శ్రీమహా విష్ణువు శేషతల్పంపైనే ఎందుకు నిద్రిస్తాడు?

Subscribe to Boldsky

శ్రీమహావిష్ణువు రూపాన్ని ఎన్నో సినిమాలలో అలాగే చిత్రపాటల్లో వివిధ రకాలుగా చూపించారు. కొన్ని చోట్ల, గరుడరధాన్ని నడిపినట్టుగా చూపిస్తే, చాలా మటుకు శంఖచక్రగదపద్మాలతో మహావిష్ణువుని చిత్రించారు. మరి కొన్ని చోట్ల, మహావిష్ణువు 'అనంత సాజ్య' అనే శేషతల్పంపై శయనిస్తున్నట్లు చిత్రపటాలున్నాయి. అనేక తలలు కలిగిన ఈ మహాసర్పంపైనే మహా విష్ణువు విశ్రాంతి తీసుకునేందుకు శయనిస్తాడని అంటారు. హిందూధర్మం ప్రకారం, ఈ మహా సర్పాన్ని శేషనాగు గా పేర్కొంటారు.

ఈ చిత్రీకరణకు తగిన ప్రాముఖ్యం ఉంది. పాప సముద్రం నుండి ప్రపంచాన్ని సురక్షితంగా పునరుద్ధరించే శ్రీమహా విష్ణువు అనేక అవతారాలెత్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుడ వాహనం. అయితే, శేషనాగుతో శ్రీ మహావిష్ణువుకి ఉన్న అనుబంధం ఏమిటి? శ్రీ మహావిష్ణువు శేషతల్పం పైనే ఎందుకు శయనిస్తారు.

సమాధానం తెలుసుకుందాం-

1. సమయ సూచిక

శ్రీ మహా విష్ణువు ఈ ప్రపంచం మొత్తం పాప సముద్రంలో మునిగిపోయిన సమయంలో ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి తరలి వస్తాడని అంటారు. శేషనాగు 'అనంతా'నికి సూచిక. అనంతం అంటే అంతులేనిది. మానవజాతికి అనుకూలంగా ఉండమని సమయాన్ని ఆదేశిస్తాడు శ్రీ మహావిష్ణువు. అందుకే, విష్ణువు శేషతల్పంపై నిద్రిస్తాడని అంటారు.

2. మహా విష్ణువు మరో అవతారమే

మహావిష్ణువుకి చెందిన మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు. ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ప్రతి సారి మహావిష్ణువు అవతరిస్తూనే ఉన్నాడని పురాణాలూ చెప్తున్నాయి. హిందూ ధర్మం ప్రకారం, శేషనాగు శ్రీమహా విష్ణువు కి చెందిన ఒక శక్తి. అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తిపైనే శయనిస్తారు.

3. నవగ్రహాలకు నిలయం

హిందూ పురాణాల ప్రకారం, శేషనాగు తనలో నవగ్రహాలను కలిగి ఉండి, విష్ణు మూర్తిని ఆరాధిస్తూ ఉంటుంది. ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై శయనిస్తారట.

4. మహావిష్ణువుకు రక్ష

శేషనాగు కేవలం మహావిష్ణువుకు శయనతల్పంలాగే కాకుండా మహా విష్ణువుకు రక్షగా కూడా ఉంటుంది. హాస్యాస్పదంగా ఉందా? అయితే, కాస్త గమనించండి. నందుడి ఇంటికి బుజ్జి కృష్ణుడిని వసుదేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఎదురైనా కల్లోలభరిత తుఫాను నుంచి శేషతల్పమే రక్షించిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి, శేషనాగు, భగవాన్ విష్ణువుకి రక్షగా కూడా వ్యవహరిస్తోంది.

5. విడదీయరాని అనుబంధం

శేషనాగు, మహావిష్ణువుల మధ్య కలిగిన అనుబంధం విడదీయరానిది. ఈ ప్రపంచంలోనున్న చెడును పారద్రోలడానికి జరిగిన మహా యుద్ధంలో శేషనాగు విష్ణుమూర్తికి ఎంతగానో సహాయపడింది. త్రేతాయుగంలో, శేషనాగు, లక్ష్మణుడి అవతారంలో ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో బలరాముడిగా అవతరించాడు. ఈ రెండు అవతారాలలో రాముడికి అలాగే కృష్ణుడికి తన వంతు సహాయం అందించాడు. అందుకే, విష్ణువు శేషనాగుపై శయనించడంపై ప్రాముఖ్యత ఉంది. 'శేష' అనగా 'సంతులనం'. పైగా, సర్పం సమయానికి సూచిక. శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నారంటే దేనికి అతీతం కాకుండా సమయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని అర్థం.

English summary

Why Does Lord Vishnu Sleep On A Serpent Bed?

Lord Vishnu is connected with this huge serpent with many heads in different incarnation. According to Hinduism, this huge serpent is known as Seshanaag and Lord Vishnu lies on it while taking rest.
Please Wait while comments are loading...
Subscribe Newsletter