For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం ఈ ఆహారాలు తింటే సూర్యదేవుడి ఆగ్రహానికి గురవుతారా ?

By Swathi
|

ఆదివారం సూర్యదేవుడికి చాలా ప్రత్యేకం. నవగ్రహాధిపతిగా సూర్యుడిని వేదాలు చెబుతాయి. హిందువులు సూర్యదేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పూజిస్తారు. ఉదయం నిద్రలేవగానే సూర్యుడి దండం పెట్టుకునే ఆచారం హిందూ సంప్రదాయంలో ఉంది. ఏడు గుర్రాలు నడిపే వాహనం సూర్యుడిది. అంటే.. ఏడు గుర్రాల.. ఏడు రంగుల ఇంధ్రధనస్సుని సూచిస్తుంది. అలాగే శరీరంలోని ఏడు చక్రాలను సూచిస్తుంది.

సాధారణంగా శనివారం, సోమవారం, శుక్రవారం మాంసాహారం తినరు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పండుగలు, పూజలు నిర్వహించేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే ఆదివారం వచ్చిందంటే.. ప్రతి ఇంట్లో మాంసాహారం రుచులు కనిపిస్తాయి. అలాగే కొంతమంది వాళ్ల ఇంటి వారం రోజు మాంసాహారం తినరు. మరికొంతమంది కొన్ని శుభకార్యాల్లో కొన్ని రకాల ఆహారాలను ఉపయోగించరు. నాగదేవతలను, సుబ్రహ్మణ్య స్వామిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే ఆదివారం కొన్ని రకాల ఆహారాలను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆహారాలను ఆదివారం తింటే.. సూర్యదేవుడి ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నాయి.

ఆదివారం సూర్యుడు

ఆదివారం సూర్యుడు

ఆదివారానికి సూర్యుడు దేవుడు. ఆత్మ, సంకల్ప శక్తి, గుర్తింపు, కళ్లు, తేజస్సు, ధైర్యం, రాజ్యాధికారం, తండ్రి, దయ వంటి గుణాలకు ప్రతీకగా సూర్యుడిని చెబుతారు.

జాతకం

జాతకం

పుట్టిన జాతకం ప్రకారం ఎవరైతే.. సూర్యుడిని అధిపతిగా కలిగి ఉన్నవాళ్లు హానికలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆదివారం వాళ్లు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు.

ఎర్రకందిపప్పు

ఎర్రకందిపప్పు

ఎర్రకందిపప్పులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మాంసంలో కంటే ఇందులో ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి. కానీ సూర్యుడిని అధిపతిగా కలిగి ఉన్నవాళ్లు వీటిని ఆదివారం తినకూడదు.

అమరాంత్

అమరాంత్

రెడ్ అమరాంత్ గా పిలిచే ఈ ఆకులు ఆదివారం తినడం శ్రేయస్కరం కాదని చెబుతారు. వైష్ణవుల మరణానికి కారణమని దీన్ని చెబుతారు. అందుకే ఆదివారం దీన్ని తినకూడదు.

వెల్లుల్లి

వెల్లుల్లి

బ్లడ్ ప్రెజర్ బ్యాలెన్స్ చేయడానికి మంచిదని వెల్లుల్లిని చెప్పినప్పటికి.. ఆదివారం మాత్రం దీన్ని తీసుకోకూడదని చెబుతారు.

చేపలు

చేపలు

చేపల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆదివారం మాత్రం చేపలు తినకూడని సూచిస్తారు.

ఉల్లి

ఉల్లి

ప్రతి ఇంట్లో, ప్రతి వంటలో ఉపయోగించే ఉల్లిపాయను ఆదివారం తీసుకోవడం మంచిది కాదని.. సూర్యదేవుడికి సమర్పించడం అంతకంటే శ్రేయస్కరం కాదని చెబుతారు.

కారణాలు

కారణాలు

ఈ ఐదు పదార్థాలను ఆదివారం ఎందుకు తీసుకోరు ? ప్రస్తుత రోజుల్లో ఆవులను ఎక్కువగా చంపుతున్నారు. ఇది హిందూత్వం ప్రకారం మంచిది కాదు. అందుకే ఆవును పవిత్రంగా పూజిస్తారు.

పూర్వీకులు

పూర్వీకులు

హిందువులు పురాతన కాలంలో ఆవును చాలా పవిత్రంగా పూజించేవాళ్లు. ఒకసారి ఒక మహర్షి వధించినబడిన ఆవును సాయంత్రానికి మళ్లీ బతికేలా చేయడానికి పూజ చేయాలని మహర్షి భావించాడు. అయితే బలహీనంగా ఉన్న మహర్షి భార్య ఆకలికి తట్టుకోలేకపోయింది.

మాంసం

మాంసం

పండ్లు, ఆకులు తింటారు ఈ జంట. అయితే.. ఈ సారి ఆమె చనిపోయిన ఆవు నుంచి ఒక ముక్క తీసుకుని వండటానికి ప్రయత్నించింది. కానీ ఆ మాంసం వాసన భరించలేకపోయిన మహర్షి భార్య ఆ మాంసాన్ని అడవిలోకి విసిరేసింది. అది రెండు ముక్కలుగా పడింది.

ఆవుకి ప్రాణం

ఆవుకి ప్రాణం

సాయంత్రానికి ఆవును బతికించిన మహర్షికి అడవిలోకి విసిరేసిన ఆవు మాంసం కూడా వెనక్కి వచ్చింది. అందులో కండ భాగం, వెల్లిల్లిగా మారగా, రెండో మాంసం ముద్ద చేప రూపంలో వచ్చింది. రక్తం ఎర్ర కందిపప్పు రూపంలో వచ్చింది. చర్మం ఉల్లిపాయలుగా, ఎముకలు రెడ్ అమరాంత్ లా తిరిగి వచ్చింది. అందుకే ఆదివారం ఈ ఆహారాలను తీసుకుంటే.. ఆవును వధించినంత పాపం కలుగుతుందనే ఉద్ధేశ్యంతో.. వీటిని తినకూడదని సూచించారు.

English summary

Why eating these 5 foods on Sunday would bring you wrath of Lord Sun?

Why eating these 5 foods on Sunday would bring you wrath of Lord Sun?
Story first published: Wednesday, May 25, 2016, 14:39 [IST]
Desktop Bottom Promotion