For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెవులు కుట్టించడం సంప్రదాయమా ? మూఢనమ్మకమా ? సైన్సా ?

By Swathi
|

చెవులు కుట్టించడం అనే సంప్రదాయం హిందువులు పాటించే పురాతన ఆచారం. పురాణాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని అమ్మాయిలకు నిర్వహిస్తారు. అమ్మాయి పుట్టిన తర్వాత మూడేళ్లలోపు, లేదా ఐదేళ్లలోపు లేదా ఏడేళ్ల లోపు అంటే.. అమ్మాయి వయసు బేసి సంఖ్య సంవత్సరంలో ఉండగా నిర్వహిస్తారు. హిందూయిజంలో ఇదో గొప్ప, ముఖ్యమైన సంప్రదాయం. అందుకే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నాం.

పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ? పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?

అమ్మాయిలకు ఎడమ చెవికి ముందుగా పోగు కుట్టిస్తారు. అబ్బాయిలకు అయితే కుడి చెవికి ముందుగా కుట్టిస్తారు. పిల్లలను ఖచ్చితంగా వాళ్ల మేనమామ ఒంట్లో కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కూర్చునేటప్పుడు తూర్పువైపు ముఖం చేయాలి. ఉదయాన్నే ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం పూర్తవ్వాలి.

చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్లకోసం, వాళ్ల అందం కోసమని చాలా మంది భావిస్తారు. మరికొందరు ఇదో మూఢనమ్మకంగా భావిస్తారు. అందుకే ఈ కాలంలో చాలామంది చెవి పోగు కుట్టించే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఆర్టిఫిషియల్ గా దొరికే కమ్మలతో చెవికి అతికిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఈ సంప్రదాయం వెనక గొప్ప సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి.

<br><strong>ఇండియన్స్ ఫాటించే మూఢనమ్మకాల వెనకున్న రహస్యాలు</strong>
ఇండియన్స్ ఫాటించే మూఢనమ్మకాల వెనకున్న రహస్యాలు

చెవులు కుట్టించడం అనే సంప్రదాయం పెద్దలకు హడావుడిగా, సందడిగా ఉన్నా.. చిన్నారులకు మాత్రం చాలా నొప్పి కలిగిస్తుంది. చెవులకు రంధ్రాలు పెట్టడం వల్ల పిల్లలు ఏడుస్తారు. చాలా నొప్పిగా ఉంటుంది. కానీ.. నొప్పిగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందే అని వేదాలు చెబుతున్నాయి. దీనివల్ల పిల్లలకు భవిష్యత్ లో అనేక ప్రయోజనాలు చేకూరుతాయనే మన పెద్దలు ఈ ఆచారం తీసుకొచ్చారు. కాబట్టి.. చెవులు కుట్టించడం గురించి సైన్స్ ఏం చెబుతోందని ఇప్పుడు చూద్దాం..

భారతీయుల టెక్నిక్

భారతీయుల టెక్నిక్

చెవులు కుట్టించడం అనేది ఆక్యుపంక్చర్ వైద్య విధానానికి సంబంధించినదని తెలుస్తోంది. అయితే.. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ.. ఇండియన్సే కనిపెట్టారని.. ఇది భారతీయుల సంప్రదాయమని చెబుతున్నారు. ఆ తర్వాతే చైనీస్ మన ఆచారాన్ని తీసుకున్నారని వివరిస్తున్నారు.

హెల్త్ బెన్ఫిట్స్

హెల్త్ బెన్ఫిట్స్

చెవికి కళ్లు, ముక్కు, పళ్లు వంటి అవయవాలతో సంబంధం ఉంది. కాబట్టి చెవులు కుట్టించడం వల్ల అనేక హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అబ్బాయిలకు

అబ్బాయిలకు

పూర్వం మహిళలు, మగవాళ్లు ఇద్దరూ.. చెవి పోగులు ధరించేవాళ్లు. మధ్యలో ఈ ఆచారాన్ని కేవలం ఆడవాళ్లకే పరిమితం చేశారు. కానీ ఇటీవల.. మగవాళ్లు కూడా ఫ్యాషన్ అంటూ చెవి పోగులు ధరించడం మొదలుపెట్టారు.

చెవి నొప్పులు

చెవి నొప్పులు

చెవులు కుట్టించడం వల్ల చెవి సంబంధమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. చెవుల్లో ఉండే కొన్ని నాడులను ప్రెషర్ ద్వారా ఉత్తేజితం అవుతాయి.

రుతు సంబంధ సమస్యలు

రుతు సంబంధ సమస్యలు

చెవులు కుట్టించడం వల్ల రుతు సంబంధ అనారోగ్య సమస్యలు రావు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

అబ్బాయిల్లో హెర్నియా

అబ్బాయిల్లో హెర్నియా

చెవులు కుట్టించడం వల్ల కేవలం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయని శుశ్రుత సంహిత వివరిస్తోంది. చెవులు కుట్టించడం వల్ల భవిష్యత్‌లో మగపిల్లలు హైడ్రోసిల్, హెర్నియా వంటి వ్యాధులకు సోకకుండా ఉంటారు.

మెదడు ఆరోగ్యం

మెదడు ఆరోగ్యం

మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చెవులు కుట్టడం వల్ల ఆ ప్రాంతంలో నాడీ మండల వ్యవస్థను ఉత్తేజితం చేసే నాడులు ప్రేరేపించబడతాయి. దీంతో జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

కంటిచూపు

కంటిచూపు

చెవులకు కింది భాగంలో మధ్యలో పోగులు కుట్టడం వల్ల కళ్లకు సంబంధించిన నాడులు ఉత్తేజితమై.. కంటిచూపు మెరుగుపడుతుంది.

టెన్షన్

టెన్షన్

ఆందోళన, మానసిక రుగ్మతలు దూరంగా ఉంటాయి.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

జీర్ణక్రియ, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఒబేసిటీ రిస్క్ ని తగ్గిస్తుంది.

ఫ్యాషన్ ఇయర్ రింగ్స్

ఫ్యాషన్ ఇయర్ రింగ్స్

కాబట్టి చెవులు కుట్టించడాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఫ్యాషన్ గా భావించకండి. అలాగే ప్లాస్టిక్, ఇనుము వంటి లోహాలతో చేసిన చెవిపోగులు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. అలాంటివి పెట్టుకుంటే.. ఇన్ని ప్రయోజనాలు చేకూరవు. రాగి, బంగారం, వెండితో తయారు చేసిన చెవిపోగులు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

మూఢనమ్మకం కాదు

మూఢనమ్మకం కాదు

ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఇలాంటి హిందూ సంప్రదాయాలను మూఢనమ్మకాలుగా తీసిపారేయకండి. మన పూర్వీకులు పాటించిన ఆచారాల వెనక ఉన్న సైన్స్ ని గ్రహించి.. ఆ ఆచారాలను అలవరచుకోవడం మంచిది.

English summary

The Science Behind Ear Piercing

The Science Behind Ear Piercing. ear-piercing ceremony, is a Hindu tradition that is being followed since ages. This is one of the most important rituals in Hinduism and although it has a scientific basis behind it.
Story first published: Wednesday, April 27, 2016, 13:39 [IST]
Desktop Bottom Promotion