For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి రోజు మిఠాయిలు బహుమతిగా ఇచ్చే సంప్రదాయం

దీపావళి, దీపాల పండుగ, ఈ పండుగ సరదా, సంతోషం, వేడుకలకు ఒక చిహ్నం. ఇది మిఠాయిల వేడుక కూడా. ఎటువంటి సంతోషకరమైన సందర్భాలలో, వేడుకల లోనైనా మిఠాయిలతో సంబరాలు జరుపుకోవడం అనేది తెలిసిన విషయం. వివిధ రకాల మిఠాయి

By Staff
|

దీపావళి, దీపాల పండుగ, ఈ పండుగ సరదా, సంతోషం, వేడుకలకు ఒక చిహ్నం. ఇది మిఠాయిల వేడుక కూడా. ఎటువంటి సంతోషకరమైన సందర్భాలలో, వేడుకల లోనైనా మిఠాయిలతో సంబరాలు జరుపుకోవడం అనేది తెలిసిన విషయం. వివిధ రకాల మిఠాయిలతో ఆనందించేది దీపావళి పండుగ. ఈ పండుగ మీ స్నేహితులు, కుటుంబం, బంధువులకు ప్రేమను పంచడానికి ఒకరికి ఒకరు బహుమతులను పంచుకునే వేడుక.

Tradition of Gifting Sweets in Diwali


మనం పండుగ గురించి మాట్లాడుకునేటపుడు, అది కేవలం వెలుగులు, దివ్వెలు, దీపావళి మందులకే పరిమితం కాదు. దీపావళి కొన్ని నోరూరించే వంటలకు కూడా ప్రసిద్ది చెందింది. భారతదేశంలోని ప్రతి మతం వారు ప్రత్యేకంగా ఈ పండుగ రోజు సాంప్రదాయ రకాలతో కూడిన మిఠాయిలు, స్వీట్లు తయారుచేస్తారు. మిఠాయిలను బహుమతిగా ఇచ్చుకోడం అనేది ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి మంచిని, ఆనందాన్ని కలుగచేస్తుంది.

Tradition of Gifting Sweets in Diwali

దీపావళి మిఠాయిలు, స్వీట్లు పండుగలో ఒక అంతర్భాగం. ఆ రోజు ప్రతి ఇల్లు మిఠాయిలతో సందర్శకులను ఆహ్వానిస్తుంది. మిఠాయిలతో కూడిన బహుమతులు, స్వీట్ హామ్పర్లు మన చుట్టుపక్కల వారికి, కార్పోరేట్ ఆఫీసులలో, ఫాక్టరీలలో పనివారికి, స్నేహితులకు, మనకు ఇష్టమైన వారికి, అనుకోని, అనుకోకుండా వచ్చే అతిధులకు పంచడం ఆనవాయితీ.
Tradition of Gifting Sweets in Diwali

కంపెనీలు తమ ఉద్యోగస్తులకు మిఠాయిలను బహుమతిగా ఇస్తారు, తల్లిదండ్రులు పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి మిఠాయిలను పంపుతారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు మిఠాయిలు పంచిపెడతారు. మిఠాయిలు ఎక్కువగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్, గింజలు, కుంకుమ పువ్వుతో నిండి ఉంటాయి.

Tradition of Gifting Sweets in Diwali

దీపావళి రోజు మిఠాయి దుకాణాదారులు ఎంతో లాభాన్ని గడిస్తారు. ఈ సమయంలో ప్రత్యేకమైన స్వీట్లు తయారుచేయబడతాయి, దీవాలి బహుమతులుగా వీటిని స్నేహితులకు, సన్నిహితులకు పంచుతారు. వివిధ రకాల స్వీట్లు అద్భుతమైన రుచులలో, రంగులతో ఉండి దీపావళి రోజు చిన్నవారు, పెద్దవారు కూడా వీటిని ఆస్వాదిస్తారు.

Tradition of Gifting Sweets in Diwali

దీపావళి స్వీట్లు అనేక రకాలు ఉన్నాయి,కానీ అతి సాధారణ తీపి వంటలతో పాటు గులాబ్ జామ్, ఖీర్, బర్ఫీ, లడ్డూలు, రస్ మలై, కాజుకత్లి, జిలేబి, పెడా, సోమ్పాపిడి మొదలైనవి ఉంటాయి.

Tradition of Gifting Sweets in Diwali

భారతీయ దుకాణాలు దగ్గరగా, దూరంగా ఉన్న బంధువులకు, మనకు ఇష్టమైనవారికి స్వీట్ల బహుమతులను పంపడానికి అందమైన పాకేట్లతో నిండి ఉంటాయి.

Tradition of Gifting Sweets in Diwali

ఈ స్వీట్లు ఆనందంతో, ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకునేట్టు చేస్తాయి, వీటిని తీసుకున్న వారు అందించిన శుభాకాంక్షలతో పండుగ రోజంతా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు.

English summary

Tradition of Gifting Sweets in Diwali

Diwali, the festival of lights, is a symbolic festival of fun, happiness and celebrations. It is also the celebration of sweets. It is a known fact that for any kind of happy event or occasion, sweets are an essential part of the celebrations
Desktop Bottom Promotion