కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని పనులు..!!

కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారు జామునే లేవడం, పూజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విధిగా చేస్తారు. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా దివ్వమైనది. ఈ మాసం స

Posted By:
Subscribe to Boldsky

తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు, మారేడు దళాలు సమర్పించినా శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మసాంలో కార్తీక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారు జామునే లేవడం, పూజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విధిగా చేస్తారు. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా దివ్వమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తీక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి.

సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. ఆకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. ఈ మాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు, పండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం...

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి తినకూడదు .

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు .

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

ఎవ్వరి కీ ద్రోహం చేయ్యరాదు.

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

పాపపు ఆలోచనలు చేయకూడదు.

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

దైవ దూషణ చేయకూడదు.

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

దీపారాదనకు తప్ప నువ్వుల నూనెను ఇక దేనికి ఉపయోగించకూడదు .

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

మినుములు తినకూడదు

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.

కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయకూడని కొన్ని పనులు..!

కార్తీక వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయనివారి చేతి వంటి తినకూడదు .

కార్తీ మాసంలో చేయవల్సిన పనులు:

ప్రతి రోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూడా ప్రతి రోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తీకమాసమంతా కార్తీక పురణాం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.

English summary

What Are The Rules To Follow In Karthika masam

Karthika masam is the eighth lunar month of Indian Astrology. It comes around November of Gregorian calender. Karthika masam is considered very sacred and there are many reasons for it.
Please Wait while comments are loading...
Subscribe Newsletter