పెళ్లయిన తర్వాత కొందరు దంపతులు త్వరగా ప్రెగ్నెన్సీ అందుకుంటారు. మరికొందరికి ఆలస్యం అవుతుంది. ఇందుకు చాలా కారణాలు ఉండొచ్చు. కొందరిలో ఆరోగ్యపరమైన సమస్యలు ఉండగా.. మరికొందరిలో తాము తెలిసీతెలియక చేసే పొరపాట్ల కారణంగా త్వరగా గర్భం దాల్చలేరు. ఈ క్రమంలో త్వరగా ప్రెగ్నెన్సీ రావాలని ప్రయత్నించే భార్యాభర్తలు ఈ ఐదు పనులు తప్పక చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

ఉరుకులు పరుగుల జీవితంలో కొందరు పెళ్లయిన తర్వాత పిల్లలు కనాలనే ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ఇందుకోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మరికొందరు పెళ్లయిన వెంటనే సంతానం కోసం ప్రయత్నిస్తుంటారు. కొందరిలో పలు ఆరోగ్య సమస్యల కారణంగా సంతాన ప్రక్రియ ఆలస్యమవుతోంది. అయితే దంపతుల్లో ఏ సమస్యలు లేకున్నా సరైన పద్ధతులు పాటించకపోవడంతో సహజంగా గర్భం దాల్చలేకపోతున్నారు. ఈ మేరకు ఈ సలహాలు పాటించినట్లయితే మీరు సంతానం కోసం చికిత్స తీసుకుంటున్నా.. సహజంగా గర్భం కోసం ప్రయత్నిస్తున్నా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

Advertisement

భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.!

అండోత్సర్గ సమయం

సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తప్పనిసరిగా అండం విడుదలయ్యే సమయం తెలుసుకోవాలి. అండం విడుదలకి రెండు రోజుల ముందు, రెండు రోజల తర్వాత దంపతులు శారీరకంగా కలవడం ద్వారా ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండోత్సర్గం సమయం తెలుసుకునేందుకు ఫార్మసీలో కిట్స్‌, ఇంకా స్కానింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

టైమింగ్స్

అండం విడుదల సమయంలో రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య లేదా తెల్లవారుజామున 5 గంటల సమయం ఆ తర్వాత కలిస్తే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. ఆ సమయంలో హార్మోన్లు యాక్టివ్‌గా ఉండే ఛాన్స్‌ ఉన్న కారణంగా అండం, వీర్య కణాలు చురుగ్గా కదులుతాయి.

Advertisement

సరైన నిద్ర

ప్రెగ్నెన్సీకి అవసరమైన ఈస్ట్రోజిన్‌, ప్రొజెస్టిరాన్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్స్‌ పనితీరు చురుగ్గా ఉండేందుకు సరైన నిద్ర అవసరం. రోజూ 7 నుంచి 8 గంటలు భార్యాభర్తలు తప్పనిసరిగా రెగ్యులర్‌గా ఒకే టైంలో ఉండేలా చూసుకోవాలి. నిద్ర లేమితో మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పెరుగుతుంది.

ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.!

సరైన బరువు

సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు తప్పనిసరిగా వారి శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా అది హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యకరమైన బరువు పాటించేవారికి ప్రెగ్నెన్సీ అవకాశాలు 30 శాతం ఎక్కువగా ఉంటాయి.

Advertisement

పోషకాహారం

ఆరోగ్యకరమైన అండం, వీర్యకణాల విడుదల కోసం భార్యాభర్తలు తప్పనిసరిగా పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పప్పులు, పాలకూర, మెంతికూర, క్యారెట్‌, టమాటా, బీట్‌రూట్‌, బాదం, వాల్‌నట్స్‌ వంటి ఫెర్టిలిటీ ఫుడ్స్‌ తీసుకోవడం వారి సంతాన అవకాశాలను మెరుగుపరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.