కార్తీక మాసంలో వన భోజనాలకున్న ప్రాధాన్యత..ఆనందాల మేళవింపు..!!

కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం,ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలను,హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాద

Posted By:
Subscribe to Boldsky

కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. ఊరూవాడా సందడిగా ఉంటుంది. వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంధాల్లో ఉంది. ముఖ్యంగా ''కార్తీక పురాణం''లో కార్తీక పౌర్ణమినాడు నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది.

ఉసిరిచెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికలతో హరిని పూజించి, గోవింద నామస్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి ఆనక వనభోజనాలు చేశారు.అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి ఆనందిస్తున్నాం. ఇంతకీ కార్తీక వనభోజనాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం.

కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది

కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం,ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలను,హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తీక వన భోజనాలుగా పేర్కొంటారు.

భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత

భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువుకు పూజించి, వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యాన వనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు.

భక్తి ఆధ్యాత్మిక భావనే మూలం


పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం వెనుక భ క్తి ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి. ఁకార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద విష్ణు భగవానుని ఎన్ని పుష్పాలతో పూజిస్తే వాటి సంఖ్యను బట్టి అన్ని అశ్వమేధ యాగాల ఫలం దక్కుతుందని కార్తీక పురాణంలో లిఖించి ఉంది.

వన భోజనాల సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణు పూజ నిర్వహించి,పంచ భక్షాలతో స్వామికి నివేదించి,

అందుకే వన భోజనాల సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణు పూజ నిర్వహించి,పంచ భక్షాలతో స్వామికి నివేదించి, అనంతరం బ్రాహ్మణులకు దానాలిచ్చి బంధు,మిత్ర సపరివారంగా భుజిస్తే అఖిలాండ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యక్షేత్రాలలో మహావిష్ణువును కొలిచిన పుణ్యం ఫలం దక్కుతుందని ప్రతీతి.

కళా ప్రావీణ్య ప్రదర్శనకు చక్కటి వేదిక

కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట,పాట కబుర్లకు ఇది చక్కటి వేదిక. పిల్లలు,పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీ డలు, నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది.

కృష్ణుడి వన భోజనం

ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు, ఇతర స్నేహితులతో- ఓరేయ్, రేపు మనమందరం వనభోజనానికి వెళుతున్నాం రా! అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్లకు కొత్తగా వన భోజనం ఎం దుకు? ఎందుకంటే- వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాల నేది ఆయన ఉద్దేశం. అం దరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురకి ఉండే లక్షణం ఏమిటంటే, వాళ్ళు ఉదయం స్నానం చేయరు. సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింటారు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపిం చిన లీలలు ఒకటా రెండా..!

కృష్ణుడి వన భోజనం

అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి.. బ్రహ్మాన్ని అరిగించడం.. అంటే కృష్ణభగవానుడి లీలల్ని ఆస్వాదించటమే వన భోజనం. ఆ వన భోజనంలోు ఏ అరమ రికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదామ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అన్రుగహాన్ని, పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.

ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి

ప్రకృతి వనభోజనం కార్తీక మాస పూజా విధుల్లో ముఖ్యమైనది. కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి. వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించే అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం. ఆ తరువాత అందరూ కలిసి వండిన పదార్థాలను దేవునికి నివేదించి ఉసిరిక, అశ్వత్థ, బిల్వ తదితర వృక్షాల నీడలో సామూహింగా భోజనం చేస్తారు.

ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి

ఇలా చేయడం వలన ఆ యా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వృక్షాల నీడన అరటి ఆకుల్లో కానీ, పనస ఆకుల్లో కానీ పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద, పురాణాల వచనం.

ప్రజల్లో ఆత్మీయతానురాగాలు

ఇలా వనభోజనం చేయడంవల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు, సమైక్యతకు దోహదం చేస్తుంది. ఆనందానికి సంకేతం పచ్చదనం, దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకొంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో, నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారు. వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అన్రుగహాన్ని, పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడాన్ని వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.

English summary

The Significance of Karthika Vanabhojanalu ..!!

Vanabhojanam or Karthika vanabhojanam is a kind of annual ritualistic picnic undertaken during Karthika masam in Andhra Pradesh. As per Hindu tradition, plants are considered to be of divine nature and worshipped as Gods. Certain plants like Tulsi, amla, bilva and durva plants are considered as divine and used in Pujas.
Please Wait while comments are loading...
Subscribe Newsletter