జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగష్టు అనేక ముఖ్యమైన గ్రహాల సంచారంతో ప్రారంభం కావడంతో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు అందుతున్నాయి. శుక్రుడు, కుజుడు రాశి చక్రాలను మార్చుకోవడం, సూర్యుడు తన సొంత రాశి సింహ రాశిలోకి ప్రవేశం కారణంగా కొందరికి పురోగతి, విజయం లభిస్తుంది. శ్రావణ మాసం, రక్షా బంధన్‌ సానుకూల శక్తి కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఏంటో చూద్దాం..

Advertisement

మేష రాశి

ఆగష్టు నెల మేష రాశి వారికి ఆనందం, విజయాలను అందించే సూచనలు ఉన్నాయి. ఆదాయంతో పాటు లాభాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు కీర్తి, ప్రజాదరణ అందుకుంటారు. వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఈ రాశి వారికి పెండింగ్‌ పనులు ఆగష్టులో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితానికి సంబంధించి సంబంధాలు మళ్లీ చిగురిస్తాయి. ఆయా దశల్లో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

Advertisement

మీ అరచేతిలో V ఆకారం ఉందా? 35 ఏళ్ల తర్వాత మీరు ఊహించని విధంగా లైఫ్!

సింహ రాశి

ఆగష్టు నెల సింహరాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. సింహ రాశిలోకి సూర్య సంచారం మీలో ఆత్మవిశ్వాసం, విజయం పెరుగుతుంది. వృత్తిపరంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. పై అధికారుల మద్దతు, పనిలో మీ శ్రమ కారణంగా పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. కుటుంబపరంగా జీవితం సంతోషంగా ఉంటుంది. వస్తు, వాహనాలు కొనాలనే మీ ప్లానింగ్‌ విజయవంతమవుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఆగష్టు నెల ఆర్థిక లాభాలు అందించే అవకాశాలు ఉన్నాయి. వీరి అదృష్టం మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలిసే సూచనలు ఉన్నాయి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రయత్నాల్లో విజయం అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఇది శుభ సమయం. వ్యాపారంగంలో ఉన్న వారికి శుభ దాయకంగా ఉంటుంది. మీ వ్యక్తిగత, వృత్తిపరంగా పురోగతికి, సమాజంలో గుర్తింపునకు కొత్త అవకాశాలు అందుకుంటారు.

తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.!

మీన రాశి

మీన రాశి వారు ఆగష్టులో విజయాలు అందుకుంటారు. మీ పనిలో ప్రత్యేకతకు గౌరవం లభిస్తుంది. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులకి సంబంధించి ఉపశమనం పొందవచ్చు. కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఈ నెలలో బయటపడతారు. భూ, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారరంగంలో కొత్త అవకాశాలు అందుకుంటారు. ఫలితంగా భవిష్యత్తులో పురోగతి అందుకుంటారు. వివాహానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంలో కొత్త వ్యక్తి రాకతో ఒంటరితనం నుంచి ఉపశమనం లభిస్తుంది.