For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీమలకు ఆహారం వేస్తే శని ప్రభావంతో వచ్చే కష్టాలు, మరణభయం ఉండదా..?

|

మన సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజూ, ప్రతి వ్యక్తీ దానం చెయ్యాలి అని చెప్తారు. రోగ పీడితులు, గ్రహ పీడితులు, ఇంకా అందరూ. పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకీ దానం చేస్తే ఎంతో పుణ్యం రావటమేకాక మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ కరిగి పోతాయి. దానాలు షోడష రకాలంటారు. వీటిలో ముఖ్యంగా అన్నదానం చాలా గొప్పది.

అయితే అందరూ అన్నదానం చెయ్యగలరా? ఎంత కష్ట పడ్డా వారి కుటుంబ అవసరాలు గడవటానికే ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది వున్నారు మన దేశంలో. అలాంటివారు రోజూ అన్నదానమో ఇంకేదో దానమో చెయ్యాలంటే సాధ్యంకాదుకదా. అయితే వీళ్ళకి కూడా సూక్ష్మంలో మోక్షం చెప్పింది శాస్త్రం. అదెలాగో, శని దేవునికి, దానం చేయడానికి మద్య సంబంధం ఏంటో ఒక సారి తెలుసుకుందాం..

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

బియ్యం పిండిలో చక్కెర లేదా బెల్లం కలిపి చీమలకు పెట్టాలి. లేదా వుట్టి చక్కెర అయినా పెట్టవచ్చు. ఇలా చేస్తే పదివేలమందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది. ఇది ఇళ్ళల్లో, మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో కాకుండా దూరంగా, చీమలుండే చోట పెట్టాలి. కొందరు చెట్ల మొదట్లో చక్కెర జల్లుతారు...చీమలకోసమే.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

తేనెను తమలపాకులోగానీ రావి ఆకులోగానీ పెట్టి సూర్యుడికి, తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడే వదిలెయ్యవచ్చు. దీనికీ విశేష ఫలితముంటుంది. ఎందుకంటే తేనె ఎన్నో పువ్వులనుండి సేకరించబడుతుంది. అమృత తుల్యమైంది. దాన్ని చీమలకి పెడితే చాలా దోషాలు పరిహారమవుతాయి.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

అయితే దానం చెయ్యగలిగిన వాళ్ళుకూడా ఒకసారి చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుందికదా, పదివేలమందికి అన్నం పెట్టి అంత ఖర్చు పెట్టటం ఎందుకు, సూక్ష్మంలో మోక్షంగా చీమలకి చక్కెర పెట్టేద్దామనుకోకూడదు.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

ఈ విషయంలో పురాణ కధ కూడా ఒకటి వుంది. పూర్వం చాలా పేద వ్యక్తి ఒకతను వుండేవాడు. అతని దగ్గరకు ఒకసారి ఒకతను వచ్చి చెప్తాడు. నువ్వేదయినా దానం చెయ్యి, అప్పుడు నీకూ సిరిసంపదలు వస్తాయి. మనం దానం చెయ్యకుండా ఏమీ పొందలేము.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

ఇప్పుడు మనమనుభవిస్తున్న ప్రతి ఒక్కటీ ఇదివరకు మనం దానం చేసినవే. ఇదివరకు నువ్వేం దానం చెయ్యలేదేమో, అందుకే ఇలా వున్నావు. ఇప్పుడేదైనా దానం చేసి ఈ దారిద్ర్యంనుంచి బయటపడమని సలహా ఇస్తాడు.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

అప్పుడా నిరుపేద దానం చెయ్యటానికి నా దగ్గర ఏముంది? ఏందానం చెయ్యను? అని బాధ పడతాడు. అప్పుడా వచ్చిన వ్యక్తి ఎందుకు లేదు? నీ పెరట్లో తోటకూర వుందికదా దానిని దానం చెయ్యి అంటాడు. మిత్రుని మాట విని అతను అలాగే చేస్తాడు. ఆ దానంతో సిరి సంపదలు కలిగి తరువాత జీవితమంతా హాయిగా వుంటాడు.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

మరు జన్మలో అతను ఒక దేశానికి రాజుగా జన్మిస్తాడు. అంతేకాదు. అతనికి పూర్వ జన్మ జ్ఞానం కూడా వుంటుంది. పూర్వ జన్మలో తను చేసిన దానం వల్లకదా తనకింత సిరి సంపదలు వచ్చాయి అని ఈ జన్మలో కూడా అలాంటి దానం చేసి ఇంకా సిరి సంపదలు పొందాలనే వుద్దేశ్యంతో తన రాజ్యంలో అందర్నీ తోటకూర పెంచమని ఆజ్ఞ ఇస్తాడు.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

అంతకు ఇంతయితే ఇంతకు ఎంత అనుకుంటూ (పూర్వ జన్మలో కొంచెం తోటకూర దానం ఇచ్చినందుకే అంత సిరి సంపదలు వస్తే ఇప్పుడు తన రాజ్యం మొత్తం తోటకూర పెంచి, దాన్నంతా దానం ఇస్తే, తనూ తన ప్రజలూ ఇంకెంత సిరి సంపదలతో తులతూగుతారో) ఆ తోటకూరంతా దానమివ్వటం మొదలు పెడతాడు.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

ఒకసారి ఒక సన్యాసి ఆ రాజ్యానికి వస్తాడు. రాజు సన్యాసికి సకల మర్యాదలు చేసి తన అనుమాన, అదే, అంతకు ఇంతయితే..ఇంతకు ఎంత?...అని అడుగుతాడు. ఆ సన్యాసి, అంతకు ఇంతయితే ఇంతకు ఇంతే (శూన్యం అని అర్ధం వచ్చేటట్లు) చెప్తాడు.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

రాజు నిర్ఘాంతపోతాడు. అప్పుడా సన్యాసి చెప్తాడు...నీకు పూర్వ జన్మలో ఏమీలేదు. నిరుపేదవయిన నీవు నీ పెరట్లోని తోటకూర దానం చేసి ఎంతో పుణ్యం సంపాదించావు. మరి ఈ జన్మలో నువ్వు సిరి సంపదలతో తులతూగుతున్నావు. ఇంత సిరి సంపదలతో తులతూగే నువ్వు తోటకూరే దానం చేస్తానంటే ఫలితమేముంటుంది.

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

చీమలకు ఆహారం వేస్తే శనిమహాత్మ బాధించడా..?

శక్తి లేని వాళ్ళు ఏమి దానం చేసినా అమిత ఫలాన్నిస్తుందికానీ, అన్నీ వుండి, దానం చేసే శక్తి కలవారు తమ శక్తికొద్దీ దానం చెయ్యాలి. అంతేకానీ చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి దానం చేసిన పుణ్యం వస్తుందని అత్యాశతో అలా చెయ్యకూడదు. భూత దయతో, వాటికీ ఆహారం పెట్టే ఉద్దేశ్యంతో చెయ్యవచ్చు కానీ అల్ప దానంతో అనల్ప ఫలితాన్ని ఆశించకూడదు అని రాజుకి జ్ఞాన బోధ చేస్తాడు.

English summary

Shani Dosha Nivaran: Offering food to Ants

Shani or Saturn is the most fiery planet, according to Vedic astrology. Saturn is the slowest moving planet in the solar system. Due to this, it is a cold, barren, dry, secretive planet and its effects are felt with greater intensity and for longer periods than any other planet.
Story first published: Saturday, August 20, 2016, 17:01 [IST]
Desktop Bottom Promotion