ఆగస్టు నెల వచ్చేసింది. గ్రహాల కదలికలు, నక్షత్రాల మార్పుల ఆధారంగా 2026 ఆగస్టు నెల మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల వారి జీవితాల్లో విభిన్నమైన మార్పులను తీసుకురాబోతోంది. కొందరికి ఈ నెల వృత్తి, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను అందిస్తే, మరికొందరికి మాత్రం ఆర్థిక విషయాల్లోనూ, కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.ఆగస్టు నెలలో మీ రాశి ఫలం ఎలా ఉందో ఇక్కడ చూడండి.
మేష రాశి
ఈ నెల మీకు ఉరుకులు పరుగులతో గడుస్తుంది. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, దానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు పరిచయం అవుతారు, వ్యాపారం విస్తరిస్తుంది. ఆదాయం పెరిగినట్లే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పక్కా బడ్జెట్ ప్లానింగ్ అవసరం. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృషభ రాశి
ఆగస్టు నెల మీకు అత్యంత అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఒక్కొక్కటిగా ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ నెలలో ఓ మంచి శుభవార్త అందుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది లాభాల పంట పండించే సమయం. వృత్తిపరమైన బిజీలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం దొరుకుతుంది. అయితే, బయటి ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు.
మిథున రాశి
ఈ నెలలో మీ నెట్ వర్క్ పెరుగుతుంది. భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆఫీసులో మీ నాయకత్వ లక్షణాలను పరీక్షించే కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. ఆర్థిక పరిస్థితి గత నెలల కంటే చాలా మెరుగ్గా, బలంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత ధృఢంగా మారుతుంది. అయితే చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం మానుకుంటే మంచిది.
కర్కాటక రాశి
ఈ నెలలో మీరు కాస్త సంయమనం పాటించాలి. ఆఫీసులో గానీ, వ్యాపారంలో గానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు రావచ్చు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి, తెలివిగా అడుగులు వేయండి. క్రమక్రమంగా మీ వృత్తి, వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మీకు మీ కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పాత ఫ్రెండ్ కలయిక మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సింహ రాశి
సింహ రాశి వారికి ఆగస్టు నెల ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. గతంలో ఎప్పుడో నిలిచిపోయిన లేదా రావాల్సిన బకాయిలు ఈ నెలలో అనూహ్యంగా మీ చేతికి అందుతాయి. ఆఫీసులో మీ కష్టానికి, అంకితభావానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు చూస్తారు. ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం ఉంది.
కన్యా రాశి
ఈ నెలలో మీ శ్రమ వృధా పోదు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టును ఈ నెలలో ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక పునాదులు బలంగా మారుతాయి, ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, లేదా వాటి గురించిన చర్చలు జరుగుతాయి. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.
తులా రాశి
కెరీర్ లో ముందుకు సాగడానికి ఈ నెల మీకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. మీరు గతంలో చేసిన పొదుపు లేదా పాత పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత అన్యోన్యంగా మారుతుంది. ప్రతి అడుగులోనూ మీ జీవిత భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. అంతా బాగుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా, డబ్బు పొదుపు చేయడం నేర్చుకోండి.
వృశ్చిక రాశి
ఈ నెలలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ చురుకుదనం వల్ల అప్పగించిన పనులన్నీ సమయానికి ముందే పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు వచ్చే శుభయోగాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మార్కెట్లో మంచి పేరు, లాభాలు వస్తాయి. కుటుంబంలో సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి, ఆరోగ్యం మునుపటి కంటే చాలా మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి
ఆగస్టు నెలలో మీకు అదృష్టం అన్ని విధాలా కలసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కీలకమైన, కొత్త బాధ్యతలు లభిస్తాయి, ఇది మీ కెరీర్ గ్రోత్‌కు హెల్ప్ అవుతుంది. వ్యాపారులకు లాభసాటి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఇది అద్భుతమైన సమయం. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పెట్టుబడుల విషయంలో ఇతరుల మాట విని తొందరపడకండి.
మకర రాశి
ఈ నెల పూర్తిగా పనితో, ఉరుకులు పరుగులతో గడుస్తుంది, కానీ అది మీకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. మీ శ్రమ వృధా కాదు, మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఇంట్లో ఓ శుభవార్త వినడం వల్ల కుటుంబం అంతా సంతోషంలో మునిగిపోతుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయాన్ని మీరు సృష్టించుకుంటారు. పని ఒత్తిడి వల్ల అలసట వస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభ రాశి
ఈ నెల మీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు. మెరుగైన ప్యాకేజీతో కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు రావచ్చు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి, కొత్త బ్రాంచీలు ఓపెన్ చేసే ఆలోచన చేస్తారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి కుటుంబం మీకు కొండంత అండగా నిలుస్తుంది. ఏళ్ల కిందట విడిపోయిన పాత స్నేహితుడిని కలుసుకోవడం వల్ల పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. దీనివల్ల మీ మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది.
మీన రాశి
ఆగస్టు నెల మీకు కొన్ని సవాళ్లను, మరికొన్ని సంతోషాలను మిశ్రమంగా అందిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీరు ఆశించిన విజయం క్రమక్రమంగా వరిస్తుంది, కాబట్టి ఓపిక అవసరం. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులు రావచ్చు. కాబట్టి అనవసరమైన ఆడంబరాలకు డబ్బు ఖర్చు చేయకండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారతాయి.
More Articles
- శుక్ర-శని సమసప్తక యోగం.. ఆగస్టు 1 నుండి ఈ రాశులకు ఊహించని కష్టాలు!
- దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు!
- శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు!
- ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.!
- భయంకరమైన కాలసర్ప దోషం.. ఈ 4 రాశుల వారికి డేంజర్!
- ఇంకా 15 రోజులే.. ఈ రాశుల వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని ధన యోగం.!