నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా ఇంటి డాబాపైన కూరగాయలు, పూల మొక్కలు పెంచడం చూస్తుంటాం. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఎక్కువగా లేకపోతే ఇలా టెర్రస్‌పైన మొక్కలు పెంచడానికి ఇష్టపడతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డాబాపైన కొన్ని మొక్కలు పెంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొన్ని మొక్కలు.. అశుభ పరిణామాలకు సంకేతంగా చెబుతున్నారు. మరి డాబాపైన ఎలాంటి మొక్కలు పెంచాలి.. ఎలాంటివి పెంచకూడదు.. నిపుణుల సలహాలు చూద్దాం..

Advertisement

ముళ్ల మొక్కలు

ఇంటి డాబాపైన ముళ్ల మొక్కలను పెంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే గులాబీ మొక్కలను పెంచవచ్చని.. కానీ మొత్తం ముళ్లు ఉండే బ్రహ్మజెముడు లాంటి మొక్కలను పెంచకూడదని చెబుతున్నారు. ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతంలోనే ఉంటాయి. వీటిని టెర్రస్‌ పైన పెంచితే ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీని పెంచి కుటుంబంలో ఒత్తిడి, ఆర్థిక బాధలు, ఒత్తిడికి దారితీస్తాయని అంటున్నారు.

Advertisement

బోన్సాయ్‌ మొక్కలు

టెర్రస్‌పైన బోన్సాయ్‌ మొక్కలను పెంచకూడదు. వీటి వల్ల కుటుంబీకుల ఎదుగుదల, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి దిగజారడంతో పాటు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది.

తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.!

పాలు కారే మొక్కలు

డాబా పైన జిల్లేడు మొక్క వంటి పాలు కారే మొక్కలను పెంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కలు ఇంట్లో సుఖశాంతులను దూరం చేయడంతో పాటు ఆర్థిక కష్టాలను తీసుకువస్తుంది.

ఎండిన, వాడిన మొక్కలు

వాస్తు శాస్త్రం ప్రకారం ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలను ఇంటి టెర్రస్‌పైన ఉంచకూడదు. అదేవిధంగా ప్లాస్టిక్‌ ఆకుల మొక్కలు, నకిలీ ప్లాంట్స్‌ను డాబా పైన పెట్టకూడదు. ఇవి ఇంట్లోకి దరిద్రాన్ని, అనారోగ్యాన్ని ఆహ్వానిస్తాయని నిపుణులు అంటున్నారు. మీ ఇంటి డాబా పైన ఇలాంటి మొక్కలు ఉంటే వెంటనే తీసేసి తాజా మొక్కలు ఉంచాలని సూచిస్తున్నారు.

సూర్యుని నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి 'ప్రేమ’ కష్టాలు తప్పవు.!

మొక్కలు ఆరోగ్యకరంగా, శుభసూచకంగా పెరగడానికి అనువైన వాతావరణం అవసరం. మెుక్కల వేర్లు విశాలంగా నేలలో వ్యాపించినట్లయితే ఆకులు, పూలు, కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కొత్తిమీర, పుదీనా వంటి వాటిని కుండీలలో పెంచవచ్చు. వాటిని కొంతకాలం తర్వాత తీసేసి మళ్లీ గింజలు నాటుతాం కాబట్టి వీటికి చాలా తక్కువ ప్లేస్‌, కుండీలు సరిపోతాయి. కానీ పూల మొక్కలు, తులసి వంటి వాటికి పెద్ద కుండీలు అవసరం. వాటి వేర్లు వ్యాపించడానికి, విశాలంగా పెరగడానికి అనువైన స్థలం అవసరమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.