జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగష్టు 1న శుక్రుడు కన్యారాశిలోకి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కన్యారాశికి బుధుడు అధిపతి కావడం, బుధ, శుక్ర గ్రహాల మధ్య స్నేహపూర్వక సంబంధంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభాలను తీసుకువస్తుంది. మరి ఏయే రాశుల వారికి శుక్ర గోచారం కలిసి వస్తుందో చూద్దాం..

Advertisement

మేష రాశి

సంపద, ఆనందం, శ్రేయస్సు, విలాసాలకు అధిపతి అయిన శుక్ర గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తుండటం మేష రాశి వారికి వ్యాపార పరంగా సానుకూలమైన అవకాశాలను అందిస్తుంది. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. సుదూర ప్రయాణాలు చేయవచ్చు. పెట్టుబడి అవకాశాలు పొందుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. శ్రేయస్సు పొందుతారు.

Advertisement

మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.!

కన్యా రాశి

శుక్ర గ్రహ గోచారం కన్యా రాశిలో ఉండటంతో ఈ రాశి వారి ఇది శుభ సమయం. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. కెరీర్‌లో పురోగతి పొందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. లీడర్‌షిప్‌ స్కిల్స్‌ మెరుగుపరుచుకుంటారు. కొత్త ప్రాజెక్ట్‌లో మీరు చేరవచ్చు. పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి.

Advertisement

తులా రాశి

సూర్యుని నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి 'ప్రేమ’ కష్టాలు తప్పవు.!

కన్యా రాశిలోకి శుక్ర గ్రహ సంచారం కెరీర్‌, వ్యాపారమే కాదు వ్యక్తిగతంగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలను అందుకుంటారు. వ్యాపార రంగంలో భాగంగా చేసే పర్యటనలు ప్రయోజనాలను ఇస్తుంది. పెట్టుబడులతో పాటు లాభాలను పొందే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, అసంపూర్తి పనుల్లో వేగం పెరుగుతుంది. తద్వారా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఎంతో కాలంగా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే మీ కల నెరవేరుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది శుభ సమయం. గుడ్‌ న్యూస్‌ వినే సూచనలు ఉన్నాయి. ఆభరణాలు లేదా వాహనాలు కొనాలని ప్లాన్‌ చేస్తున్న వారికి శుక్ర గ్రహ గోచారం అనుకూలంగా ఉంటుంది.