ఊపిరితిత్తుల క్యాన్సర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వయసు పైబడిన వారు లేదా సిగరెట్లు గుప్పుగుప్పున తాగేవాళ్లు. కానీ ఇప్పుడు నలభై ఏళ్ల లోపు ఉన్న యువతీయువకులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడుతున్న రోగులలో చాలామంది తమ జీవితంలో ఎప్పుడూ ఒక్కసారి కూడా సిగరెట్ ముట్టని వారే ఎక్కువగా ఉంటున్నారట.

Advertisement

అతిపెద్ద ముప్పు.. రోగ నిర్ధారణలో జాప్యమే

Advertisement

యువతలో ఈ వ్యాధి పట్ల ఉన్న అతిపెద్ద ప్రమాదం నిర్లక్ష్యం, అపోహ. యువకులు వారం వారం దగ్గుతో బాధపడుతున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, లేదా ఛాతీ నొప్పితో సతమతమవుతున్నా.. దానిని సాధారణ సమస్యగా కొట్టిపారేస్తారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చిన అలర్జీ అనో, ఆస్తమా అనో లేదా వైరల్ ఫీవర్ అనో తమకు తాము సర్దిచెప్పుకుంటారు. ఈ ఆలస్యం వల్ల క్యాన్సర్ లోపల సైలెంట్ గా శరీరమంతా ముదిరిపోతుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వాల్సిందే

మూడు వారాలకు మించి ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్న దగ్గు.

Advertisement

దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం పడటం లేదా నోటి ద్వారా రక్తస్రావం.

ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా శరీర బరువు తగ్గిపోవడం.

తగినంత నిద్ర, విశ్రాంతి ఉన్నప్పటికీ విపరీతమైన అలసట, నీరసం ఆవహించడం.

ఛాతీలో ఏదో బరువు పెట్టినట్లు, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించడం.

మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం!

స్మోక్ చేయకపోయినా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కు సిగరెట్ తాగడం అనేది ఒక ప్రధాన కారణమే కానీ అదొక్కటే కారణం కాదు. ఇతరులు వదిలే సిగరెట్ పొగను పీల్చడం, కలుషిత గాలిని పీల్చడం లాంటివి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అంతేకాకుండా పని ప్రదేశాల్లో రసాయనాలు, హానికరమైన దుమ్ము, ధూళికి గురికావడం కూడా ముప్పును పెంచుతుంది.

Advertisement

వీటికి తోడు జన్యుపరమైన మార్పులు, కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉండటం కూడా యువతలో ఈ క్యాన్సర్‌ కు దారితీస్తున్నాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు ఖచ్చితమైన ట్రీట్మెంట్ కోసం మాలిక్యులర్ టెస్టింగ్ తప్పనిసరి అవుతోంది. దీని ద్వారా రోగికి సరిపోయే టార్గెటెడ్ ట్రీట్మెంట్ అందించి మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

ఆరోగ్యంగా ఉన్నామని నిర్లక్ష్యం వద్దు..

నేను రోజూ ఎక్సర్ సైజ్ చేస్తాను, మంచి పౌష్టికాహారం తీసుకుంటాను, కాబట్టి నాకు క్యాన్సర్ రాదు అనుకోవడం పొరపాటే. మంచి జీవనశైలితో ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోగలం కానీ వంద శాతం ముప్పును తప్పించుకోలేము. కాబట్టి శ్వాసకోశ సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే వయసును సాకుగా చూపి డాక్టర్‌ ను సంప్రదించడం మానకండి.

Advertisement