For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందువులు గోవు(ఆవు)ను ఎందుకు పవిత్రంగా పూజిస్తారు?

|

భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి.

ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల గోవును దానం చేస్తే ఏడు తరాలను తరింపజేస్తుంది. గోదానం చేస్తే పితృ దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి స్వర్గానికెళతారని శాస్త్రంలో చెప్పబడింది. ఆషాడ శుద్ద ఏకాదశి (తొలి ఏకాదశి) రొజున గో పద్మ వ్రతం చేస్తే అత్యంత విశేష ఫలితం కల్గుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఎండ వల్ల, వడ గాడ్పులప్పుడు , చలి గాలులు వీస్తున్నప్పుడు , వర్షం వచ్చినప్పుదు ముందుగా నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు గోవును రక్షించు.

1. గోసంపద:
ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద చూడలేదు అని చ్యవన మహర్షి నహుషంలో ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్రగ్రంథాలలోను, భారత, రామాయణ, భాగవతాది పవిత్రగ్రంథాలలోను, గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు, బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, గురు నానక్‌, శంకరాచార్యులు తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభువు మొదలగు మహానుభావులెందరో గోసంపద యొక్క రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు. శ్రీకృష్ణ్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలుడైనాడు. దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు. గోవులే స్వర్గ సోపానాలు. శ్రీ కృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తి తో... శ్రద్ధతో సేవకుడిగా చూసుకొనేవాడు. ఎవరైతే గోవును అమిత భక్తితో పూజించిన ముక్తికి పొందెదరు.

Why Do Hindus Worship Cows?

2. గోమాత మహత్మ్యం
ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు.

3. యజ్ఝయాగాదులు:
యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృద్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్‌ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమౄఎతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు.

గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది. కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చునని బోధించాడు శివుడు.

4. భూ ప్రదిక్షణంతో సమానం
గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది,

5. గో వధ నిషేధం ప్రతి హిందువు కర్తవ్యం: మరికొన్ని విశేషాలు
గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి , మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని పంచ గవ్యములు అంటారు.
ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక పూట భోజనాన్ని ఇస్తుందట.
భూ మాత గో రూపంలోనే దర్శనమిస్తుందని శ్రీ మద్భాగవతంలో ఉంది.
గోవు యొక్క సమస్త అంగములందు సమస్త దేవతలు కలరు. అందుకే ఆవును ముందు ప్రవేశ పెట్టి, ఆ తర్వాతనే నూతన గృహంలో యజమాని ప్రవేశిస్తాడు.
గోవునకు ఆహారం సమర్పించినట్లైతే 33 కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే.
గో పూజ,గోరక్షణ,గోదానం, గో వధ నిషేధం ప్రతి హిందువు కర్తవ్యం.
తల్లి పాల వలె సులభంగా జీర్ణం అయ్యే శక్తి ఆవు పాలల్లో ఉంది. ఆవు పాలు సంపూర్ణాహారము. శిశువులకు, వృద్ధులకు చాలా శ్రేష్ఠం. క్రొవ్వు ఉండదు. ఆవు పాలలో ప్రోటీనులు , కార్బోహైడ్రేట్లు , ఖనిజాలు, విటమినులు , మెగ్నీషియం , క్లోరిన్‌ మొదలగు లోహాలు ఉన్నాయి.
నీరు త్రాగుతున్న గోవును, పాలు తాగుతున్న దూడను వారించకూడదు(అడ్డు పడకూడదు).
గోవు తిరుగాడు మన ముంగిళ్ళు, దేవాలయాలను తలపించు గుళ్ళు,గోవులు కదలాడే దేవుళ్ళు
గోవులను వధించకుండా చూడాలి. గోవులు జీవించి ఉండాలి. ఆయుర్వేదంలో విష పదార్ధాలను గో మూత్రంతో శుద్ధి చేస్తారు.

English summary

Why Do Hindus Worship Cows?


 Cows have been a point of controversy from time immemorial. Cow slaughtering is one of the major religious issues which sparks off instant riots in the country. Pictures are shared all over social media channels to save cows and how cows are sacred animals. But do we know the real reason why Hindus worship cows? Let us find out.
Story first published: Saturday, November 29, 2014, 12:18 [IST]
Desktop Bottom Promotion