జాతకఫలాలు: శనివారం, ఆగస్టు 6, 2011


మేషం - ఉమ్మడి వ్యాపారాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేస్తారు. హామీలు, చెక్కుల జారీలో పునరాలోచన మంచిది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖుల తోడ్పాటుతో మీ పనులు సానుకూలమవుతాయి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.

వృషభం - పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి శ్రమే మిగులుతుంది. ఫలితాలు దక్కవు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరగలదు. స్త్రీలకు ఆపద సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు.

మిథునం - రాజకీయ నాయకులకు పార్టీపరంగా అన్ని విధాలుగా గుర్తింపు లభిస్తుంది. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ఖర్చులు ఎక్కువ.

కర్కాటకం - కోర్టు వ్యవహారాలు, స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఏ విషయంలో కూడాతొందర మంచిది కాదు. నిదానించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. నిత్యావసర సరుకుల స్టాకిస్టులకు వేధింపులు తప్పవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

సింహం - మీ భార్య మొండి వైఖరి, కుటుంబ సభ్యుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య - కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్ధులు ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్లేందుకు మార్గం సుగమవుతుంది. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు.

తుల - కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలలో పునరాలోచన అవసరం. ముఖ్యుల కోసం ధనం ఖర్చు చేస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. బంధువుల రాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు.

వృశ్చికం - ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతైనా పోరాడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన కుదరదు. స్థిర చిత్తం లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు.

ధనస్సు - మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆథ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. అధిక మొత్తంలో అప్పు చేయవలసివస్తుంది.

మకరం - కుటుంబంలో నెలకొన్న అనిశ్చితి, అశాంతి క్రమంగా తొలిగిపోతాయి. క్రయ విక్రయ రంగంలోని వారికి మెళుకువ అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు.

కుంభం - చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహాం చోటు చేసుకుంటుంది. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. ఇతర విషయాలపై ఆసక్తిని తగ్గించి, స్వవిషయాలపై శ్రద్ధ పెడితే మంచిది.

మీనం - మాట తొందర వల్ల కొంత మంది మనసు నొప్పించే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్ధుల గురించి ఆందోళన చెందుతారు. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు ఉపయోగపడతారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం.

Have a great day!
Read more...

English Summary

Viewers can see their future prediction in thatstelugu.com