For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి రోజున లక్ష్మి పూజ విధి విధానం ..విశిష్టత..!

By Staff
|

దీపావళి వేడుకలో లక్ష్మి పూజ చాలా ముఖ్యమైన భాగం. లక్ష్మి దేవి భృగు మహర్షి కూతురుగా చెప్పుతారు. ఆమె సాగర మదన సమయంలో పునర్జన్మ ఎత్తి మహా విష్ణువును వివాహం చేసుకొనెను.

ఆమెను సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవతగా మరియు విజయం సాధించడానికి భక్తులు పూజలు చేస్తారు. ఈ పూజను చేయటానికి అనుసరించవలసిన కొన్ని ఆచారాలు ఉన్నాయి. దేవత దయను చూపటానికి పూజ విధిని సాధించటం చాలా సులభం. సంస్కృత భాష తెలియవలసిన అవసరం లేదు.

పూజ నిర్వహించడానికి ముహర్తం (ఆదర్శ సమయం)
ఈ సంవత్సరం లక్ష్మీ పూజ అక్టోబర్ 30 న వస్తుంది. లక్ష్మి పూజను 17:39 -22:19 మధ్య మరియు 5:39 PM - 10:19 PM మధ్య నిర్వహించాలి.

లక్ష్మి పూజ పూర్తి విధి

1. క్లీనింగ్:

1. క్లీనింగ్:

లక్ష్మి పూజను ప్రారంభం చేయటానికి ముందుగా ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిలో అన్ని రకాల మాలిన్యాలను తొలగించటానికి గంగా జలాన్ని ఇంటి లోపల,బయట జల్లాలి.

2. కలశం ఏర్పాటు:

2. కలశం ఏర్పాటు:

ఆ తర్వాత ఎత్తైన వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని పెట్టాలి. బంగారం, వెండి, రాగి లేదా టెర్రకోటతో తయారుచేసిన కలశాన్ని పెట్టవచ్చు. ఆ కలశంలో ముప్పావు వంతు నీటిని పోయాలి.

3. కలశం:

3. కలశం:

కలశంలో ఐదు లేదా ఏడు మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి.

4. వినాయకుడి పూజ:

4. వినాయకుడి పూజ:

కళాశానికి కుడి వైపున, నైరుతి దిశలో వినాయక విగ్రహాన్ని ఉంచాలి. హిందూ మతంలో ప్రతి పూజలోను విధిగా వినాయకుణ్ణి పూజిస్తారు. ఈ విగ్రహానికి, కుంకుమ, పసుపుతో తిలక ధారణ చేయాలి.

5. హారతి పల్లెం:

5. హారతి పల్లెం:

పుస్తకాలు మరియు మీ వ్యాపార పత్రాల కొరకు పక్కన ఒక వేదికను ఏర్పాటు చేయాలి. అంతేకాక హారతి కోసం ఒక పళ్లెంను సిద్ధం చేయాలి. ఒక పళ్లెంలో పసుపు, కుంకుమ, బియ్యం గింజలు, గంధం, కుంకుమ, తామర పుష్పాలు మరియు దీపాలు ఉంచాలి. దీపాల వెలుగులో పూజను ప్రారంభించాలి.

6. అక్షింతలు:

6. అక్షింతలు:

కలశం మీద అక్షింతలను జల్లుతూ లక్ష్మి దేవి మంత్రాలను పఠించాలి. ఆమె దీవెనలను పొందటానికి ఈ విధంగా దేవతను అర్థించాలి.

7.పంచామృతం:

7.పంచామృతం:

ఇప్పుడు లక్ష్మి దేవికి పంచామృతాలతో ( పాలు, పెరుగు, గంగా జలం, తేనె, నెయ్యి) అభిషేకం చేయాలి. ఆ తర్వాత విగ్రహాన్ని నీటిలో అభిషేకం చేయాలి. ఒక బంగారు ఆభరణం లేదా ఒక ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి.

8. లక్ష్మీ దేవి అలంకరణ:

8. లక్ష్మీ దేవి అలంకరణ:

దేవత యొక్క నుదుటిపై తిలకాధారణ చేసి మరియు విగ్రహం ముందు బంతి పూలు, కుంకుమ, పసుపు, బియ్యపు గింజలు, గంధం మరియు కుంకుమ పేస్ట్, స్వీట్లు, పండ్లు, కొబ్బరి, మొదలైన సమర్పణలు ఉంచాలి. అలాగే కొన్ని బంగారు లేదా వెండి ఆభరణాలు, ముత్యాలు లేదా నాణేలను కూడా సమర్పించవచ్చు.

9. ఆ తర్వాత హారతి ఇచ్చి

9. ఆ తర్వాత హారతి ఇచ్చి

మనస్సులోని కోరికలను నివేదించాలి. హారతి సమయంలో బిగ్గరగా శ్లోకాలు పఠించవలసిన అవసరం లేదు.ఇతర దేవతల వలే ఎక్కువ శబ్దాలు అవసరం లేదు. హారతి సమయంలో ఘన ఘన మ్రోగే చిన్న గంట సరిపోతుంది.

English summary

The Lakshmi Puja Vidhi For Diwali

Lakshmi puja is a very important part of the entire Diwali celebration. Goddess Lakshmi is said to be the daughter of the Rishi Bhrigu, who during the Samudra Manthan was reborn and then got married to Lord Vishnu.
Desktop Bottom Promotion