శ్రీనివాసుడిని వడ్డికాసుల వాడు అని ఎందుకు పిలుస్తారు..?

చిద్విలాసుడైన శేషాచలపతి భక్తులకు అన్ని విధాల గమనిస్తూ వారి నుండి మొక్కుబడులను వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. ఇందులోని అంతరార్థం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సకాలంలో తమ పనులను తాము నెరవేర్చుకుంటే తేలికగా

Posted By:
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సత్కర్మలను ఆచరిస్తున్నారంటే అది పూర్వ జన్మ సుకృతమే తప్ప మరొకటి కాదు. నేటి ఆధునిక యుగంలో రోజులో భగవంతున్ని తలుచుకోవడమే గగనమైపోతోంది. అలాంటిది చుట్టుపక్కల ఓ ఆలయం ఉన్నా వెళ్లేందుకు ఎవరికీ తీరిక ఉండటం లేదు. దేవాలయం అన్నది పూర్వికులు మనకు ఇచ్చిన అపురూప వారసత్వ సంపద. అదే సంపదనను మనం మన తర్వాతి తరాలకు అందించాలి. ఓ తిరుమల, ఓ అనంతపద్మనాభ స్వామి దేవాలయం.. ఇవన్నీ శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే కారణం వాటి నిర్మాణ కౌశలాలే కాదు. వాటికున్న ఆధ్యాత్మికత, వాటిని నిర్వహించే భక్తుల శ్రద్ధ కూడా కారణమే.

శ్రద్ధాసక్తులు లేనిదే ఏ పనీ సాధ్యం కాదు. సనాతన ధర్మం మనకు చెప్పేది ఒక్కటే.. దైవత్వాన్ని ప్రతి మనిషిలో, ప్రతి మనసులో చూడాలి అని. ప్రతి యుగానికి ఒక్కో అవతారం మానవులను కాపాడుతుంది. అలా కలియుగానికి ప్రత్యక్ష దైవంగా నిలిచిన దైవ స్వరూపం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ స్వామిని కొలిచే అదృష్టం రావడం అరుదైన అవకాశం.

Why is tirupati balaji of south so rich & worshipped so much?

మనకు ఉన్నంతమంది దేవతలు ఇతర ఏ మతంలోనూ లేరు. విఘ్నేశ్వరుడు, వేంకటేశ్వరుడు, మహాశివుడు, విష్ణుమూర్తి - ఇలా అసంఖ్యాకమైన దేవతామూర్తులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే, ముక్కోటి దేవతలు ఉన్నారు. ఇందరు దేవుళ్ళలో వేంకటేశ్వరునికి ఒక విశిష్టత ఉంది. వేంకటేశ్వరుడు దేవతలు అందరిలోకీ మహా ధనవంతుడు. పేద, ధనిక తేడా లేకుండా ఎవరి శక్తికి తగ్గట్టు వారు ఏడుకొండల బాలాజీకి కానుకలు సమర్పించుకుంటారు.

Why is tirupati balaji of south so rich & worshipped so much?

మానవ జీవన ప్రయాణంలో దైవ చింతన అత్యవసరమైనది. ఎందుకంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు దైవానుగ్రహం తప్పనిసరి. అదే విధంగా మానవ ప్రయత్నానికి దైవ బలం కూడా తోడైతే విజయం తప్పక వరిస్తుంది. ఇలా మన సకల కార్యాల్లో విజయాన్ని సిద్ధింప చేసే దేవుళ్లు కోకొల్లలు. కోరిన కోర్కెలు తీర్చడంలో తిరుమలేశుని మించిన దైవం లేదన్నది భక్త కోటి గట్టినమ్మకం. అందుకే వడ్డీ కాసుల వాడిని మొక్కుకోగానే ఏదో ఒకటి ముడుపు కట్టేస్తారు. మరికొందరు తమ కోరికలు తీరినితే.. తలనీలాలు సమర్పించుకుంటారు. ఇంకొందరు నిలువు దోపిడీ ఇస్తారు. ఇదంతా ఆ కమలనాభుని మీద ఉన్న నమ్మకంతో మాత్రమే.

Why is tirupati balaji of south so rich & worshipped so much?

చాలా మంది భక్తులు కష్టాలు చుట్టుముట్టినప్పుడు తమను కాపాడవలసిందిగా తిరుమలేశుని ప్రార్థించి మొక్కుకుంటారు. ఆపదల నుండి బయటపడిన వెంటనే తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లిస్తామని మరీ మరీ ప్రార్థిస్తారు. శ్రీనివాసుడు తన భక్తులను కరుణించి వారి వారి కష్టాలను మటుమాయం చేస్తాడు.

Why is tirupati balaji of south so rich & worshipped so much?

కానీ లబ్ధిపొందిన భక్తులను సకాలంలో మొక్కులు చెల్లించకుండా తాత్సారం చేస్తూ, తిరుమల ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. అందుకు ఏవేవో కారణాలను ఏకరవుపెడుతూ ఆ దేవుడని క్షమించమని, సాధ్యమైనంత త్వరలో తిరుమలకు వచ్చి మొక్కుబడులను వడ్డీతో సహా చెల్లించుకుంటామని మరల మరల మొక్కుకుంటూనే ఉంటారు.

చిద్విలాసుడైన శేషాచలపతి భక్తులకు అన్ని విధాల గమనిస్తూ వారి నుండి మొక్కుబడులను వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు.

Why is tirupati balaji of south so rich & worshipped so much?

ఇందులోని అంతరార్థం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సకాలంలో తమ పనులను తాము నెరవేర్చుకుంటే తేలికగా ఉంటుంది. తాత్సారం చేసే కొద్దీ శ్రమ పెరుగుతుంది. అసలుకు వడ్డీ అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది బోధించడానికే శ్రీనివాసుడు వడ్డికాసుల వాడైనాడు..

English summary

Why is tirupati balaji of south so rich & worshipped so much?

There are different stories about it, but the most authentic one is like that, earlier say near about 1200 years before the temple existed , and very few people visited there and the pujaris were living in very poor condition lack of money etc.
Please Wait while comments are loading...
Subscribe Newsletter