పై పెదవిపై వెంట్రుకలు తొలగించే 8 ఎఫెక్టివ్ హోం రెమెడీస్


పైపెదాల మీది అవాంచిత రోమాలు అనేది, వాస్తవానికి మహిళలు ఎదుర్కొనే సమస్యలలో సర్వసాధారణమైన అంశంగా ఉంటుంది. కానీ, వీటిని తొలగించుకోవడానికి మనం తరచుగా పార్లర్లకి వెళ్తాం. త్రెడింగ్, వాక్సింగ్ మరియు షేవింగ్ వంటి అనేక విధానాలను అనుసరిస్తూ, పై పెదవి మీది వెంట్రుకలను తొలగించడానికి ప్రయత్నిస్తుంటాము.

Advertisement

అయితే, ఇది అత్యంత బాధాకరమైన విధానాలుగా ఉన్నా, తప్పనిసరిగా అనుసరించవలసినవిగా ఉంటాయి. పైగా స్కిన్ రాషెస్ సమస్యకు కూడా కారణంగా మారవచ్చు. క్రమంగా ఈ విధానాలను అనుసరించడానికి కూడా ఆలోచనలోపడే అవకాశాలు ఉంటాయి. మనలో కొందరు ఆ బాధను విస్మరిస్తూ ఆ విధానాలను కొనసాగిస్తూ ఉంటే, కొందరిలో మాత్రం సాధారణం కంటే వెంట్రుకల పెరుగుదల అసాధారణంగా మారుతుంది.

Advertisement

మరి, ప్రతివారం ఈ విధానాలను అనుసరిస్తూ మనం బాధపడాల్సిందేనా?, మరి బాధాకరం కాని, ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా ? అంటే అవుననే చెప్పాలి. మీకు నొప్పి మరియు అసౌకర్యం కలగకుండా పైపెదవి మీది అవన్చిత రోమాలను ఖచ్చితత్వంతో తొలగించే కొన్ని అత్యుత్తమ గృహ చిట్కాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇవి జుట్టును తొలగించే సమయంలో మీ చర్మాన్ని నిర్వహించడానికి మరియు పోషణను అందివ్వడానికి పూర్తిగా సురక్షితమైనవిగా చెప్పబడుతాయి. ఈ చిట్కాలను అనుసరించడానికి, ఓపిక అవసరం ఉన్నప్పటికీ, మీరు ఆశించిన ఫలితాలను మాత్రం ఖచ్చితంగా పొందగలరు. ఏదిఏమైనా వేచి చూస్తేనే విలువ ఉంటుంది. మీ పైపెదాల మీది అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి సహాయపడే ఏడు గృహనివారణా చిట్కాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

1. ఎగ్ వైట్ మరియు పసుపు :

మీ పైపెదాల మీది అవాంచిత రోమాలను సహజసిద్దంగా తొలగించడానికి ఎగ్ వైట్ ఒక పరిపూర్ణ పదార్ధంగా చెప్పబడుతుంది. పొడిగా మారిన తర్వాత, తెల్లగుడ్డు స్టిక్కీ నేచర్ కలిగిన పదార్ధంగా మారుతుంది. క్రమంగా దానిని తొలగిస్తున్నప్పుడు, జుట్టును మృదువుగా తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఎగ్ వైట్ చర్మరంద్రాలను తెరచి, మురికిని తొలగించడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది. క్రమంగా చర్మం ముడుతల బారిన పడకుండా చూడగలుగుతుంది. పసుపును అవాంచిత రోమాలను తొలగించడానికి మాత్రమే కాకుండా, అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్, మరియు యాంటీ బాక్టీరియల్ గుణాల కారణంగా చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మృదువుగా నిర్వహిస్తూ, శుభ్రపరుస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టీస్పూన్ పసుపు

• 1 ఎగ్ వైట్

అనుసరించు విధానం :

• ఒక గిన్నెలో ఎగ్ వైట్ తీసుకుని, బాగుగా కలపండి(విస్క్ చేయండి).

• దీనికి పసుపును జోడించి, రెండు పదార్ధాలను మరలా కలపండి.

• పై పెదవి ప్రాంతంలో ఈ మిశ్రమం యొక్క పొరను అప్లై చేయండి.

• కనీసం ఒక గంటసేపు ఆరనివ్వండి.

• ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత, చర్మంపై ఏర్పడిన పొరను నెమ్మదిగా తొలగించండి.

• గోరువెచ్చని నీటిని ఉపయోగించి అప్పర్ లిప్ ప్రాంతాన్ని శుభ్రపరచండి.

• ఉత్తమ ఫలితాల కోసం ఈ రెమెడీని వారంలో కనీసం 2 నుండి 3 సార్లు పునరావృతం చేయండి.

2. పంచదార, తేనె మరియు నిమ్మ :

పంచదార, తేనె మరియు నిమ్మ మిశ్రమం ఒక మైనం వంటి ఆకృతిని తలపిస్తుంది. అంతేకాకుండా, జుట్టును సమర్థవంతంగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. చక్కెర కూడా మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది. తేనె, చర్మాన్ని తేమగా మరియు మృదువుగా ఉంచడంలో సహాయం చేస్తుంది. నిమ్మ చర్మానికి ఒక గొప్ప ప్రకాశకాన్ని అందివ్వగల పదార్ధంగా ఉంటుంది. క్రమంగా మీ ఎగువ పెదవి ప్రాంతాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 3 టేబుల్ స్పూన్ల పంచదార

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

ఉపయోగించే విధానం :

• ఒక గిన్నెలో పంచదారను తీసుకోవాలి.

• దీనికి తేనె, నిమ్మరసం జోడించి అన్నింటినీ బాగా కలిపి మిశ్రమంగా చేయండి.

• మీ పైపెదవి ప్రాంతంలో ఈ మిశ్రమం యొక్క పొరను వేయండి.

• 15 నుండి 20 నిమిషాలపాటు ఆరనివ్వండి.

• తర్వాత మొహం మీది పొరను తీసివేసి., గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి.

• ఆపై పొడి తువాలుతో తడిని తొలగించండి.

• ఉత్తమ ఫలితాలకోసం వారానికి రెండుసార్లు ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.

3. పసుపు మరియు పాలు :

పసుపును ప్రాచీనకాలం నుండీ జుట్టును నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. పాలు చర్మాన్ని మృదువుగా చేయడంతోపాటుగా, చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, పసుపు మీ చర్మాన్ని స్టెయినింగ్ నుండి నివారించడానికి, మరియు చర్మానికి పోషణను అందివ్వడానికి ఉత్తమంగా సహాయం చేస్తుంది. ఈ మిశ్రమం ఒక పేస్ట్ లా తయారవుతుంది. ఇది తరచుగా ఉపయోగించిన ఎడల, అవాంఛిత రోమాలను తొలగించడానికి సహాయపడగలదు.

కావలసిన పదార్ధాలు :

• 1/2 టీస్పూన్ పసుపు పొడి

• 2 టీస్పూన్ల పచ్చి పాలు

ఉపయోగించే విధానం :

• రెండు పదార్థాలను ఒక గిన్నెలోనికి తీసుకుని మిశ్రమంగా కలుపుకోవాలి.

• పై పెదవి ప్రాంతంలో ఈ మిశ్రమం యొక్క పొరను అప్లై చేయండి.

• అది ఆరిపోయే వరకు అలానే వదిలేయండి.

• ఆపై పొరను తొలగించి, గోరువెచ్చని నీటిని ఉపయోగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి.

• ఉత్తమ ఫలితాల కోసం ఈ రెమెడీని వారానికొకసారి పునరావృతం చేయండి.

4. శెనగ పిండి, తేనె :

శెనగపిండి చర్మానికి అత్యుత్తమ క్లెన్సర్ వలె పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. మృత చర్మాన్ని మరియు మలినాలను తొలగించడంలో మాత్రమే కాకుండా, పైపెదవి మీది అవాంఛిత రోమాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1/2 టీస్పూన్ శెనగపిండి

• 2 టీ స్పూన్ తేనె

ఉపయోగించే విధానం :

• రెండు పదార్థాలను ఒక గిన్నెలోనికి తీసుకుని మిశ్రమంగా కలుపుకోవాలి.

• పాప్సికిల్ స్టిక్ ఉపయోగించి, పై పెదవి ప్రాంతంలో ఈ మిశ్రమం పొరను వేయండి.

• 15 నుండి 20 నిమిషాలు ఆరనివ్వండి.

• జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో వేసిన పొరను, నెమ్మదిగా తొలగించి, గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.

• పొడి తువాలుతో ఆ ప్రాంతం నుండి తడిని తొలగించండి.

• ఉత్తమ ఫలితాల కోసం వారంలో రెండు సార్లు ఈ విధానాన్ని పునరావృతం చేయండి.

5. బంగాళాదుంప రసం, పసుపు రంగు కాయధాన్యాలు మరియు తేనె మిశ్రమం :

బంగాళాదుంప చర్మానికి అత్యుత్తమ బ్లీచింగ్ ఏజెంట్ వలె పనిచేస్తుంది. శెనగపప్పును, బంగాళాదుంప రసంతో కలపడం ద్వారా, ఆ మిశ్రమం జుట్టు కుదుళ్లను పొడిగా చేసి, పైపెదవి మీది అవాంచిత రోమాలను తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. దీనితో పాటుగా, బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అవి ఫ్రీ రాడికల్ నష్టం నుండి చర్మాన్ని కాపాడి, ఆరోగ్యకర చర్మానికి సహాయం చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ బంగాళదుంప రసం

• 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి(పసుపు రంగు కాయధాన్యాలు ఏవైనా

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్

ఉపయోగించే విధానం :

• బంగాళా దుంప తొక్కను తీసి, ముక్కలు చేసి, మిక్సీ వేసుకుని, పిండి రసాన్ని తీయండి.

• ఒక గిన్నెలో బంగాళా దుంప రసాన్ని తీసుకోండి.

• దీనికి శెనగపప్పు పొడిని జోడించి, మిశ్రమంగా కలపండి.

• ఇప్పుడు అందులో తేనె, నిమ్మరసం వేసి అన్ని పదార్థాలను మరలా కలపండి.

• ఈ మిశ్రమం పొరను మీ ముఖంపై అప్లై చేయండి.

• 15 నుండి 20 నిమిషాలపాటు ఆరనివ్వండి. ఆపై ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రపరచండి.

• ఉత్తమ ఫలితాలకోసం ఈ రెమెడీని వారంలో రెండుసార్లు పునరావృతం చేయండి.

6. ఎగ్ వైట్, కార్న్ ఫ్లోర్ మరియు పంచదార :

కార్న్ ఫ్లోర్, ఎగ్ వైట్ మరియు పంచదారను మిశ్రమంగా చేసినప్పుడు, మీకు మందపాటి మిశ్రమాన్ని అందిస్తుంది. ఇది పూర్తిగా ఆరిన తర్వాత, సులభంగా పైపెదాలపై చేరిన అవాంచిత రోమాలను తొలగించడంలో సహాయం చేయగలదు. కార్న్ ఫ్లోర్ చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదపడుతుంది. తద్వారా చర్మాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 ఎగ్ వైట్

• 1/2 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి

• 1 టేబుల్ స్పూన్ పంచదార

ఉపయోగించు విధానం :

• ఒక గిన్నెలో ఎగ్ వైట్ ను సేకరించండి.

• దీనికి కార్న్ ఫ్లోర్, పంచదార వేసి కలిపి అన్ని పదార్థాలను మిశ్రమంగా కలపాలి.

• పైపెదవి ప్రాంతంలో ఈ మిశ్రమం యొక్క పొరను కూడా అప్లై చేయండి.

• 15 నుండి 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి.

• జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో ఈపొరను తీసి., చల్లటి నీటిని ఉపయోగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి.

• ఉత్తమ ఫలితాలకోసం ఈ రెమెడీని వారంలో రెండు సార్లు రిపీట్ చేయాలి.

7. జెలటిన్, పాలు మరియు నిమ్మ మిశ్రమం :

కొల్లాజెన్ నుండి ఉత్పన్నమైన, జెలటిన్ చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. మరియు చర్మం నుండి మురికి మరియు మలినాలను తొలగించడానికి చర్మరంద్రాలను తెరవడంలో సహాయపడుతుంది. జెలటిన్, పాలు మరియు నిమ్మ ఒక మైనం వంటి నిలకడ రూపాన్ని ఇస్తాయి. అంతేకాకుండా జుట్టును సమర్థవంతంగా తీయడంలో సహాయం చేయగలుగుతుంది. జెలటిన్ ఉపయోగించేటప్పుడు వేగంగా అతుక్కునే సామర్ధ్యం ఉన్న కారణంగా, మీరు వెనువెంటనే అప్లై చేయవలసి ఉంటుంది. దీనితోపాటుగా, పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం, పై పెదవి ప్రాంతంలో పోషణను అందిస్తుంది మరియు ప్రకాశవంతంగా చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ జెలటిన్

• 1 1/2 టేబుల్ స్పూన్ పాలు

• 3 నుండి 4 చుక్కల నిమ్మరసం

ఉపయోగించే విధానం :

• ఒక గిన్నెలో జెలటిన్ తీసుకోవాలి.

• దీనికి పంచదార చేర్చి, బాగా కలియబెట్టి, ఈ మిశ్రమాన్ని మైక్రోవేవ్ లో సుమారు 20 సెకన్లపాటు ఉంచాలి.

• బౌల్ ను బయటకు తీసి, ఈ మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టి, నిమ్మరసాన్ని జోడించి, అన్నింటినీ బాగా కలిపి మిశ్రమంగా చేయండి.

• పాప్సికిల్ స్టిక్ ఉపయోగించి, పై పెదవి ప్రాంతంలో ఈ మిశ్రమం యొక్క పలుచని పొరను వేయండి.

• గట్టిపడేందుకు సమయం ఇవ్వకుండా వెనువెంటనే ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలని గుర్తుంచుకోండి.

• 5 నుండి 10 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• మీ జుట్టు పెరుగుదలకు వ్యతిరేకదిశలో నెమ్మదిగా పొరను తొలగించండి.

• పొరను తొలగించిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రపరచుకోండి.

• చివరిగా లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

• ఆశించిన ఫలితాలకోసం ఈ రెమెడీని నెలలో ఒకసారి పునరావృతం చేయండి..

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Threading, waxing and shaving are the common ways that we use to remove the upper lip hair. It is a painful task and we don't want to go through that pain every few days. Home remedies come to your rescue here. Ingredients like sugar, honey, lemon etc. can be whipped up together to remove upper lip hair effectively.