కళ్లకి కాటుక పెట్టుకోవడం అతివల అందాన్ని మరింత పెంచుతుంది. మేకప్‌ ఉన్నా లేకపోయినా కాటుక ఇచ్చే స్పెషల్‌ లుక్‌ వేరు. అయితే కాటుక పెట్టుకోవడం కళ్లకి సురక్షితమేనా అంటే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కనురెప్పల వాపు, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కళ్లను రక్షించుకుంటూ కాటుక ఎలా పెట్టుకోవాలో బ్యూటీ నిపుణుల సలహాలు చూద్దాం..

Advertisement

మేకప్‌లో భాగంగా కళ్లకి కాటుక పెట్టుకోవడం చాలా ప్రత్యేకం. కాటుకతో అందమైన లుక్‌ కోసం మార్కెట్‌లో చాలా రకాల ప్రొడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక మేకప్‌ కోసమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా చాలా మంది మహిళలకు కాటుక పెట్టుకోవడం అలవాటు. అయితే రోజంతా కళ్లకి కాటుకతో ఉన్నప్పుడు రాత్రిపూట అలాగే కాటును తొలగించకుండా నిద్రపోతారు. దీని వల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్‌.. మీకూ ఇలా ఉందా.?

కాటుక ఎలా పెట్టుకోకూడదు

కనురెప్పల అంచున మీబోనియన్‌ గ్రంథులు అనేవి ఉంటాయి. ఇవి సహజ నూనెను ఉత్పత్తి చేస్తాయి. కళ్లలో తేమను నిలుపుతాయి. కన్నీళ్లు త్వరగా ఎండిపోకుండా నివారిస్తాయి. ఈ క్రమంలో కనురెప్పల అంచున కాటుక పెట్టడం ద్వారా ఇందులోని రేణువులు, నూనె.. గ్రంథుల చుట్టూ పేరుకుపోయి నూనె ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా కనురెప్పలపై ఎర్రటి గడ్డ లేదా స్టై ఏర్పడవచ్చు. దీనివల్ల నొప్పి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్‌ లేకపోయినా, వాపుతో కూడిన గడ్డలు ఏర్పడతాయి. ఈ పరిస్థితి తీవ్రమైనప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది.

Advertisement

కాటుక ఎలా పెట్టుకోవాలి

ఈ పరిస్థితి రాకుండా మీ అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకునే పనిలో భాగంగా కళ్లకు కాటుక పెట్టుకునేటప్పుడు కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. కనురెప్పల అంచున కాటుక పెట్టుకోకండి. అదేవిధంగా రాత్రంతా కాటుక పెట్టుకుని నిద్రపోకండి.. నిద్రపోయేటప్పుడు కళ్లకి కాటుక తొలగించడం ఉత్తమం.

ఒకసారి స్టెంట్‌ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.!

ఈ తప్పులు వద్దు

మీరు కళ్లకి పెట్టుకునే కాటుకను, మీ మేకప్‌ సామగ్రిని ఇతరులతో అసలు పంచుకోకండి. ఇతరులతో షేర్‌ చేసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యకరంగా కనురెప్పల అంచుకు పెడుతూనే కొంచెం బయటగా కాటుకను పొరలా అప్లై చేయడం ద్వారా ఎలాంటి హాని జరగదు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ కళ్లలో గడ్డలా అనిపించినా, నిరంతరం కంటి నొప్పి పదే పదే కంటి కురుపులు ఏర్పడితే సొంత చిట్కాలు, చికిత్స తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.