నుదిటిపై మొటిమలను నివారించే హోం రెమెడీస్ మరియు చిట్కాలు


మొటిమలు లేదా ఆక్నే సమస్య అనునవి మనం ఒక వయసు నుండి తరచుగా ఎదుర్కోవాల్సిన అత్యంత సాధారణ చర్మ సంబంద పరిస్థితులుగా ఉంటాయి. కానీ వయసుతో సంబంధం లేకుండా, వారి వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. అంతేకాకుండా, కొంతమంది ఈ పరిస్థితులను అత్యంత తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు కూడా. ఒక చిన్న మొటిమ కనిపిస్తేనే ఆందోళన చెందే వారు, అవి పెరుగుతున్న కొలదీ వాటిని తగ్గించుకునే ప్రయత్నంలో అనేక మార్గాలను అనుసరించడానికి సిద్దపడుతూ ఉంటారు. కొందరిలో ఈ సమస్య, వారి మానసిక స్థాయిలను సైతం ప్రభావితం చేసేలా నుదురు, భుజం వంటి భాగాలలో తీవ్రంగా విస్తరిస్తూ ఉంటాయి. ఏదిఏమైనా, ఇలా నుదురు వంటి భాగాలలో విస్తరిస్తున్న మొటిమలు లేదా, ఆక్నే సమస్యను ఎదుర్కోడానికి సహాయపడే సహజసిద్దమైన నివారణా మార్గాలు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాయని మరువకండి. మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

Advertisement

మీ నుదుటి మీద మొటిమలు మరియు ఆక్నే సమస్యలకు గృహ చిట్కాలు అనునవి ఖచ్చితమైన పరిష్కారంగా ఉంటాయి. ఇవి అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకుని, చర్మంపై వినియోగించడానికి సురక్షితమైనవిగా ఉంటాయి. ఇవి మీ చర్మంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించవు కూడా.

Advertisement

నుదుటి మీద మొటిమలను వదిలించుకోవడానికి సూచించదగిన గృహచిట్కాలు :

1. నిమ్మ రసం :

నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా నిమ్మరసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కూడా ఉత్తమంగా ఉంటాయి. ఇది సమయోచితంగా చర్మంపై వర్తించినప్పుడు నుదుటిమీద మొటిమలను తొలగించగలుగుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

• 2 టేబుల్ స్పూన్ నీళ్ళు

అనుసరించు విధానం :

ఒక గిన్నెలో నిమ్మరసం మరియు నీళ్లను రెండింటిని తీసుకుని, బాగా కలపండి. ఒక కాటన్ బాల్ ను ఈ మిశ్రమంలో డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. 15 నిముషాలపాటు అలాగే వదిలేసిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరచండి. ఆశించిన ఫలితాలకోసం రెండు రోజులకు ఒకసారి దీనిని పునరావృతం చేయండి.

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడుకుని, నుదుటిమీద మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్

• 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు

అనుసరించు విధానం :

ఆపిల్ సైడర్ వెనిగర్ను కొన్ని నీళ్ళలో వేసి కలపండి. ఒక కాటన్ బాల్ ను ఈ మిశ్రమంలో డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆశించిన ఫలితాలకోసం ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ పద్దతిని పునరావృతం చేయండి.

3. టొమాటో :

టొమాటోలలో విటమిన్ సి సమృద్ధిగా ఉన్న కారణంగా, శోథనిరోధక లక్షణాలలో ఉత్తమంగా ఉంటుంది. ఇవి నుదుటి మీద మొటిమలను తొలగించి, మీకు సున్నితమన చర్మాన్ని అందివ్వడానికి సహాయపడుతాయి.

కావలసిన పదార్దాలు :

• 1 టొమాటో

అనుసరించు విధానం :

టమోటోను సగానికి కట్ చేసి. ఒక ముక్కను తీసుకుని ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి. దీనిని 15 నుండి 20 నిమిషాలపాటు విడిచిపెట్టండి. కోరుకున్న ఫలితాల కోసం రోజులో కనీసం ఒకసారి ఇలా పునరావృతం చేయండి.

4. ఎగ్ వైట్ :

గుడ్డులోని తెల్లసొన, మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడే లైసోసైమ్ అనే ఎంజైమ్ను కలిగి ఉంటుంది. క్రమంగా మీకు స్పష్టమైన మరియు మృదువైన చర్మాన్ని అందివ్వడంలో సహాయం చేస్తుంది.

కావలసిన పదార్ధం :

• 1 గుడ్డు

అనుసరించు విధానం :

ఒక గుడ్డును పగలగొట్టి ఒక గిన్నెలోనికి తీసుకోండి. దీనిలో తెల్లసొనను వేరు చేయండి. బ్రష్ ఉపయోగించి మీ నుదురు లేదా ప్రభావిత ప్రాంతాలలో ఎగ్ వైట్ అప్లై చేయండి. మరియు 30 నిమిషాలపాటు అలానే ఉండనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఆశించిన ఫలితాలకోసం రోజుకొకసారి అనుసరించండి.

5. తేనె :

తేనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన ఇది నుదుటి మీద ఏర్పడే మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, విసుగు చర్మం ఉపశమనానికి మరియు వాపును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధం :

• 2 టేబుల్ స్పూన్స్ తేనె

అనుసరించవలసిన విధానం :

కొద్దిగా ముడితేనెను చేతిలోనికి తీసుకుని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. 30 నిముషాలపాటు అలానే వదిలేసి, ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఆశించిన ఫలితాలకోసం రోజులో ఒకసారి పునరావృతం చేయండి.

6. బేకింగ్ సోడా :

టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. క్రమంగా మొటిమలు మరియు మొటిమలతో కూడిన మచ్చలను వేగవంతంగా నయం చేయడానికి అత్యుత్తమంగా సహాయపడుతుంది. ఇది మొటిమల కారక బ్యాక్టీరియాతో పోరాడే యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కూడా కలిగి ఉంటుంది, అందువలన మొటిమలు మరలా రాకుండా నిరోధించగలుగుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ టీ ట్రీ ఆయిల్

• 1 టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్

అనుసరించవలసిన విధానం :

రెండు నూనెలను ఒక చిన్న గిన్నెలోనికి తీసుకుని బాగా కలపండి. ఒక కాటన్ బాల్ ను ఈ మిశ్రమంలో డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయం కడిగేసుకోండి. ఆశించిన ఫలితాల కోసం రోజులో ఒకసారి ఇలా పునరావృతం చేయండి.

8. దోసకాయ రసం :

కీరాదోసకాయలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. క్రమంగా మొటిమలతో పోరాడడంలో అత్యుత్తమంగా సహాయపడగలదని చెప్పబడుతుంది. ఇది సమయోచితంగా అనువర్తించినప్పుడు చిరాకుతో కూడిన చర్మానికి ఉపశమనాన్ని ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు :

• 1/2 దోసకాయ

అనుసరించవలసిన విధానం :

కీరా దోసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని గ్రైండ్ చేసి కీరా దోసకాయ జ్యూస్ తయారుచేయాలి. దానిని ఒక గిన్నెకు బదిలీ చేయండి. ఒక కాటన్ బాల్ ను ఈ మిశ్రమంలో ముంచి, ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి. రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఆశించిన ఫలితాలకోసం మూడు రోజులకు ఒకసారి పునరావృతం చేయండి.

9. ఐస్ క్యూబ్స్ :

ఐస్ క్యూబ్లు మీ ముఖంపై ఉండే రంధ్రాలను తెరిచి, దానిపై స్థిరపడ్డ మురికిని తొలగించడంలో సహాయం చేస్తుంది. తద్వారా మొటిమలు మరియు ఆక్నే సమస్యను తొలగించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

కావలసిన పదార్ధం :

• 2 నుండి 3 ఐస్ క్యూబ్స్

అనుసరించవలసిన విధానం :

ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ప్రభావిత ప్రాంతంలో రుద్దండి. ఇది ఆరిపోయే వరకు విడిచిపెట్టండి. వాంఛిత ఫలితాలను పొందేందుకు, రోజులో రెండు లేదా మూడుసార్లు ఈ పద్దతిని పునరావృతం చేయండి.

10. మామిడి & జామ ఆకులు :

మామిడి ఆకుల్లో విటమిన్ ఎ ఉంటుంది, ఇది మీ చర్మంలో నూనెల (సెబం) అధిక ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా నుదుటిమీద మొటిమలు మరియు ఆక్నే సమస్యను నిరోధించగలుగుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 4 నుండి 5 మామిడి ఆకులు

• 4 నుండి 5 జామ ఆకులు

అనుసరించవలసిన విధానం :

మామిడి మరియు జామ ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. పేస్ట్ లా తయారు చేయడానికి మిశ్రమంలో కొంత పరిమాణంలో నీటిని జోడించండి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి సుమారు 30 నిముషాలు అలానే వదిలేసిన తర్వాత, చన్నీళ్ళతో శుభ్రపరచుకోండి. ఆశించిన ఫలితాల కోసం దీనిని వారంలో 2 నుండి 3 సార్లు పునరావృతం చేయండి.

11. ఉసిరి :

ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ప్రభావిత ప్రాంతంలో దీనిని సమయోచితంగా అనువర్తించడం ద్వారా మొటిమల చికిత్సలో అద్భుతంగా ఉపయోగపడగలదు. మరియు చర్మానికి స్పష్టమైన సహజసిద్దమైన ప్రకాశకాన్ని అందిస్తుంది.

కావలసిన పదార్ధం :

• 1/2 కప్పు ఉసిరి రసం

అనుసరించవలసిన విధానం :

కొంచం ఉసిరిరసాన్ని, ఒక పాత్రలోనికి తీసుకోండి. దీనిలో ఒక కాటన్ బాల్ డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. దీనిని సుమారు 20 నిముషాలు పాటు అలాగే, ఉండనిచ్చిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆశించిన ఫలితాలకోసం రోజులో ఒకసారి ఈ విధానాన్ని పునరావృతం చేయండి.

12. సోంపు (ఫెన్నెల్ సీడ్స్) :

సోంపు, లిమోనెన్, ఆనెథోలె మరియు మైర్సెనే వంటి నిర్ధిష్ట సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి మొటిమల చికిత్సలో అద్భుతంగా సహాయపడగలవు. ఇవి మీ చర్మంపై ఉండే రంద్రాలను బిగుతుగాచేసి, దానిపై అదనపు నూనెలను తగ్గించడంలో కూడా సహాయపడగలవు.

కావలసిన పదార్ధాలు :

• 1 స్పూన్ సోంపు

• 1 టేబుల్ స్పూన్ నీరు

అనుసరించవలసిన విధానం :

సోంపు విత్తనాలను గ్రైండ్ చేసి, పొడి చేసిన తర్వాత, ఒక గిన్నెకు బదిలీ చేయండి. దీనికి కొన్ని నీళ్లను చేర్చి పేస్టులా తయారు చేసుకోవాలి. మీరు ఎక్కువ నీటిని జోడించరాదని గుర్తుంచుకోండి. దీనిని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. దానిని కడిగే ముందు సుమారు 15 నుండి 20 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి. ఆశించిన ఫలితాల కోసం వారానికొకసారి రిపీట్ చేయండి.

13. చందనం :

చందనాన్ని తరతరాలుగా చర్మ సంరక్షణకు వినియోగించడం జరుగుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్రమంగా, ఇది నుదుటి మీద మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తొలగించి, అదే సమయంలో మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో సహాయం చేస్తుంది.

కావాల్సిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ చందనం పొడి

• 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

అనుసరించదగిన విధానం :

ఒక గిన్నెలో గంధంపొడి మరియు నిమ్మరసాన్ని తీసుకుని, రెండు పదార్థాలను మిశ్రమంగా తయారుచేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. మరియు సుమారు 10 నుండి 12 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి. తరువాత, చన్నీళ్ళతో శుభ్రంగా కడిగి, తువాలుతో దానిని పొడిగా చేయాలి. ఆశించిన ఫలితాలకోసం ఈ ప్రక్రియను రోజులో ఒకసారి పునరావృతం చేయండి.

14. గ్రీన్ టీ :

గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న కారణంగా, మీ చర్మంలో సెబం ఉత్పత్తిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. తద్వారా మొటిమలను ఎదుర్కోవటానికి అత్యుత్తమంగా సహాయపడగలదని చెప్పబడుతుంది.

కావలసిన పదార్ధం :

• 2 వాడిన గ్రీన్ టీ బ్యాగులు

అనుసరించవలసిన విధానం :

ఈ విధానంలో వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను ఉపయోగించాలి. వాటిని మీ నుదుటిపై ఉంచి, 20 నిమిషాలపాటు అలానే ఉండనివ్వండి. తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. కోరుకున్న ఫలితాలకోసం రోజులో ఒకసారి ఇలా పునరావృతం చేయండి.

15. కొత్తిమీర తరుగు, రోజ్ వాటర్, & దాల్చిన చెక్క :

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో లోడ్ చేయబడిన, కొత్తిమీర ఆకులు, నునుపైన మొటిమలు, ఆక్నే, చారలు మరియు ముడుతలు వంటి అనేక చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది. మీరు రోజ్ వాటర్ మరియు దాల్చిన చెక్కతో కలిపి కొత్తిమీర ఆకులను ఉపయోగించవచ్చు.

కావలసిన పదార్ధాలు :

• గుప్పెడు కొత్తిమీర తరుగు

• 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్

• 2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి

అనుసరించదగిన విధానం :

కొత్తిమీరను మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీనికి కొంత రోజ్ వాటర్ మరియు దాల్చిన చెక్కపొడిని జోడించి, అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. దీన్ని ప్రభావిత ప్రాంతం మీద అప్లై చేసి అరగంటపాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కోరుకున్న ఫలితాలకోసం రెండు రోజులకు ఒకసారి ఇలా పునరావృతం చేయండి.

16. కలబంద, వేప ఆకులు, మరియు బొప్పాయి గుజ్జు :

కలబంద యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలతో లోడ్ చేయబడి ఉండే యాక్టివ్ కాంపౌండ్స్ తో కూడుకుని ఉంటాయి. క్రమంగా ఇది నుదుటిమీది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 1/2 టేబుల్ స్పూన్లు కలబంద గుజ్జు

• 2 టేబుల్ స్పూన్ల వేపాకుల పేస్ట్

• 1 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు

అనుసరించదగిన విధానం :

అన్ని పదార్ధాలను కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని అవి ఒక స్థిరమైన మిశ్రమం ఏర్పడేవరకు బాగా కలపండి. దీన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 20 నిముషాలు అలానే వదిలేసి, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కోరుకున్న ఫలితాలకోసం రోజులో ఒకసారి ఇలా పునరావృతం చేయండి.

నుదుటిమీద మొటిమలను వదిలించుకోవడానికి సూచించదగిన మరికొన్ని చిట్కాలు :

• నుదుటి మీద మొటిమలకు చికిత్స చేయడం కొరకు లోతైన క్లెన్సింగ్ ఉత్పత్తులను ప్రయత్నించండి.

• అంతేకాకుండా రోజ్ వాటర్ వంటి అన్ని సహజ పదార్థాల కోసం కూడా వెళ్లొచ్చు.

• నుదుటి మీద మొటిమలను నివారించడానికి మరొక ప్రధాన చిట్కా, మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించడంగా ఉంటుంది. మరియు హానికరంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగించకుండా చూసుకోవడం కూడా ఉత్తమం.

• హానికరమైన పదార్ధాలను కలిగి ఉన్న రసాయనాలను మీ తల మరియు నుదుటి మీద అప్లై చేయడం ద్వారా పరోక్ష ప్రభావాన్ని కలిగి ఉన్న కారణాన, నుదుటిమీద మొటిమలకు కూడా కారణమవుతుంది. అలాగే, చుండ్రు కూడా మొటిమలకు మరో ప్రధాన కారణం కావచ్చు.

• అంతేకాకుండా, మీరు తరచుగా ఉపయోగించే కాస్మెటిక్స్ లో కూడా మొటిమలకు కారణమయ్యే కొన్ని హానికరమైన పదార్ధాలను కలిగి ఉండవచ్చు. అందువలన, మీరు మీ చర్మానికి హాని కలిగించే అవకాశాలు ఉన్న ఉత్పత్తులను ఉపయోగించకుండా చూసుకోవడం మంచిది.

• ఎల్లప్పుడూ మీ ముఖంమీద మంచి తేమ స్థాయిలను నిర్వహిస్తూ, అదనపు నూనెలు లేకుండా చూసుకోండి. మీరు కావాలనుకుంటే తరచూగా మొహం శుభ్రపరచుకోవడం లేదా ఫేషియల్స్ అనుసరించండి. అంతేకాకుండా ఒత్తిడి, లేదా అనారోగ్యకర ఆహరం, మరియు జీవనశైలి విధానాలు, శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా నుదుటిమీద మొటిమలకు దారితీస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Acne is one of the most common skin conditions we often have to deal with. Home remedies are a perfect solution to all your forehead acne and pimple problems as they are completely cost-effective and are safe to use. Try using neem, aloe vera, mango leaves, coriander, honey, rosewater, lemon, apple cider vinegar, tomatoes or fennel seeds for treating acne