జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు వృషభ రాశిని విడిచి మిథునంలోకి ప్రవేశించాడు. ఈ రాశి మార్పుతో కుజ, రాహువుల మధ్య ప్రత్యేక నవ పంచమ యోగం ఏర్పడి సెప్టెంబర్‌ 18 వరకు పలు రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. కుజ, రాహువుల కలయికతో వారికి శక్తి, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు విశేషంగా ఆర్థిక లాభాలు అందుకునే అవకాశం ఉంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..

Advertisement

మేషరాశి

మేషరాశికి అధిపతిగా ఉన్న కుజుడు మిథున రాశిలోకి సంచారం వీరిపై ప్రత్యేక ప్రభావం ప్రదర్శిస్తుంది. వీరిలో ఆత్మ విశ్వాసం పెరిగి తలపెట్టే ప్రతి నిస్వార్థమైన పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. స్టాక్‌ మార్కెట్‌ లేదా పెట్టుబడి రంగాల్లో ఉన్నవారికి కష్టానికి తగిన ప్రతిఫలం పొంది లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు బలపడతాయి. సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు విజయం సాధించవచ్చు.

Advertisement

ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా?

మిథునం

కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తుండటంతో వారికి నూతన శక్తి పెరిగి.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరింత పెరుగుతుంది. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారం రంగంలోకి వెళ్లాలనుకునేవారికి ఈ సమయం అనకూలించే అవకాశాలు ఉన్నాయి. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సరైన నిర్ణయాలు తీసుకోగలరు.

తులారాశి

కుజ, రాహువుల కలయిక తులారాశి వారికి సెప్టెంబర్‌ 18 వరకు ప్రతి పనిలోనూ అదృష్టం వరించే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా పురోగతి అందుకుంటారు. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా పరిస్థితి బలపడుతుంది. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

ఆగష్టులో ప్రధాన గ్రహాల రాశి మార్పులు.. ఈ నాలుగు రాశుల వారికి లక్కే లక్కు.!

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని అందిస్తుంది. నూతనోత్సాహంతో పనులు మొదలుపెడతారు. లక్ష్య సాధనలో కష్టపడి పనిచేస్తారు. ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వృత్తిపరంగా మీరు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలతో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బయట నుంచి మీకు రావాల్సిన డబ్బు అందుతుంది. కుటుంబ జీవితం ఆరోగ్యకరంగా, సంతోషకరంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.