అవొకాడోలో 10 దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు


అవకాడోలు ఈమద్యకాలంలో త్వరితగతిన అందరికీ సుపరిచితమైన పండుగా ఉంది. ఇది ఇంచుమించు ప్రతి రెస్టారెంట్ మెనూలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ అవకాడో, ఒక వైవిధ్యభరితమైన పండుగానే కాకుండా, వీటిని సలాడ్స్, స్మూతీస్, డోనట్స్, మరియు శాండ్ విచ్ వంటి అనేక రకాల ఆహార పదార్ధాలతో కూడా కలిపి తీసుకోవచ్చు.

Advertisement

అవకాడోను బటర్ ఫ్రూట్ లేదా అలిగేటర్ పియర్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరియు ఆరోగ్యకరమైన HDL కొవ్వు నిక్షేపాలు అధికంగా ఉండే ప్రత్యేక రకానికి చెందిన పండుగా ప్రసిద్ధి చెందింది. ఈ పండులో పొటాషియం, ల్యూటేన్, మరియు ఫోలేట్ వంటి వాటితో సహా దాదాపు 20 రకాల విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది.

Advertisement

అవకాడోలు బి విటమిన్స్ కు మంచి మూలంగా చెప్పబడుతుంది, క్రమంగా ఇది శరీరంలోని వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

అవకాడోలోని పోషక విలువలు :

100 గ్రాముల అవకాడోలలో 72.33 గ్రాముల నీరు మరియు 167 కిలోకాలరీల ఎనర్జీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా కింద పొందుపరచబడిన ఖనిజాలు, మరియు పోషకాలతో కూడుకుని సమృద్దిగా ఉంటుంది.

అవి వరుసగా ...

• 1.96 గ్రాముల ప్రోటీన్

• 15.41 గ్రాముల కొవ్వు

• 8.64 గ్రాముల కార్బోహైడ్రేట్స్

• 6.8 గ్రాముల పీచు

• 0.30 గ్రాముల పంచదార

• 13 మిల్లీ గ్రాముల కాల్షియం

• 0.61 మిల్లీగ్రాముల ఇనుము

• 29 మిల్లీగ్రాముల మెగ్నీషియం

• 54 మిల్లీ గ్రాముల భాస్వరం

• 507 మిల్లీ గ్రాముల పొటాషియం

• 8 మిల్లీ గ్రాముల సోడియం

• 0.68 మిల్లీ గ్రాముల జింక్

• 8.8 మిల్లీ గ్రాముల విటమిన్ C

• 0.075 మిల్లీ గ్రాముల థియామిన్

• 0.143 మిల్లీ గ్రాముల రైబోఫ్లేవిన్

• 1.912 మిల్లీ గ్రాముల నియాసిన్

• 0.287 మిల్లీ గ్రాముల విటమిన్ B6

• 89 మైక్రో గ్రాముల ఫోలేట్

• 147 IU (ఇంటర్నేషనల్ యూనిట్స్) విటమిన్ ఎ

• 1.97 మిల్లీ గ్రాముల విటమిన్ E

• 21 మిల్లీ గ్రాముల విటమిన్ కె

అవకాడో రకాలు :

1. హాస్ అవకాడో

2. మలుమ అవకాడోలు

3. ఫ్యూర్టె అవకాడో

4. బేకాన్ అవకాడో

5. వుర్ట్జ్ అవెకాడో

6. షర్విల్ అవెకాడో

7. పింకర్టాన్ అవకాడో

అవకాడోలోని ఆరోగ్య ప్రయోజనాలు :

1. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది ...

అవకాడోలు అత్యధికంగా ఫైబర్తో లోడ్ చేయబడి ఉంటాయి, క్రమంగా ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. మరియు ఊబకాయంతో సంబంధం ఉన్న అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవకాడోలో "కరిగే మరియు కరగని" ఫైబర్లు రెండూ ఉంటాయి. క్రమంగా 25% కరిగే ఫైబర్ ఉండగా, మరియు 75% కరగని ఫైబర్ ఉంటుంది.

2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

అవకాడోలు ఆరోగ్యవంతమైన మోనోశాచ్యురేటెడ్ కొవ్వులతో ప్యాక్ చేయబడ్డ అత్యుత్తమ పండ్లలో ఒకటిగా ఉంటుంది., అంతేకాకుండా, ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అవకాడోలను తరచుగా తీసుకోవడం మూలంగా, రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను 20% వరకు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను 22% వరకు తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను 11% వరకు పెంచవచ్చునని అధ్యయనాలు చూపిస్తున్నాయి.

3. రక్తంలో చక్కర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది :

అవకాడోలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెంట్స్, డయాబెటిక్ పేషంట్స్ లో రక్తంలో చక్కర స్థాయిలను మెరుగుపరిచే మోనోసాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దం చేయడానికి మరియు ఇన్సులిన్ స్థాయిలని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, అవకాడోలలో ఉండే ఫైబర్ నిక్షేపాలు రక్తంలో చక్కర నిల్వలు పెరగకుండా చూడడంలో సహాయం చేస్తాయి.

4. కళ్ళను కాపాడుతుంది :

అవకాడోలలో ల్యూటేన్ మరియు జియాక్సాంథిన్ వంటి కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి శుక్లాలు, మరియు కళ్ళలో మచ్చల వంటి కంటి రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించగలవు. అవకాడోలలో విటమిన్ ఎ అధిక మొత్తాలలో ఉన్న కారణంగా, వృద్దాప్యం కారణంగా తలెత్తే కంటి మచ్చల అవకాశాలను తగ్గించడంలో కూడా సహాయపడగలదని చెప్పబడుతుంది.

5. క్యాన్సర్ సమస్యను నిరోధిస్తుంది :

అవకాడోలు క్యాన్సర్ చికిత్సలో కూడా ముఖ్యపాత్రను పోషిస్తాయి. మానవుల లింఫోసైట్స్లో, కీమోథెరపీ మూలంగా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. అవకాడో సారం ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని మరొక అధ్యయనంలో తేలింది.

6. సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది :

అవకాడోలలో మంచి మొత్తాలలో ఫోలేట్ ఉంటుంది. ఇది గర్భస్రావం మరియు నాడీ లోపాల ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఖనిజంగా ఉంటుంది. దీనికి అదనంగా మీ శిశువు, పాల నుంచి ఘనాహారానికి తరలించినా, అవకాడో వంటి రుచికరమైన ఆహారాలను మీ బిడ్డకు అందజేయడానికి ప్రయత్నించండి. ఇవి మృదువుగా ఉన్న కారణంగా, మీ బిడ్డ ఆహారాన్ని నమలడాన్ని సులభతరం చేస్తుంది. మీరు వివిధ రకాల రెసిపీలలో, వాటిని గుజ్జుగా చేసి, అందులోని పోషక ప్రయోజనాలను పొందవచ్చు.

7. మేధోపరమైన పనితీరును మెరుగుపరుస్తుంది :

అవకాడోలు మోనోశాచ్యురేటెడ్ కొవ్వులకు మంచి వనరుగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, అధికంగా మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు కలిగిన ఆహారాలు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతలను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయని చెప్పబడుతుంది. ఈ పండులో ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది వ్యాకులతను కూడా తగ్గిస్తుంది.

8. ఆస్టియో ఆర్థరైటిస్ను నివారిస్తుంది :

అవకాడోలోని నూనెలు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను తగ్గించవచ్చునని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. సాపోనిన్లు అవశేషాలు, అవకాడో మరియు ఇతర వృక్ష సంబంధ ఆహారపదార్ధాలలో కనుగొనబడ్డాయి. ఇవి మోకాళ్ళ మీద ప్రభావం చూపే, ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

9. జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :

అవకాడోలలో ఫైబర్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న కారణంగా, ఇది జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, ప్రేగు ప్రకోప సిండ్రోమ్ వంటి అన్ని జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అవకాడోలలో కూడా యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. క్రమంగా బ్యాక్టీరియా, ఎస్చెరిచియా కోలి వంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

10. వృద్దాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది :

అవకాడో మీ చర్మానికి అత్యధిక మేలును కలుగజేస్తుందని చెప్పబడుతుంది. మరియు వీటిలో మంచి మొత్తాలలో విటమిన్స్, మినరల్స్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల నిక్షేపాలు కలిగి ఉంటాయి. ఈ పోషకాలు మీ చర్మాన్ని లోపలి నుండి రిపేర్ చేస్తూ, ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ముడుతలు, చారలను కూడా నివారిస్తుంది.

అవకాడోలను మీ ఆహారప్రణాళికలో చేర్చుకోవడానికి గల మార్గాలు :

అవకాడోలను బేకింగ్ కేక్స్, మఫిన్స్ మొదలైనవాటిలో ఈ అవకాడో వినియోగం ఉంటుంది. అంతేకాకుండా, స్మూతీస్, డెజర్ట్స్, పుడ్డింగ్, సలాడ్స్, శాండ్ విచ్, సూప్స్ మరియు బోన్ బ్రోత్స్లో కూడా దీనిని వినియోగించవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Avocados are also known as butter fruit or alligator pear. It is considered a unique type of fruit which is high in healthy fats. The fruit also offers nearly 20 vitamins and minerals in every serving, including potassium, lutein, and folate. The health benefits of avocados are promoting heart health, regulating blood sugar,