శకునానికి, సెంటిమెంట్ కు మద్య తేడా ఏంటి..?

మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉండే అంశాలు ఈ శకునం మరియు సెంటిమెంట్. రెండిటికి కొంచెం తేడా ఉంది. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ‘శకునం’ చూసుకుని వెళ్ళమంటారు. ఫలానా విధంగా దంపతులు ఎదురొస్తే మంచిది. పిల్లి ఎదురొ

Posted By:
Subscribe to Boldsky

మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉండే అంశాలు ఈ శకునం మరియు సెంటిమెంట్. రెండిటికి కొంచెం తేడా ఉంది. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 'శకునం' చూసుకుని వెళ్ళమంటారు. ఫలానా విధంగా దంపతులు ఎదురొస్తే మంచిది. పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, పనిమీద వెళ్తున్నప్పుడు తుమ్మితే పని జరగదు లేదా ఎక్కడకి అని అడిగితే పని జరగదు, ఇలా శకునాల గురించి చూస్తే చాలానే పెద్దలు చెబుతుంటారు .

దీనిలో కొన్ని శకునాలకి స్త్రీ పురుషుల తేడాలు కూడా ఉంటాయి. అబ్బాయిలకి కుడికన్ను లేదా భుజం అదిరితే కన్యాలాభం అంటారు. అదేవిధంగా ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే మంచిది కాదు అంటుంటారు.

What is the difference between Omen and sentiment

ఇక సెంటిమెంట్ అనేది మనోభావాలకి సంబంధించినది. ఇది ఒక్కో వ్యక్తికీ ఒక్కోవిధంగా ఉండడం చూస్తాం. ఇది లాజిక్ కి అందనిది, సైన్స్ నిరూపించలేనిది. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారికి ప్రత్యేకించి రాజకీయాలు, సినీమా, వ్యాపారంలో ఉన్నవారికి ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. లాజిక్ కు అందనిది కాబట్టి సెంటిమెంట్ ను ఇక్కడ వివరింపదలుచుకోలేదు.

What is the difference between Omen and sentiment

శకునమంటే:
శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభ శకునాలు మరియు అశుభ శకునాలుగా వర్గీకరిస్తారు. శకునాలు ఆయా దేశాల సంస్కృతిని బట్టి మారుతుంటాయి. ఒక సంస్కృతిలో శుభశకునంగా పరిగణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శకునంగా పరిగణించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభసూచకంగా భావిస్తే , ఇంగ్లాండ్ లో శుభ సూచకంగా భావిస్తారు.

What is the difference between Omen and sentiment

భారతీయ సంస్కృతిలో సాధారణంగా నల్లపిల్లిని, ఎండు కట్టెలు, ఒంటి బ్రాహ్మణుని, విధవరాలిని , తుమ్మును అశుభసూచకాలుగా భావిస్తారు. ముత్తైదువులను (నిండు సుమంగలి) జంట బ్రాహ్మణులను, ఆవును , పచ్చగడ్డిని శుభసూచకాలుగా భావిస్తారు.

శకున శాస్త్రం అనే గ్రంథం గర్గ ముని ప్రణీతం. పక్షలు చేసే శబ్దమును బట్టి, మనుష్యుల మాటలను బట్టి, శుభాశుభములను నిర్ణయించే విధానాలు ఇందులో తెలుప బడ్డాయి.

What is the difference between Omen and sentiment

పెద్ద బాలి శిక్షప్రకారం:
మండుచున్న నిప్పు, కన్య, సిహాసనం, గుర్రము, అక్షతులు, గంధము, పువ్వులు, ఛత్రము, పల్లకి, ఏనుగు, తేనె, నెయ్యి, పెరుగు, చేప, మాంసము, మద్యము, ఇస్గ్రీబట్టలు, శంఖానాదం, మంగళ వాయిద్యములు, వేదఘోష, ఏడ్పులేని శవము, పూర్ణకుంభము, వేశ్యలు, అద్దములు, మొదలైనవి ఎదురైన మంచి శకునములు.

What is the difference between Omen and sentiment

ఒంటి బ్రాహ్మణుడు, పిచ్చివాడు, చెవిటి, కుంటి, జడధారి, మాలికలు, ఎముకలు, చర్మం, నూనె ప్రత్తి కట్టెలు, ఉప్పు, బెల్లం, మజ్జిగ, పాము, కసు, దిగంబరుడు, క్షౌరం చేయించుకున్నవాడు, తల బిరబోసుకున్న వాడు, డీర్ఘరోగి మొదలైనవి ఎదురైన చెడు శకునములు.

English summary

What is the difference between Omen and sentiment

What is the difference between Omen and sentiment
Please Wait while comments are loading...
Subscribe Newsletter