జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య యోగం సంభివిస్తుంది. కాగా, సూర్యుడు ఇప్పటికే కర్కాటక రాశిలో ఉండటం.. ఆగస్టు 5న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తుండటంతో ఈ శుభ యోగం ఏర్పడనుంది. బుధాదిత్య యోగం కారణంగా రేపటి నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ఆ రాశులేంటో చూద్దాం..
మేషరాశి
బుధాదిత్య యోగం మేష రాశి వారికి విజయాలను తీసుకురానుంది. ఈ యోగం నాలుగో స్థానంలో అంటే సుఖం, సంపదకు సంబంధించిన స్థానంలో ఏర్పడుతున్న కారణంగా పలు అంశాల్లో గెలుపు సాధిస్తారు. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం వీరిదే అవుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కారణంగా ప్రశాంతంగా ఉంటారు. వారి మద్దతు లభిస్తుంది. వృత్తిలో పురోగతి అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ నెలలో కొందరు వాహనం కొనాలనే ఆలోచనను అమలు చేసే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల మద్దతు మీకు ఎనలేని బలాన్న అందిస్తుంది.
మిథునం
బుధుడు మిథున రాశికి అధిపతిగా ఉండటంతో బుధాదిత్య యోగం ప్రయోజనాలు వీరికి ప్రత్యేకంగా ఉంటాయి. సంపదకు సంబంధించిన రెండో స్థానంలో ఈ యోగం ఉండటంతో ఆదాయ మార్గాలు కొత్తవి తెరుచుకునే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి పెద్ద ఒప్పందాలు కుదరవచ్చు. వృత్తిపరంగా ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు పొందుతారు. మీ వాక్చాతుర్యం, లాజికల్ థింకింగ్ కారణంగా మీ గౌరవం మరింత పెరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధాదిత్య యోగం లగ్న స్థానంలో ఉండటంతో వ్యక్తిత్వ, ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. కోరుకున్న రంగంలో ఉద్యోగం పొందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి కొత్త మార్గాలు దొరుకుతాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. అది మీకు భవిష్యత్తు ప్రయోజనాలను అందిస్తుంది.
తులారాశి
తులా రాశి వారికి బుధాదిత్య యోగం వృత్తి, పనికి సంబంధించి కర్మ భావం అంటే దశమ స్థానంలో ఏర్పడుతుంది. దీని ప్రభావంగా పనికి సంబంధించి విషయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. మీ పై అధికారులు మీ పని పట్ల సంతృప్తిగా ఉంటారు. మీపై ప్రశంసలు కురిపిస్తారు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం. వారికి సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పనిని ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం అనుకూలంగా ఉండి మీరు అనుకున్నవి నెరవేరే సూచనలు ఉన్నాయి.
More Articles
- బుధాదిత్య యోగం.. డిసెంబర్ 16వ తేదీ లోపు ఈ రాశుల వారి సమస్యలు తొలగిపోతాయి
- Budhaditya Yoga 2023: సింహరాశిలో బుధాదిత్య యోగం, 3 రాశుల వారు విజయంతో అగ్రస్థానానికి ఎదుగుతారు!
- కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు
- సూర్యుని నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి ‘ప్రేమ’ కష్టాలు తప్పవు.!
- ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు.. ఆగష్టులో ఈ రాశుల వారికి అన్నింటా రాజయోగమే.!
- తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.!