చేపలు తింటే ఆరోగ్యానికి 10 అద్భుత లాభాలు


సీఫుడ్ అంటే మీకు అభిమానమా ? ఒకవేళ అవును అయితే, మీకొక శుభవార్త. చేపల రుచులను ఆస్వాదించడం మాత్రమే కాకుండా, మీరు వాటిని ఎక్కువగా వినియోగించడానికి గల ఆరోగ్య కారణాలను కూడా అధికంగా కలిగి ఉన్నారు!

Advertisement

శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఆరోగ్యవంతమైన ఆహారాల్లో చేపలు కూడా ఒకటి. ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన మరియు ఆవశ్యక పోషకాలతో లోడ్ చేయబడి ఉండడమే కాకుండా, ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలకు కూడా గొప్ప వనరుగా చేపలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అత్యావశ్యక పోషకాల యొక్క అత్యుత్తమ వనరుల్లో చేపలు కూడా ఒకటి. ఇవి మీ శరీరంలోని కొవ్వునిక్షేపాలను అదుపులో ఉంచడమే కాకుండా శరీరంలోని జీవక్రియలు మరియు ఆలోచనా శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. క్రమంగా శరీర నిర్మాణంలో కీలకపాత్ర పోషించగలదని చెప్పబడుతుంది.

Advertisement

భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రాచీనకాలం నుండి కూడా ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారం సముద్ర పరీవాహక ప్రాంతాలలో ( తీర ప్రాంతాలలో) నివసించే ప్రజలు అత్యంత తెలివైన వారిగా ఉంటారని, మెరుగైన ఆరోగ్యం మరియు గొప్ప చర్మపు రంగును కలిగి ఉంటారని ప్రధానంగా చెప్పబడుతుంది. ఎందుకంటే, వారి ప్రధానమైన ఆహారంగా చేపలు ఉండడమేనని పేర్కొనడం జరిగుతుంది కాబట్టి. ఆ నమ్మకం ఒక అపోహగా భావించినా, అనేక శాస్త్రీయ పరిశోధనల అధ్యయనాలు కూడా చేపలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిరూపించాయి.

రోజూ మీ ఆహార ప్రణాళికలో చేపలను చేర్చడం మూలంగా, పొందగలిగే 10 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాల గురించిన మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

చేపలు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

చేపలను క్రమంతప్పకుండా తీసుకోవడం మూలంగా మీ నడుము నాజూకుగా, మంచి ఆకృతిని పొందడమే కాకుండా, కాలేయం, మెదడు మొదలైన ఇతర అవయవాల పనితీరు మెరుగుపరచడంతో సహా అనేక ఇతరత్రా శారీరిక విధులలో కూడా సహాయపడగలదు. మరియు మీరు ప్రశాంతమైన నిద్రను పొందడంలో సహకరిస్తుంది. క్రమం తప్పకుండా, తరచుగా చేపలను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులకు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

1. అల్జీమర్స్ వ్యాధి రాకుండా …

2016 లో జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఒక క్రమప్రాతిపదికన చేపలను తీసుకోవడం, మానవ మెదడులోని "గ్రే మాటర్" మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మెదడు కణాల క్షీణతను నిరోధిస్తుంది మరియు వృద్ధాప్యం సమయంలో మెదడు విధులను నిర్వహించడంలో సహాయపడుతుంది. క్రమంగా అల్జీమర్స్ వ్యాధి రాకుండా, అరికట్టగలుగుతుంది.

2. గుండె జబ్బులను తగ్గిస్తుంది :

అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఒక క్రమ ప్రాతిపదికన చేపలను తరచుగా తీసుకోవడం మూలంగా గుండె వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పబడుతుంది. చేపల్లో కనిపించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచగలవని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించి, క్రమంగా రక్తపోటును కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లుగా చెప్పబడుతుంది.

3. డిప్రెషన్ సమస్యను తగ్గించడంలో..

తరచుగా చేపలను తీసుకోవడం మూలంగా, మెదడులోని సెరోటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరగడంకి సహాయపడగలదు. ఇది డిప్రెషన్ సంబంధించిన లక్షణాల చికిత్సలో ఉత్తమంగా సహాయపడుతుంది. డోపమైన్ మరియు సెరటోనిన్ హార్మోన్లను హ్యాపీహార్మోన్లుగా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉనికి కూడా ఈ ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది.

4. కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :

చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అంతేకాకుండా కళ్ళ కండరాలకు, నరాలకు పోషణను అందివ్వడంలో సహాయం చేస్తాయి. చేపలను తరచుగా తీసుకోవడం మూలంగా, మీ దృష్టిని మెరుగుపరచడానికి మరియు దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

5. ఆర్థరైటిస్ను నివారిస్తుంది :

ముందు చెప్పినట్లుగా చేపలలో, మీ శరీరానికి వివిధ రకాలుగా సహాయపడగలిగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో ఇది గణనీయమైన పాత్రను పోషిస్తుంది. చేపల్లో విటమిన్ ఇ ఉండటం కూడా ఇందుకు మరొక కారణంగా చెప్పబడుతుంది.

6. క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది :

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, రోజువారీగా మీ ఆహారంలో చేపలను జోడించడం ద్వారా, పెద్దపేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మొదలైన అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చేపలలో కేన్సర్ కారక కణాల అసాధారణ పెరుగుదలను నిరోధించగలవని చెప్పబడుతుంది.

7. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది :

చేపలను తరచుగా సేవించడం మూలంగా మీ నిద్ర నాణ్యత మెరుగుపడగలదని చెప్పబడుతుంది. చేపల వినియోగం పెంచడంద్వారా, అనేకమంది మెరుగైన నిద్ర నాణ్యతను సాధించారనే వాదనకు ఊతమిచ్చేలా, అనేక అధ్యయనాలు ఫలితాలను ఇచ్చాయి కూడా. ఇది అధిక గాఢత కలిగిన విటమిన్ డి నిక్షేపాల మూలంగా సాధ్యపడుతుందని చెప్పబడింది.

8. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

శరీరంలోని LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను అధికంగా కలిగి ఉన్న వనరుగా చేపలు ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మరియు శరీరంలో తిరిగి కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పబడుతుంది.

9. ఆటో ఇమ్యూన్ (రోగనిరోధక శక్తి సంబంధిత) వ్యాధులను నివారిస్తుంది :

వివిధ అధ్యయనాల ప్రకారం, తరచుగా మీ ఆహార ప్రణాళికలో మంచి కొవ్వులు కలిగిన చేపలను తీసుకోవడం మూలంగా, టైప్ 1 మధుమేహం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నిరోధించడంలో సహాయపడగలదని చెప్పబడింది. చేపలలో కనిపించే విటమిన్ డి యొక్క అధిక నిక్షేపాలు, శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో, మరియు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో సహకరించగలవని చెప్పబడుతుంది.

10. ముందస్తు బహిష్టు సమస్యలను తగ్గిస్తుంది :

బహిష్టులో వచ్చే అసమతుల్యతలతో బాధపడే మహిళలు, తమ ఆహారంలో చేపలను తరచుగా చేర్చుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న కారణంగా, ఇది సాధ్యపడుతుందని చెప్పబడుతుంది.

చేపలతో కూడిన ఆరోగ్యకర రెసిపీలు :

1. కాల్చిన బీట్ రూట్ మరియు పాలకూరతో సాల్మన్

కావలసిన పదార్ధాలు :

• 4 చిన్న తాజా బీట్రూట్స్, సుమారు 200g

• 1 స్పూన్ ధనియాలు, (సున్నితంగా నలగ్గొట్టి ఉంచండి)

• 2 స్కిన్ లెస్ సాల్మన్

• 2 1/2 నారింజపండ్లు, (1 నారింజ పండు జెస్ట్ మరియు సగం జ్యూస్)

• 3 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు

• 1 వెల్లుల్లి రెబ్బలు

• 1 ఎర్ర ఉల్లిపాయ (సన్నగా తరిగినవి)

• 4 గుప్పెళ్ళు బేబీ స్పినాచ్(పాలకూర) ఆకులు

• 1 అవకాడో, (మందపాటి ముక్కలుగా చేసి ఉంచండి)

• 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

తయారుచేసే విధానం :

ఓవెన్ ని 180 డిగ్రీల వరకు వేడి చేయండి. బీట్రూట్ ని 1/4 ముక్కలుగా కట్ చేయండి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ మరియు ధనియాలను జోడించి వేయించండి. కొన్ని అదనపు దినుసులను జోడించి, ఒక పెద్ద షీట్ ఫాయిల్లో ఉంచి పార్సిల్ వలె చుట్టండి. 45 నిమిషాలపాటు ఓవెన్లో బేక్ చేయండి. అందులో సాల్మన్, ఆరెంజ్ జెస్ట్ (నారింజతొక్క పైరేకుని పీల్ చేసి తీసిన పదార్ధం) వేసి వేడి చేసి 15 నిమిషాలపాటు ఓవెన్లో ఉంచండి. వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి, 10 నిమిషాలపాటు పక్కన ఉంచండి. ఈ వెల్లుల్లిని ఆరెంజ్ జ్యూస్, మరియు మిగిలిన నూనెను సీజనింగ్ కి జోడించి,డ్రెస్సింగ్ గా తయారుచేసుకోవాలి. ఓవెన్ నుంచి ఫాయిల్ తీసుకుని, చేపలను పక్కన పెట్టాలి, బీట్ రూట్ను ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఎర్ర ఉల్లిపాయ, మిగిలిన ఆరెంజ్ జెస్ట్, గుమ్మడి గింజలు, పాలకూర ఆకులు వేసి, బాగా వేయించి తరువాత చేపలతో కలపండి.

అతిగా చేపలను తీసుకోవడం మూలంగా కలిగే దుష్ప్రభావాలు :

కింగ్ మాకెరెల్, షార్క్, మరియు స్వోర్డ్ ఫిష్ వంటి కొన్ని చేపలు అధికంగా మెర్క్యురీ నిక్షేపాలను కలిగి ఉంటాయి. ఇవి నేరుగా, గర్భస్థ పిండం లేదా, పసిపిల్లల ఆరోగ్యం మీద, అది కూడా ప్రధానంగా నాడీ వ్యవస్థకు హాని కలిగించేఅవకాశాలు ఉన్నట్లుగా చెప్పబడుతుంది. కావున, గర్భిణులు పెద్ద పరిమాణాలలో చేపలను తరచుగా తీసుకోరాదని సూచించబడుతుంది. డయోక్సిన్స్ మరియు PCBల వంటి కలుషితాలు కాన్సర్ మరియు పునరుత్పత్తి సమస్యలతో కూడా ముడిపడి ఉన్నాయని అనేక అధ్యయనాలలో తేలింది కూడా.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Fish is one of the healthiest foods that have potential health benefits. Loaded with important and essential nutrients such as protein, vitamin D, calcium, phosphorous, it is a great source of minerals such as iron, zinc, iodine, magnesium and potassium. Fish is also one of the best sources of essential nutrients like omega-3 fatty acids.