For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో దుష్టశక్తులు చేరకుండా ఉండాలంటే పూజలో గంట మ్రోగించాలా..?

|

పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్ళలోకి వెళ్లినప్పుడు అక్కడ దేవున్ని స్మరించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గంట కొడతాము. అలాగే పూజారి గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు. హారతి తరువాత ఓ గంట కొడతారు. మరి గంటలు ఎందుకు ఎందుకు కొడతారు ? ఆ గంటలు ఎటువంటి ఫలితాన్ని , పరమార్థాన్ని తెలుపుతాయో చూద్దాం.

గుడిలో గంట ఎందుకు కొడతాం?

1. గంటను మ్రోగించినపుడు ‘ఓం’ అనే ప్రణవనాదం వెలువడుతుంది. ఆ గంటానాదం మనోచింతలన్నింటినీ పారద్రోలి, మనసును దైవం వైపుకు మరల్చుతుంది.

1. గంటను మ్రోగించినపుడు ‘ఓం’ అనే ప్రణవనాదం వెలువడుతుంది. ఆ గంటానాదం మనోచింతలన్నింటినీ పారద్రోలి, మనసును దైవం వైపుకు మరల్చుతుంది.

గంట అంటే... మండపంలోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో ఓం కార ధ్వనిని నింపడానికి ఉపయోగించే గంట. ఆ గంటను అలాంటి గంటను దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చేటప్పుడు మోగించకూడదు. ఎందుకంటే... ఆ ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలో పల వింటూ మాత్రమే దైవాన్ని దర్శించాలి. అనుకరణ ధ్వని అంటే.. గంటకొట్టాక కొంతసేపటి వరకూ వచ్చే చిన్నపాటి ఊ అని విని పించే శబ్ధం అన్నమాట.

2. హారతి గంట ఎందుకంటే....

2. హారతి గంట ఎందుకంటే....

దేవతలనందరినీ ఆహ్వానిస్తున్నామనీ చెప్పడానికి, గంట కొడుతున్న సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామనీ, ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినపుపడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతోందని తెలుపుతుంది. ఈ హారతిగంట. అందువల్ల హారతి ఇచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్ష దైవాంశ చేరిన రూపంగా దర్శించాలని చెబుతున్నారు.

3.గంట పవిత్రమైనది:

3.గంట పవిత్రమైనది:

గంట నాలుక లో సరస్వతీ మాత కొలువై ఉంటుందట. గంట ఉదర భాగంలో మహారుద్రుడు, బ్రహ్మదేవుడు ముఖ భాగంలోను, కొన భాగంలో వాసుకి మరియు పైన వుండే పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుంది, అని పురాణాలు మనకు తెలియజేస్తాయి . అందుకే గంటను పవిత్రంగా భావించి దైవంగా పూజించాలి.

4. ఇంట్లో పూజ చేయునప్పుడు:

4. ఇంట్లో పూజ చేయునప్పుడు:

మనం నిత్యం పూజ చేసేటప్పుడు గంటను తప్పనిసరిగా ఉపయోగిస్తాం. అయితే గంటను శబ్ధం చేస్తూ పూజ చేయడం వెనుక గల ఆంతర్యమేమిటో కొందరికే తెలిసివుండొచ్చు. అదేంటంటే... గంట శబ్దం ఎంత దూరం వరకైతే వినిపిస్తుందో, అంతదూరం వరకూ దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి.

5. గుడి నుండి భయట వెళ్ళేటప్పుడు కొట్టే గంట శుభాన్ని సూచిస్తుంది :

5. గుడి నుండి భయట వెళ్ళేటప్పుడు కొట్టే గంట శుభాన్ని సూచిస్తుంది :

ఈ కారణంగానే ప్రతి దేవాలయంలోను గంటలు వరుసగా వేళ్లాడదీసి కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ... తిరిగి వెళుతున్నప్పుడు మాత్రమే గంటను మోగించాలనే నియమం ఉంది. గంట శబ్దం శుభాన్ని సూచిస్తుంది.

6. మానసిక ప్రశాంతతను చేకూర్చును:

6. మానసిక ప్రశాంతతను చేకూర్చును:

గంట మోగించడం వలన వచ్చే ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను మోసుకొస్తాయి ... మానసిక రుగ్మతలను దూరంచేస్తూ ప్రశాంతతను ప్రసాదిస్తాయి.

7.ఇంట్లో గంటను లయబద్దంగా మోగించాలి:

7.ఇంట్లో గంటను లయబద్దంగా మోగించాలి:

ఇక పూజా మందిరాల్లో చిన్నగంటలను ఉపయోగిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. పూజలో దైవ చిహ్నంగల గంటను మాత్రమే ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. ఒక్కో దైవ చిహ్నం కలిగిన గంటను మోగించడం వలన ఒక్కో ఫలితం ఉంటుంది. అలాగే గంటను ఇష్టానుసారంగా ... గందరగోళంగా కాకుండా లయబద్ధంగా మోగించాలి.

8. పూజా విధిలో గంటమ్రోగించడం తప్పనిసరి :

8. పూజా విధిలో గంటమ్రోగించడం తప్పనిసరి :

ముఖ్యంగా ధూప .. దీప .. నైవేద్యాల సమయంలోను, హారతినిచ్చే సమయంలోను గంటను తప్పనిసరిగా మోగించాలి. ఈ విధమైన నియమాలను పాటిస్తూ గంటను మోగించడం వలన పూజకి సంబంధించిన ఫలితం పరిపూర్ణంగా పొందడం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

9. పూజ పరిపూర్ణతకు గంట మోగ్రించాలి:

9. పూజ పరిపూర్ణతకు గంట మోగ్రించాలి:

శివునికైతే నంది గంట (నంది ఆకారం చెక్కబడిన గంట), విష్ణువుకైతే ఆంజనేయుడు లేదా గరుత్మంతుడు చెక్కబడిన గంటలు ఉపయోగించాలి.

10. పూజ పరిపూర్ణతకు గంట మోగ్రించాలి:

10. పూజ పరిపూర్ణతకు గంట మోగ్రించాలి:

వినాయకుడు, శ్రుంగి, శంఖ చక్రాదులు ఇలా రకరకాలైన స్వరూపాలు గల గంటలు అందుబాటులో ఉన్నాయి.

11. పూజ పరిపూర్ణతకు గంట మోగ్రించాలి:

11. పూజ పరిపూర్ణతకు గంట మోగ్రించాలి:

రోజువారిగా ఇంట్లో పూజించేటప్పుడు ఈ భేదం పాటించాల్సిన అవసరం లేదు. ‘‘శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణ: విష్ణోశ్చహృదయం శివ:'' అన్నారు కదా!!

12. పూజ పరిపూర్ణతకు గంట మోగ్రించాలి:

12. పూజ పరిపూర్ణతకు గంట మోగ్రించాలి:

ఇక అమ్మవారికి అందరూ బంటులే కదా...కనుక యే రూపం గల గంటనైనా వాడవచ్చు.

English summary

Why do we Ring Bells During Rituals..!?

The sound of a bell is considered auspicious in many cultures around the world. Bells are also significant in Hinduism. It is a common practice among most people to enter the temple by ringing the bell. Temple bells are huge structures and the loud sound produced from it is considered extremely auspicious.
Story first published:Tuesday, August 23, 2016, 17:20 [IST]
Desktop Bottom Promotion