జాతకఫలాలు: ఆగస్టు 22, 2011


మేషం - కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు అనుకూలమైన కాలం. మీ వాక్‌చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం - రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల సమస్యలను ఎదుర్కుంటారు.

మిథునం - కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. విదేశీ యత్నాల్లో స్పల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.

కర్కాటకం - ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రసంశలు లభిస్తాయి. నియమాలకు కట్టుబడి ఉండుటవలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు.

సింహం - ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.

కన్య - దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఫ్లీడర్లకు, ఫ్లీడర్ గుమస్తాలకు అనుకూలమైన కాలం. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల - రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు.

వృశ్చికం - గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. అందరికి సహాయం చేసి మాటపడవలసి వస్తుంది.

ధనస్సు - ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు అధికమవుతున్నారు. ప్రభుత్వోద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీలు రావచ్చు.

మకరం - శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీలకు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వల్ల మనస్థాపం తప్పవు.

కుంభం - డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మీ ఆంతరంగిక సమస్యలకు నెమ్మదిగా పరిష్కార మార్గం దొరుకుతుంది.

మీనం - కందులు, ఎండుమిర్చి స్టాకిస్టులు, వ్యాపారస్తులు ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం.

Read More About: sunday daily weekly horoscope

Have a great day!
Read more...

English Summary

Your daily horoscope will see in oneindiatelugu.com