For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాలి అపహరణ నుండి సుగ్రీవుడు తన భార్యను ఎలా రక్షించుకొన్నాడు

|

వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు (ఋక్షరజుడు?) అనే గొప్ప వానర రాజు కి పుట్టిన ఔరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నానం చేస్తాడు, ఆ తటాకం కి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరస గా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు , ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగం లోను, కంఠభాగం లోను వీర్యాన్ని విడిచి పెడతారు.

దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములొ బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములొ వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగం లలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు. ఈ విషయాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడితో పలికిన మాటలు. READ MORE: రామాయణంలో రాముడి తండ్రి దశరథుడు శాపానికి గురవ్వడానికి కారణాలేంటి

వాలి , సుగ్రీవులు మద్య వైర్యం

వాలి , సుగ్రీవులు మద్య వైర్యం

సుగ్రీవుడు అన్నకు విధేయుడైన సేవకుడు. ఒకమారు మాయావి అనే రాక్షసుడు (దుందుభి కొడుకు) వాలిపై యుద్ధానికి వచ్చాడు. వాలి, మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు. సుగ్రీవుడిని బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు. నెల కాలం గడచినా వారు బయటకు రాలేదు. పెడ బొబ్బలు ఆగిపోయాయి. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు. రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి, దుఃఖిస్తూ కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రుల కోరికపై రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు.

అయితే కొంత కాలానికి వాలి తిరిగి వచ్చాడు. దుర్బుద్ధితో సుగ్రీవుడు కొండ బిలాన్ని మూసివేశాడని దూషించి అతన్ని రాజ్యంలోంచి తరిమేశాడు. తన అనుచరులైన హనుమంతుడు, మరి కొద్ది మంది పరివారంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తల దాచుకొన్నాడు.

సోదరుని భార్యను అపహారించిన వాలి:

సోదరుని భార్యను అపహారించిన వాలి:

రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు... లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే ‘‘వాలి'' కథ కూడా ఒకటి.

పూర్వం వాలి, సుగ్రీవులు అనే ఇద్దరు సోదరులు వుండేవారు. వీరిద్దరిలో సుగ్రీవుడు ఎంత ఉత్తముడో... వాలి అంత హీనుడు. ఇద్దరూ చూడటానికి ఒకేరకంగా వుండటం వల్ల... వాలి దానిని అదునుగా తీసుకుని ఎన్నో పాపాలను చేసి, వాటిని సుగ్రీవుని మీద మోసేసేవాడు. అలాగే సుగ్రీవుడు చేసే మంచి పనులకు ఇతను చేసినట్టుగా నలుగురిలో చెప్పుకునేవాడు.

సోదరుని భార్యను అపహారించిన వాలి:

సోదరుని భార్యను అపహారించిన వాలి:

ఒకనాడు... ఏ విధంగా అయితే రావణాసురుడు, సీతమ్మకు అపహించుకుపోయాడు... అదేవిధంగా వాలి కూడా సుగ్రీవునిని బాగా కొట్టి, గాయపరిచి.. అతని భార్య అయిన ‘‘రుమ''ను ఎత్తుకుపోతాడు. ఆమెను కిష్కింధలో బంధించి దాచేస్తాడు. దీన్ని బట్టే తెలుస్తుంది సుగ్రీవుడు ఎంత ఉత్తముడో, వాలి అంత హీనుడని. ఈ ఘోర అవమానాన్ని భరించలేక సుగ్రీవుడు తన రాజ్యం నుంచి పారిపోయి ఋష్యమూకపర్వతంపై నివాసాన్ని ఏర్పరుచుకుంటాడు.

సోదరుని భార్యను అపహారించిన వాలి:

సోదరుని భార్యను అపహారించిన వాలి:

హనుమంతుడు మొదలైనవారితో కలిసి ఉంటూ భార్యను కలుసుకునే రోజు కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. కొన్నాళ్ల తరువాత అతనున్న ప్రదేశానికి సీతాన్వేషణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, హనుమంతులు, వారి సైన్యం తదితరులు అక్కడికి చేరుకుంటారు.

సోదరుని భార్యను అపహారించిన వాలి:

సోదరుని భార్యను అపహారించిన వాలి:

మొదట్లో సుగ్రీవుడు వారిని చూసి, తనను చంపడానికి వచ్చినవారని భావించి హనుమంతుడితో గొడవ పడతాడు. అనంతరం రాముడిని చూసి తన తప్పును తెలుసుకొని వారి పట్ల సద్భావం కలిగి ఉంటాడు. తన సోదరుడు చేసిన దురాగతాన్ని వారికి వివరిస్తాడు. అతని విషాదగాధను విన్న రామదండు.. అతని రాజ్యాన్ని, భార్యని తిరిగి రప్పించేలా సహాయం చేస్తామని మాటిస్తారు.

సోదరుని భార్యను అపహారించిన వాలి:

సోదరుని భార్యను అపహారించిన వాలి:

రాముడు ఇలా చెబుతుండగానే సుగ్రీవుడు... ‘‘వాలి ఎంతో బలశాలి. అతన్ని జయించడం అంత సులభం కాదు'' అని చెబుతాడు. అప్పుడు రాముడు చిరునవ్వుతో తన విల్లును తీసి, ఒకే ఒక్క బాణంతో ‘‘సప్తతాళశ్రేణి''ని (ఏడు తాటిచెట్ల వరుస) కూల్చేస్తాడు. అది చూసిన సుగ్రీవుడు... రాముడు ఎంతటి పరాక్రమబలవంతుడో తెలుసుకుంటాడు.

సోదరుని భార్యను అపహారించిన వాలి:

సోదరుని భార్యను అపహారించిన వాలి:

ఇది గడిచిన కొన్నాళ్ల తరువాత శ్రీరాముడు చెప్పినట్లుగానే.. సుగ్రీవుడు, వాలిని యుద్ధానికి పిలుస్తాడు. దాంతో వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఒక చెట్టుచాటులో వున్న శ్రీరాముడు, వాలికి సూటిగా బాణం వేయగా అది అతనికి తగులుతుంది. ఆ దెబ్బకు మూర్ఛపడిపోయిన వాలి... ‘‘చెట్టు చాటు నుంచి ఇలా దాడి చేయడం న్యాయమా'' అని అడుగుతాడు వాలి.

సోదరుని భార్యను అపహారించిన వాలి:

సోదరుని భార్యను అపహారించిన వాలి:

అతని చెప్పిన మాటలకు రాముడు కోపాద్రిక్తుడై... ‘‘తమ్ముణ్ణి చావకొట్టి.. అతని భార్యను అపహరించుకుపోవడం న్యాయమా?'' అని ప్రశ్నిస్తాడు రాముడు.

సోదరుని భార్యను అపహారించిన వాలి:

సోదరుని భార్యను అపహారించిన వాలి:

అప్పుడు వాలి తన తప్పును తెలుసుకుని, క్షమించమని పశ్చాత్తాపడతాడు. ‘‘హే రామా! నీలాంటి మహోన్నత వ్యక్తి చేతిలో చావడం నా భాగ్యం'' అంటూ తుది శ్వాసను విడుస్తాడు.

రాముని చలవతో సుగ్రీవుడు తన భార్యను చేరుకోవడమే కాకుండా తన రాజ్యం అయిన కిష్కింధను దక్కించుకుంటాడు.

 వాలి చివరి కోరికలు

వాలి చివరి కోరికలు

వాలి ఇలా అన్నాడు- రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.

 వాలి చివరి కోరికలు

వాలి చివరి కోరికలు

తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.

 వాలి చివరి కోరికలు

వాలి చివరి కోరికలు

పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.

 వాలి చివరి కోరికలు

వాలి చివరి కోరికలు

అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.

English summary

Story Of Vali Sugriva and Rama

Vali was famous for the boon that he had received, according to which anyone who fought him in single-combat lost half his strength to Vali, thereby making Vali invulnerable to any enemy. Once Ravana called Vali for a fight when Vali was doing his regular Sandhyavandanam.
Desktop Bottom Promotion