For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీలు గాజులు ధరించడం వెనక దాగున్న ఆంతర్యం ఏంటి ?

By Nutheti
|

గాజుల సవ్వడితో చేతులు గలగలా అంటూ శబ్ధం చేస్తే అమ్మాయి అందం రెట్టింపవుతుంది. అయితే గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు.. వాళ్లకు ఎలాంటి కీడు జరగకుండా గాజులు రక్షగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

గాజులు వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని.. హిందూ సంప్రదాయం చెబుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలకు నల్లగాజులు వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి. అంతేకాదు.. పిల్లలకు గాజుల శబ్ధం ఆనందంతో.. సంతోషాన్ని కలిగిస్తాయి.

bangle

ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు. కాబట్టి.. చేతినిండా గాజులేసుకుంటే ఇంట్లో లక్ష్మీ దేవి ఉన్నట్లే అని.. మురిసిపోతారు పెద్దలు. అందుకే పుట్టినప్పటి నుంచే ఆడపిల్లలకు గాజులు అలవాటు చేస్తారు. గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం.

రంగురంగుల గాజులు మగువలను ఆకట్టుకుంటాయి. మరి ఏ రంగు గాజులు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలిరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు సంతోషాన్ని, నారింజ రంగు గాజులు విజయాన్ని, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను, నలుపు రంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.

bangles

హిందూ సంప్రదాయం ప్రకారం గాజులు అతివల సౌభాగ్యానికి చిహ్నం. బంగారు గాజులు ఎన్ని వేసుకున్న కనీసం రెండు మట్టిగాజులైనా ధరించాలి. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులతో పూజిస్తారు. కాబట్టి.. మట్టిగాజులు వేసుకోవడం.. ముత్తైదుతనాన్ని సూచిస్తుంది. గాజులు పగలడాన్ని అమంగళం, అశుభంగా భావిస్తారు భారతీయులు.

English summary

Why Indian Women wear bangles

Why Indian Women wear bangles
Story first published: Friday, October 9, 2015, 17:09 [IST]
Desktop Bottom Promotion