For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందూ మతంలో గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యం

By Super
|

గృహ ప్రవేశము అనేది ఒక కొత్త ఇంటిలోకి ఒక వ్యక్తి మొదటగా ప్రవేశించే సందర్భంగా నిర్వహించే వేడుక. ఇల్లు సిద్దం అయ్యాక, కుటుంబ జ్యోతిషశాస్త్ర పట్టికల ద్వారా ఆ ఇంటికి వెళ్ళే ఒక పవిత్రమైన రోజు నిర్ణయించబడుతుంది.

గృహ ప్రవేశము సమయంలో పంచాంగము మరియు పవిత్రమైన సమయంను పరిగణనలోకి తీసుకోవాలి. మన పురాతన గ్రంధములలో గృహ ప్రవేశంను మూడు రకాలుగా పేర్కొన్నారు.

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

అపూర్వ: కొత్తగా ఎంపిక చేసిన భూమి మీద కొత్తగా నిర్మించిన ఇంటికి మొదటి ప్రవేశంను అపూర్వ (కొత్త) గృహ ప్రవేశము అంటారు.

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

సపూర్వ: విదేశాల్లో లేదా మిగిలిన ప్రాంతాల్లో లేదా వలసలు వెళ్లి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న ఇంటి లోకి ప్రవేశంను సపూర్వ గృహ ప్రవేశము అంటారు.

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

ద్వంద్ వహ్: అగ్ని, వరద, భూకంపం వంటి వాటి వల్ల దెబ్బతిన్న ఇల్లు పునర్నిర్మాణం లేదా పునరద్ధరణ అయిన తర్వాత ఇంటి లోకి ప్రవేశంను ద్వంద్ వహ్ గృహ ప్రవేశం అంటారు. అపూర్వ గృహ ప్రవేశము కోసం, ఖచ్చితమైన పవిత్రమైన సమయం అవసరం. సపూర్వ గృహ ప్రవేశం,ద్వంద్ వహ్ గృహ ప్రవేశం కొరకు పంచాంగం యొక్క స్వచ్ఛతను పరిశీలనలోకి తీసుకోవాలి.

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

పవిత్రమైన సమయాలు లేదా ముహార్తాలు

సూర్యుడు ఉత్తరాయన స్థానం లో ఉన్నప్పుడు కొత్తగా నిర్మించిన ఇంట్లో, మొదటగా ప్రవేశించటం శుభప్రదముగా ఉంది. పాత, పునరుద్ధరించిన ఇళ్ళకు గురు(బృహస్పతి) లేదా శుక్ర (వీనస్) సెట్ చేయాలి(ఈ సందర్భంలో నక్షత్రాల పట్టింపు లేదు). గృహ ప్రవేశము కొరకు చాంద్రమాన క్యాలెండర్ ఆధారంగా శుభప్రదమైన నెలలు ఉన్నాయి.

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

వాస్తు పూజ

వాస్తు దేవత కోసం వాస్తు పూజను ఇంటిలోకి నిజమైన ప్రవేశం ముందు ఇంటి బయట నిర్వహిస్తారు. ఒక రాగి కుండలో నిండుగా నీటిని పోసి,నవధాన్యాలు(తొమ్మిది రకాల ధాన్యాలు), ఒక రూపాయి నాణెం వేస్తారు. ఆ కుండ మీద కొబ్బరికాయను పెడతారు. ఆ కొబ్బరికాయను ఎర్రని వస్త్రంతో కప్పి మరియు ఎర్రని దారంతో ముడి వేస్తారు.ఆ తరువాత పూజారి పూజను ప్రారంభిస్తాడు. ఈ రాగి కుండను భర్త,భార్య కలిసి పట్టుకొని హోమంనకు సమీపంలో ఉంచుతారు.

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

వాస్తు శాంతి

వాస్తు శాంతి లేదా గృహ శాంతిలో హోమం ఉంటుంది. ఈ హోమంను గ్రహాల హానికరమైన ప్రభావాలు నిరోధించడానికి, ప్రతికూల స్పందనలను తొలగించి ఒక శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి నిర్వహిస్తారు. అన్ని పూజలు ముగిసిన తర్వాత, ఒక విందును పూజారికి సమర్పిస్తారు. అంతేకాక అతనికి చేసిన సేవలు మరియు మంచి శుభాకాంక్షల కోసం కొంత దక్షిణ లేదా రుసుమును ఇస్తారు. ఈ రెండు పూజలు అవసరం. గణపతి పూజ, సత్యనారాయణ పూజ, వైకల్పికం లక్ష్మీ పూజ వంటి ఇతర పూజలకు పూజారి సిఫార్స్ ఉంటే చేయవచ్చు.

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహ ప్రవేశములో చేయవలసినవి మరియు చేయకూడనివి

గృహ ప్రవేశము అంతవరకు పూర్తి కాలేదు.

ఇంటికి తలుపులు మరియు షట్టర్లు అమర్చాలి.

పైకప్పు కప్పబడి ఉండాలి.

వాస్తు దేవతల పూజలు లేదా త్యాగాలు ఇవ్వాలి

పూజారులకు విందు ఇవ్వాలి .

ఇంటిలో ఎవరైనా గర్భవతిగా ఉంటే గృహ ప్రవేశం చేయకూడదు.

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

గృహప్రవేశ వేడుక యొక్క ప్రాముఖ్యత

అయితే కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు పైన చెప్పిన పాయింట్లు పరిగణించరు. అవి నివసించే వారికి ఇబ్బంది మరియు కష్టములు తేగలదు. అందువలన, ఒక ఇంట్లో నివసిస్తున్నప్పుడు అన్ని ఆచారాలను వేదాలలో ఇచ్చిన పద్దతి ప్రకారం పూర్తి అయిన తర్వాతే పరిగణించాలి. గృహ ప్రవేశము వేడుక పూర్తి అయిన తర్వాత ఆ కుటుంబం కొత్త ఇంటిలోకి ప్రవేశించవచ్చు. అంతేకాక ఇంటిని ఎక్కువ రోజులు లాక్ వేసి ఉంచటం అశుభంగా పరిగణించబడుతుంది.

English summary

Significance of Hindu House Warming Ceremony(Griha Pravesh)

Griha Pravesh is a ceremony performed on the occasion of one's first entry into a new house. Once the house is ready, the family moves in on an auspicious day that is determined by the astrological charts.
Desktop Bottom Promotion