For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అమావాస్య రోజు శనిదేవుడిని కంపల్సరీ పూజించాలి.!! ఎందుకు ??

By Swathi
|

భాద్రపద మాసం అంటే.. ఈనెల 30న వచ్చే అమావాస్యని బహుళ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య క్రిష్ణ పక్షం చతుర్ధి రోజు వస్తుంది. ఈ అమావాస్య రెండురోజులు ఉంటుంది కాబట్టి.. ఈ పర్వదినాన శివుడిని పూజిస్తారు.

ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల.. అన్ని సమస్యలు దూరమై.. జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తీ నమ్మకం, భక్తితో ఈ రెండురోజులు శివుడిని పూజిస్తారు. అయితే శనిదేవుడిని పూజిస్తే.. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా.. పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి ఈ బహుళ లేదా మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలి ? ఎలాంటి పూజలు నిర్వహించాలి ? తెలుసుకుందాం..

శనివారం

శనివారం

శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారం వచ్చిదంటే.. చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శనిదేవుడిని పూజించడం వల్ల.. చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే కాకుండా.. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది.

పుణ్యక్షేత్రాలు

పుణ్యక్షేత్రాలు

పుణ్యక్షేత్రాలు సందర్శించి, పవిత్ర స్నానాలు చేసి, యాగాలు చేసి, ఉపవాసం ఉండటం వల్ల.. పాపాల నుంచి విముక్తి పొందుతారు. అందుకే.. భాద్రపద అమావాస్యను చాలా పవిత్రంగా భావిస్తారు.

విష్ణు

విష్ణు

విష్ణుమూర్తిని కూడా.. అమావాస్య రోజు పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే.. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.

పూజలు

పూజలు

చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల.. వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ల కోసం ఉపవాసం ఆచరిస్తే.. వాళ్ల ఆత్మ శాంతిస్తుంది.

చనిపోయిన వాళ్లకు

చనిపోయిన వాళ్లకు

శాస్త్రాల ప్రకారం పిత్ర దేవుడు అమావాస్యకు ప్రత్యేకం. అందుకే.. అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరుమీద పూజలు నిర్వహించాలి.

నీళ్లు

నీళ్లు

చనిపోయిన పూర్వీకులకు నీటిని ప్రసాదించడం ద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయి.

శివుడు

శివుడు

ఈ అమావాస్య రోజు శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. అదృష్టం, సంపద, ఐశ్వర్యం పొందుతారు.

గడ్డి సేకరించడం

గడ్డి సేకరించడం

అమావాస్య రోజు సాయంత్రం గడ్డి తీసుకురావడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం 10 రకాల గడ్డిలను పూజలలో ఉపయోగిస్తారు. వాటన్నింటినీ చాలా పవిత్రంగా, అదృష్టంగా భావిస్తారు.

పూజ ఎలా చేయాలి

పూజ ఎలా చేయాలి

గడ్డి పెరికేటప్పుడు హమ్ పత్ అని జపిస్తూ ఉండాలి. ఒక గడ్డి మొక్కలో ఏడు ఆకులు ఉంటాయి. ఎలాంటి డ్యామేజ్ అవకుండా.. పెరకడం వల్ల.. దేవుడి అనుగ్రహం పొందవచ్చు.

పవిత్ర స్నానాలు

పవిత్ర స్నానాలు

ఈ భాద్రపద అమావాస్య రోజు పవిత్ర స్నానాలు, దానాలు, పితృపక్షాలు నిర్వహించడం చాలా మంచిది. ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

హోమం

హోమం

ఈ అమావాస్య రోజు హోమం చేయడం కూడా.. చాలా మంచి పలితాలను ఇస్తుంది. జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి.

నీటి కుండ

నీటి కుండ

నీటి కుండలో ఒక కుచ్చు గడ్డి వేసి.. దక్షిణ దిశగా పెట్టడం వల్ల.. చాలా ప్రయోజనకరమని పండితులు సూచిస్తున్నారు.

ఉపవాసం

ఉపవాసం

మహాలయ అమావాస్య రోజు శివుడి అనుగ్రహం పొందడానికి చాలామంది ఉపవాసం ఉంటారు.

అమావాస్య

అమావాస్య

అనురాధా లేదా స్వాతి నక్షత్రం, మంగళవారం, బుధవారం అమావాస్య వచ్చిందంటే.. చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.

English summary

Worshipping Shani dev on Bhadrapada Amavasya will solve all your problems

Worshipping Shani dev on Bhadrapada Amavasya will solve all your problems. Celebrated on the Chaturthi Krishna Paksha in the month of Bhadrapad, Kusha Grahini Amavasya is a two day festival where people worship Lord Shiva.
Story first published: Wednesday, September 21, 2016, 13:40 [IST]
Desktop Bottom Promotion