ఈ రోజుల్లో చిన్నారుల నుంచి 40 ఏళ్లు దాటిన మహిళల వరకూ ఎక్కువగా అరికాళ్ల నొప్పుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో కాసేపు కూడా స్థిమితంగా నడవలేకపోతున్నారు. ఎక్కువ సేపు నిలబడి పనిచేయలేకపోతున్నారు. ఈ ప్రభావం మోకాళ్లపై పడి నొప్పి మరింత తీవ్రంగా ఉంటోంది. అయితే ఇందుకు మనం ఇంట్లో చేసే ఒక చిన్న పొరపాటే కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆధునికత పెరుగుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన జీవనశైలి మారుతోంది. ఈ క్రమంలో మంచి ఎంత జరుగుతుందో, ఆరోగ్యంపై దుష్ప్రభావం కూడా అంతే ఉంటుంది. దీంతో రోగాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా మన రోజువారీ అలవాట్లు మారడం, ఆధునిక పోకడలు.. శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులకు కారణమవుతున్నాయి.
ఒకప్పటి కాలంలో ఇళ్లలో ఫ్లోరింగ్ ఎక్కువగా మట్టితో లేదా గరుకైన నాపరాతి బండలతో చేసేవారు. ఎగుడుదిగుడుగా ఉండే ఈ నేలపై నడవడం ద్వారా పాదాల నుంచి శరీరం పై భాగాల వరకూ రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేది. దీంతో మన శరీర బరువు మొత్తం నేలపైనే పడటంతో కాళ్ల నొప్పులు లాంటి సమస్యలు ఉండేవి కావు.
ఇళ్లలో ఆధునికత
కానీ ఈ రోజుల్లో ఇళ్లలో మట్టి నేలలు, గరుకు బండలు మచ్చుకైనా కనిపించడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆధునికంగా ఇంటి గేటు నుంచి లోపలి వరకూ మార్బుల్, పాల రాతి బండలు, గ్రానైట్, ఖరీదైన ఫ్లోరింగ్ చేయించుకుంటున్నారు. వీటితో ఇంటికి అద్భుతమైన లుక్ వస్తుంది. కానీ ఈ బండలు నున్నగా ఉన్న కారణంగా వీటిపైన నడుస్తున్నప్పుడు శరీరం బరువు మొత్తం పాదాలపైనే పడటం ద్వారా అరికాళ్ల నొప్పులు కలుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఫలితంగా మోకాళ్లపై భారం పడి నొప్పులు ఎక్కువవుతున్నాయి.
పరిష్కారమేంటి
అయితే ఇందుకు పరిష్కారంగా ఈ కాలంలో ఇళ్లలో నడిచేటప్పుడు తప్పనిసరిగా అనువైన చెప్పులు ధరించాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. చెప్పులు వేసుకుని నడవడం ద్వారా కాళ్లలో రక్త ప్రసరణ మెరుగై పాదాలపై భారం పడకుండా కాపాడుతుంది. అందుకే తప్పనిసరిగా ఇంట్లో వేసుకోవడానికి ప్రత్యేకంగా చెప్పులు ఏర్పాటు చేసుకోవాలి.
మహిళల్లో ఈ సందేహాలు
కాగా, ఇంట్లో పూజ గది ఉన్నప్పుడు చెప్పులు ఎలా ధరిస్తామనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ ఆరోగ్యం కోసం ఇలాంటి మంచి అలవాట్లు చేసుకోవడం తప్పేమీ కాదని.. పూజ గదిలో పని సమయంలో మాత్రం చెప్పులు లేకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
More Articles
- Amazon Sale 2021 : అమెజాన్లో ఫ్యాన్సీ ఫుట్ వేర్ పై 70% వరకు డిస్కౌంట్స్..
- వర్షాకాలంలో ఎలాంటి పాదరక్షలను ఎంచుకోవాలంటే...
- Vastu For Footwear: చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారా? అక్కడ పెట్టారంటే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశం!
- ఇంట్లో చెప్పులు వేసుకోవచ్చా?,శాస్త్రవేత్తలు పండితులు ఏం చెప్పారంటే?
- Vastu Tips: ఆ దిక్కుల్లో చెప్పులు పెడితే ప్రాణగండం..!
- పాదరక్షలు పాతబడ్డాయా.. కొత్తవి కొనటం ఎందుకు..