సాధారణంగా ఎవరికైనా స్వీట్, హాట్ తినాలనే కోరిక ఉంటుంది. ఇందులో భాగంగా చాక్లెట్స్, చిప్స్, జంక్ ఫుడ్ వంటి వాటిని అప్పుడప్పుడూ తీసుకోవడం కామన్. ఇలాంటి కోరికలు ఎవరికైనా సహజమే. కానీ ఎప్పుడూ వాటినే తినాలని అనిపిస్తే.. ఇది శరీరంలో కొన్ని లోపాలకు సంకేతమని పోషకాహార నిపుణులు అంటున్నారు.
శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాహార లోపం కొన్ని రకాల ఆహార పదార్థాలను విపరీతంగా తినాలనే కోరికను పెంచుతుంది. అయితే ప్రతి సారి పోషకాహార లోపం వల్ల మాత్రమే కాదు.. మరికొన్ని సందర్భాల్లో శారీరక, మానసిక స్థితిలో మార్పులు కూడా బయట ఫుడ్ ఎక్కువగా తినడానికి దారితీయవచ్చు. పదేపదే వాటిని తినాలే కోరిక ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటే.. దాని వెనుక నిర్ధిష్టమైన కారణాలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
తరచుగా స్వీట్ తినాలనే కోరిక
మీకు తరచుగా తీపి పదార్థాలు తినాలనే కోరిక కలిగితే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోవడం, నిద్ర లేమి, ఎనర్జీ లేకపోవడం, ఒత్తిడి వల్ల కలగొచ్చు. మెగ్నీషియం లోపం ఉన్న వారిలోనూ స్వీట్ లేదా చాక్లెట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఎక్కువగా ఉప్పు
మీకు తరచూ ఉప్పగా ఉండే స్నాక్స్ లేదా చిప్స్ తినాలని కోరికగా అనిపిస్తే అది శరీరంలో పలు మార్పులకు సంకేతం కావచ్చు. ఎక్కువగా చెమట పట్టడం, డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ సమతుల్యత వంటి కారణాలు దారితీయవచ్చు. పని ఒత్తిడి అనిపించినా ఎటూ తోచక స్నాక్స్ ఎక్కువగా లాగించేస్తుంటారు.
చాక్లెట్స్ మీరు తరచుగా మానసిక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, అలసట ఎదుర్కొంటున్నట్లయితే చాక్లెట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం లోపం కూడా కారణం కావచ్చు. ఐస్ క్రీమ్స్ మీకు ఎక్కువగా ఐస్ క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ తినాలని అనిపిస్తే అది ఐరన్ లోపానికి దారితీయవచ్చు. రక్త హీనత సమస్య ఉన్నవారిలో వీటిని తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. జంక్ ఫుడ్ నిద్రలేమి, ఒత్తిడి కారణంగా జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలనే కోరికలు కలుగుతాయి. ఈ కోరికలను ఎలా తగ్గించుకోవాలి. ఇలాంటి దీర్ఘకాలిక కోరికలు మున్ముందు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ కోరికలను తగ్గించుకుని మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజూ సరైన మోతాదులో పోషకాహారం తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. ప్రతిరోజూ 8 గంటల నిద్ర తప్పనిసరి. ఆహారంలో ప్రొటీన్, ఫైబర్ తప్పనిసరి. రెగ్యులర్‌గా వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. బయట చిరుతిళ్ల కోరికలు ఎక్కువ కాలం కొనసాగితో వైద్య నిపుణుడిని సంప్రదించడం మేలు.More Articles