దిన ఫలాలు: మంగళవారం మార్చి 11, 2014


మేషం

దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు నూతన వ్యాపారాలు చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం మంచిది. కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మిక సమస్యలు తప్పవు.

వృషభం

ప్రైవేటు, పత్రికా రంగాల్లోవారికి అధికారులతో సమస్యలు తప్పవు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి.

మిథునం

తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభించినా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.

కర్కాటకం

దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ వహించండి. మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. సోదరీ, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

సింహం

భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హజరు కావడం మంచిది.

కన్య

మీ ఆంతరంగిక విషయాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి.

తుల

ఉద్యోగస్తులు ట్రాన్సుఫర్, ప్రమోషన్‌లు యత్నాలను గుట్టుగా సాగించాలి. వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం

స్త్రీల ఆరోగ్యములో మెళుకువ అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు

కళ, క్రీడా సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. తెలివి తేటలతో వ్యవహరించడంవల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.

మకరం

మీ స్తోమతకు మించి వాగ్ధానాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యములో మెళుకువ అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది.

కుంభం

క్రయ విక్రాయలు లాభసాటిగా ఉంటాయి. కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, గృహోపకరణ వ్యాపారులు పురోభివృద్ధి పొందుతారు. ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు. వృత్తి వ్యాపారులకు మిశ్రమఫలితం.

మీనం

విద్యార్థుల్లో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటు చేసుకుంటుంది. వ్యాపారాలకు సంభంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు.

Have a great day!
Read more...

English Summary

Your Daily Horoscope will see in telugu.boldsky.com