For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుద్ధిజం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు

By Nutheti
|

గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక వేత్త. నేపాల్ కి చెందిన గౌతమ బుద్దుడు ప్రారంభించిన బుద్ధిజం.. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పాకింది.. అలాగే అనేకమందికి స్పూర్తినిచ్చింది. గౌతమ బుద్ధుడు ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించాడు. ఇప్పటికీ.. బుద్ధిడి హితబోధ మనకు ఉపయోగపడుతూనే ఉంది. అలాగే మనుషులు ఉన్నంతవరకు బుద్ధిజానికి విలువ ఉంటుంది. బుద్ధిడి జీవితంలో ప్రతి అంశం స్పూర్తిదాయకం, జ్ఞానం ప్రబోధించేదే. ఇక్కడ బుద్ధుడి నుంచి నేర్చుకోవాల్సి మరిన్ని విషయాలు, ఆసక్తికర అంశాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

buddha teachings


ఉపశమనం కలిగించే ప్రేమ: ప్రేమ పంచడం, ప్రేమ తత్వం కలిగి ఉంటడం అనేది బుద్ధిడి హితబోధ సారాంశం. మనిషిలో ప్రేమ ఉంటే ఈ ప్రపంచంలో జయించలేనిది అంటూ ఏదీ ఉండదు. మీలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో.. మీ నుంచి నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుందని గొప్ప తత్వం బుద్ధిజం వివరిస్తుంది.

buddha teachings

ప్రస్తుతం: బుద్ధుడు ప్రస్తుతం జరుగుతున్న దానిపైనే దృష్టి కేంద్రీకరించాలని చెబుతాడు. జరిగిపోయిన గతం, జరగబోయే భవిష్యత్ గురించి పట్టించుకోకూడదని సూచించారు. ఈ సింపుల్ లాజిక్ ఫాలో అయితే.. ఈ పోటీ ప్రపంచంలో మనం టార్గెట్ రీచ్ అయ్యే ధైర్యాన్ని పొందగలుగుతాం.

buddha teachings

మానసిక ప్రశాంతత: అసలైన నిధి బయట కాదు.. లోపలే ఉందని బుద్ధుడు వివరించారు. ఎందుకంటే.. భౌతిక ఆనందాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. ప్రశాంతత అనేది మన మనసులో నుంచి వస్తుంది. మనసు సంతోషంగా, శాంతంగా ఉన్నప్పుడే.. అసలైన ఆనందమని.. బుద్ధుడు ప్రబోధించాడు.

buddha teachings

వదిలిపెట్టడం: జ్ఞానోదయం పొందడానికి సులువైన మార్గం.. కోర్కెలన్నింటినీ వదిలిపెట్టాలి. అలాగే మైండ్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. మన మైండ్ కంట్రోల్ లో ఉంటే.. అంతకంటే పవర్ ఫుల్ ఆయుధం మరొకటి ఉండదు. కానీ.. అది క్రమశిక్షణలో లేకపోతే.. అంతే ప్రమాదకరమైనదని బుద్దుడు వివరించాడు.

buddha teachings

ఇతరుల పట్ల జాలి: ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇతరుల సపోర్ట్ లేకపోతే.. మనుగడ సాగించలేము. ఇలాంటి ప్రపంచంలో స్వార్థానికి అర్థంలేదు. కేవలం ఇతరులపై చూపించే జాలి, కరుణ మాత్రమే ఈ ప్రపంచంలో ఉపశమనం కలిగించే అంశాలు. ఎలాంటి విధ్వంసాలనైనా ఆపే శక్తి సామర్థ్యాలు మనుషుల కరుణతోనే సాధ్యమని బుధ్దిజం వివరిస్తుంది.

English summary

The Essence Of Buddha's Teachings

Siddhartha or Guatama Buddha was one of the world's greatest spiritual figure. He originated from Nepal. He started Buddhism which spread to many parts of the world and inspired many.
Story first published: Tuesday, December 22, 2015, 14:12 [IST]
Desktop Bottom Promotion