For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివ పురాణ రహస్యాలు: శివుని దృష్టిలో ఈ పాపాలు చేసేవారికి పాపవిముక్తి దక్కనట్లే..!

శివుడు అమాయకుడైనా... తన కోపాన్ని తట్టుకోవడం ఎవరితరమూ కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు కలిసి వచ్చినా.. శివుని కోపాన్ని తట్టుకోలేరు. అందుకే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణ

|

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు... అన్న విషయం అందరికి తెలిసిందే. అంటే ఈ ప్రకృతిలో జరిగే పనులన్నీ దైవాజ్ఞ లేకుండా జరగవని అర్ధం. పరమశివుడిని భోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది. సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. అలాగే తన భక్తులు చేసే పాపాలను తను మింగి... సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు.

Sins those are unpardonable in the eyes of Lord Shiva

శివుడు అమాయకుడైనా... తన కోపాన్ని తట్టుకోవడం ఎవరితరమూ కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు కలిసి వచ్చినా.. శివుని కోపాన్ని తట్టుకోలేరు. అందుకే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది. అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. మనుషులు ఈ పాపాలు కనుక చేస్తే శివుడు తప్పకుండ శిక్షిస్తాడని శివపురాణంలో ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

శివుని ప్రకారం ప్రతి మనిషి మూడు విధాలుగా పాపాలు చేస్తాడు. అవే.. ఆలోచనతో, చేష్టలతో మరియు మాటలతో...

మగవారు లేదా ఆడవారు ఇతరుల భార్య పొందాలనే కోరిక ఉన్నవారు

మగవారు లేదా ఆడవారు ఇతరుల భార్య పొందాలనే కోరిక ఉన్నవారు

మగవారు లేదా ఆడవారు ఇతరుల భార్య లేదా భర్తను పొందాలనే ఆలోచన చేసినా అది క్షమించరాని పాపం.

ఇతరుల సంపదని పొందాలనే కోరిక ఉన్నవారు..

ఇతరుల సంపదని పొందాలనే కోరిక ఉన్నవారు..

ఇతరుల సంపదని పొందాలనే కోరిక ఉండటం కూడా క్షమించరాని పాపం.

ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించడం..

ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించడం..

ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించాలని, వారి కలలను నాశనం చేయాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపం.

ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా..

ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా..

ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా లేదా ఎవరినైనా తప్పుడు మార్గంలోకి నెట్టాలని ఆలోచించినా అది శివుని దృష్టిలో క్షమించరాని పాపం.

గర్భిణి స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్థించడం..

గర్భిణి స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్థించడం..

గర్భిణి స్త్రీల పట్ల లేదా ఆ రోజులు గడుపుతున్న స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా లదా వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని పాపం.

అబద్ధాలు చెప్పడం కూడా క్షమించరాని పాపం..

అబద్ధాలు చెప్పడం కూడా క్షమించరాని పాపం..

ఎవరినైనా ఉద్దేశించి.. వారి కీర్తి, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వారి గురించి అబద్ధాలు చెప్పడం కూడా క్షమించరాని పాపం.

పుకార్లు సృష్టించి, ఒకరి వెనకాల మాట్లాడుకోవడం..

పుకార్లు సృష్టించి, ఒకరి వెనకాల మాట్లాడుకోవడం..

అనవసరమైన పుకార్లు సృష్టించి, ఒకరి వెనకాల మాట్లాడి.. సమాజంలో వారికి చెడ్డ పేరు తేడానికి ప్రయత్నించినా అది క్షమించరాని పాపం.

 అత్యంత పవిత్రంగా భావించే వాటిని తినడం క్షమించరాని పాపం.

అత్యంత పవిత్రంగా భావించే వాటిని తినడం క్షమించరాని పాపం.

హిందూ పురాణాల ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే వాటిని తినడం క్షమించరాని పాపం.

మహిళలు, చిన్న పిల్లలు పట్ల తప్పుగా ప్రవర్తించడం..

మహిళలు, చిన్న పిల్లలు పట్ల తప్పుగా ప్రవర్తించడం..

హింసాకాండలో పాల్గొనడం, మహిళలు, చిన్న పిల్లలు లేదా బలహీనమైన ప్రాణి పట్ల తప్పుగా ప్రవర్తించడం కూడా క్షమించరాని పాపం.

ఇళ్ళకు నిప్పంటించడం,

ఇళ్ళకు నిప్పంటించడం,

పశువుల పాకకు, అడవికి లేదా ఇళ్ళకు నిప్పంటించడం,

తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం..

తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం..

ఒక అమ్మాయికి తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం.

కోడలితో లేదా వదినతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం..

కోడలితో లేదా వదినతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం..

కోడలితో లేదా వదినతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం కూడా శివుని దృష్టిలో క్షమించరాని పాపం.

ఒకరి సంపదని, ఆస్తిని దోచేయడం..

ఒకరి సంపదని, ఆస్తిని దోచేయడం..

ఒకరి సంపదని, ఆస్తిని లేదా మరొక్కరి జీవిత భాగస్వామిని అనుభవించడం కూడా క్షమించరాని పాపం.

దేవాలయం నుంచి దొంగిలించడం

దేవాలయం నుంచి దొంగిలించడం

దేవాలయం నుంచి లేదా బ్రాహ్మణుల నుంచి ఏదైనా దొంగలించడం కూడా క్షమించరాని పాపం.

గురువులు, తల్లితండ్రులు, వృద్దులను తిట్టినా..

గురువులు, తల్లితండ్రులు, వృద్దులను తిట్టినా..

గురువులు, తల్లితండ్రులు, వృద్దులు, సన్యాసులు, వికలాంగులను తిట్టినా లేదా వారిపై చేయ్యిచేసుకున్నా శివుని దృష్టిలో అది మహాపాపం.

మత్తు పానీయాలు సేవించినా..

మత్తు పానీయాలు సేవించినా..

మత్తు పానీయాలు సేవించినా, గురువు యొక్క భార్యతో సంబంధాలు పెట్టుకున్నా, ధానం చేసిన వాటిని మరలా పొందాలని చూసినా, తప్పుడు మార్గంలో సంపాదించినా అది మహాపాపం అని శివపురాణం చెబుతుంది.

English summary

Sins those are unpardonable in the eyes of Lord Shiva

It is said that as easy it is to appease him; the following sins are unforgivable in the eyes of Lord Shiva. As mentioned in Shiva Purana, when Suta asks about things that invokes Shiva’s anger, the sages told him about the 12 sins.
Desktop Bottom Promotion