For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ఎందుకు ధరిస్తాడు?శ్రీకృష్ణుడు స్వభావం ఏమిటి?

|

మయూరనృత్యం మనసును ఆహ్లాద పరుస్తుంది. అందానికి నిండైన ఉదాహరణ నెమలి. హిందువుల ఆరాధ్యుడైన శ్రీకృష్ణ భగవానుడి అలంకారంలో నెమలిపింఛానికి ఉన్న విలువ అంతాఇంతాకాదు. పురాణేతిహాసాల్లో నెమలి ప్రస్తావన ఉండనే ఉంది. అందుకే మన జాతీయపక్షిగా నెమలిని గుర్తించారు. ఈ నెమలి ఈకలకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసుకోవాంటే ఈ కథ చదవాల్సిందే..

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

నెమలిని మయూరము అని అంటారు ఎందుకు? ‘మ' కారము మధనానికి అని అర్ధము. ‘యూర'అనే పదం హృదయానికి అని అర్ధం. ఇంకా ‘మ' అంటే మగనెమలిని అని కూడా అంటారు. పక్షిజాతిలో ‘యోగవిద్య' తెలిసిన పక్షులు 5మాత్రమే ఉన్నాయి. అవి..శుకము, హంస, గరుడు, నెమలి చివరిది పావురము. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఝానము ఉన్నది. అసలు నెమలి అందమే పింఛం. క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలిసికుందాము:

ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలిసికుందాము:

ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలిసికుందాము:

శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచపక్షుల గాయాలు నయంచేసినందుకు గాను వృద్దుడైన ఆ రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే, వద్దని, మీకు మల్లే నేను విహాంగంగా ఆకాశంలో విహారించాలిని ఉందని అది అనుగ్రహించండి. అలాగే అని మేము చెప్పబోయే దేవతా మంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడే నీకు పనిచేసి, నీకు చిత్రవిచిత్రమైన వర్ణనలు కలిగిన ఈకలు, పింఛము కలుగగలవు. అప్పుడు ఈ జగత్తులో నీయంతటి అందమైన పక్షి మరొకటి ఉండదు. ఒక హెచ్చరిక, ఎటువంటి పరిస్థితులలో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు' అని వెళ్ళిపోయాయి.

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

ఒకనాడు ఆకాశం మేఘావృతమై ఉండగా ఈ మంత్రప్రభావం చూద్దామని, మంత్రోఛ్చరణంగా ఈ మంత్రాన్ని పఠించి మనోహరమైన, అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తుండగా అతని భార్య చూసింది. ఆనాటి నుండి భర్తను ఎన్నో విధాలుగా హింసిస్తూ, వేధిస్తూ ఆ మంత్రాన్ని తనకు చెప్పమంది. ఇక ఆ బాధలు పడలేక సరేనన్నాడు. ఇది తెలిసికున్న ఆ మంత్రాన్ని అధిష్టించిన దేవత అతని భార్యకు బుద్దిచెప్పాలకున్నది. ఆ మంత్రము చేత కారుమేఘాలను సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేసింది. ఆ సమయంలో ఆయన భార్య తను అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నాననే భావనలో ‘అతి సుందర:' అనబోయి‘అసుందర' అన్నది. వెంటనే ఆ పదజాలంతో ఆమె పింఛంలేని ఆడనెమలిగా మారిపోయింది.

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

తమకు ఇచ్చిన వాగ్ధానాన్ని తప్పాడని ఆ క్రౌంచపక్షులు ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారిపొమ్మన్నాయి. రేతస్సు అనగా వీర్యం: దీనిలో అమొఘమైన శక్తి నిల్వ ఉంటుంది. ఇలంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్ని పొంది వీర్యహీనులు అంటే తేజమును, శక్తిని కోల్పోతుండగా, యోగులు ఇదే వీర్యాన్ని‘ఊర్ధ్వపతన' క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గగాములుగా అవుతున్నారు.

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

ఇటువంటి యోగులందరిలోకి శ్రీకృష్ణభగవానుడు పరమొత్తమమయిన పరమయోగి. పదహారువేల మంది గోపికలున్నా, అష్టభార్యా సహితుడైనా, భామాలోలుడన్న పేరున్నా ఆయన అసలుసిసలైన నిఖార్సైన బ్రహ్మచారి. అందుకే ఆయన ‘అస్ఖలిత బ్రహ్మచారి' అయ్యాడు. నెమళ్ళకు తమ వీర్యాన్నీ ఊర్ద్వముఖంగా నడిపించినగల శక్తి గలవి. అయితే జ్జానంలో మనిషికన్నా ఒక స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఈ రేతస్సు(వీర్యం)పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదపువాసను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్బం ధరిస్తుంది. ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది, స్త్రీ పురుష జననేంద్రియాల సంభోగ ప్రక్రియ ప్రసక్తే లేదు. అందుకని నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. ఎప్పుడైతే, ఎక్కడైతే స్ఖలనము లేదో దాన్ని యోగీ యోగ సమానమై ఆరాధ్యనీయము , సూజనీయము గౌరవస్థానాన్ని ఆక్రమించింది కనుకనే శ్రీకృష్ణుడు తన శిరముపైన నెమలిపింఛానికి సముచిత, సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు...

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ధరించడం వెనుక దాగిఉన్న రహస్యం

సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది.

English summary

Why lord krishna have peacock feather

Peacock is regarded as one of the most auspicious bird in Hindu mythology. It's a beautiful bird and has also earned the favour of being the national bird of India. You may have noticed that many people hand the peacock feathers in their houses. It is believed that keeping peacock feather at home brings good luck and prosperity in the house.
Desktop Bottom Promotion