ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి లైంగిక కోరికలు తగ్గిపోతున్నాయి. దీంతో దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నారు. ఒకప్పటి రోజుల్లో 50, 60 ఏళ్లు దాటినా వారిలో సంతాన సామర్థ్యం, లైంగిక కోరికలు ఎక్కువగా ఉండేవి. లేటు ఏజ్‌లోనూ పిల్లల్ని కనేవారు. కానీ నేటి కాలంలో 30 లోపే ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. కొందరిలో 35 ఏళ్లకే లైంగిక వాంఛలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా కొన్ని సలహాలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడి, నిద్రలేమి, ఆరోగ్య, ఆహార అలవాట్లు ఇలా చాలా కారణాల వల్ల ఆడా, మగా తేడా లేకుండా లైంగిక శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో భార్యాభర్తలు తమకున్న ప్రైవసీ సమయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నారు. మున్ముందు ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ ఐదు టిప్స్‌ పాటించడం మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు

ఆహారం

లైంగిక సామర్థ్యం పెరగడం కోసం కొందరు మందులు, చూర్ణాలను ఆశ్రయిస్తుంటారు. కానీ వీటి ద్వారా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సహజంగా శక్తిని ఎనర్జీని, లైంగిక శక్తిని పెంచే దానిమ్మ, బాదం, డార్క్‌ చాక్లెట్‌, అరటిపండు, గుమ్మడిగింజలు వంటి వాటిని తీసుకోవాలి.

వ్యాయామం

రోజూ కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్‌, యోగా, ధ్యానం చేయడం ద్వారా శరీరంలో పునరుత్పత్తి భాగాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో స్టామినా పెరుగుతుంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనగలరు.

సరైన నిద్ర

రోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర మీ శరీరాన్ని రిపేర్‌ చేస్తుంది. హార్మోన్లు బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది. ఎనర్జీని అందిస్తుంది. మూడ్‌ ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. అదేవిధంగా మొబైల్‌ స్క్రీన్‌ సమయాన్ని దాదాపుగా తగ్గించుకోవాలి.

భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.!

హైడ్రేషన్‌

ప్రతి రోజూ 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. పుష్కలంగా నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ రాకుండా కాపాడుతుంది. దీంతో అలసట తగ్గి హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.

ఈ టెస్టులు తప్పనిసరి

లైంగిక సామర్థ్యం మెరుగ్గా ఉండేందుకు శరీరంలో విటమిన్‌ బి12, డి, జింక్‌ తప్పనిసరిగా సమతుల్యంగా ఉండాలి. మీలో లైంగిక సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వీటి లోపం ఉందో లేదో చెక్‌ చేయించుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకోవడం మేలు చేస్తుంది. ఈ పోషకాహారం లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవనశైలి పాటిస్తూ 40 ఏళ్లు దాటినా లైంగిక సామర్థ్యం పరంగా పటిష్ఠంగా ఉండగలరు.