇంద్రాణి ఓ పవిత్రమైన దారాన్ని పసుపు, కుంకుమలతో మంత్రించి అతని కుడిచేతి మణికట్టుకి కట్టింది. అలా రాఖీ పుట్టిందని చెబుతారు.

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

చరిత్ర పుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా' తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్‌)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చి నాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ యుద్ధం విరమించుకుంటాడు.

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

రాఖీ పండుగకు వివిధ రకాల కథలు

ఇలా ఎన్నో కథలుగా గాధలు గా ఈ రాఖీ పండుగ గురించి చెప్పుకుంటారు. ఇది ఒక నమ్మకంతోనూ, ప్రేమతోనూ, అనుబంధంతోనూ కూడుకున్న ఆచారము.

English summary

Raksha Bandhan: Here are 7 stories behind the festival we celebrate today

The festival of Rakhi that was once called the bond of love has quickly made a transition to being the bond of gold, diamonds an anything expensive you can find. Gone are the days when rakhis for Rakshabandhan were symbolic threads to be tied on the brothers wrist. With the upcoming age of consumerism, traditional rakhis are steadily going out of fashion.
Desktop Bottom Promotion