మహిళల జీవితంలో నెలసరి (పీరియడ్స్) అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సూచిక. కానీ నెలసరి తేదీ రెండు మూడు రోజులు దాటిపోగానే బహుశా ఆఫీసు టెన్షన్, ఇంటి పనుల భారం, లేదా ఏదైనా మానసిక ఆందోళన వల్లేమో అని చాలామంది మహిళలు ఒత్తిడిపై నెపం వేస్తుంటారు. కానీ ప్రముఖ గైనకాలజిస్టుల మాట ప్రకారం... ప్రతిసారీ ఒత్తిడే కారణం కాదు. ఇది మీ శరీరంలోని ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు తొలి సంకేతం కూడా కావచ్చు అని చెబుతున్నారు.

Advertisement

అసలు కారణాలు ఇవే కావచ్చు

Advertisement

నిపుణుల ప్రకారం..థైరాయిడ్ సమస్యలు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), హార్మోన్ల లోపాలు లేదా గర్భాశయ సంబంధిత వ్యాధులు కూడా క్రమరహిత నెలసరికి ప్రధాన కారణాలు కావచ్చు. 18 ఏళ్ల లోపు యువతుల్లో నెలసరి ప్రారంభమైన కొత్తలో వచ్చే సమస్యలు ఒకలా ఉంటే, 45 ఏళ్లు దాటిన తర్వాత మెనోపాజ్ దశకు చేరువవుతున్న మహిళల్లో వచ్చే హార్మోన్ల హెచ్చుతగ్గులు మరోలా ఉంటాయి. కాబట్టి వయస్సును బట్టి సమస్య మూలాలను డాక్టర్లను అంచనా వేస్తారు.

ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు

మనలో చాలామంది మహిళలు నెలసరి సమయంలో వచ్చే అధిక రక్తస్రావాన్ని లేదా నొప్పిని పంటిబిగువున భరిస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ ప్రతి ఒకటి లేదా రెండు గంటలకు శానిటరీ ప్యాడ్ పూర్తిగా తడిసిపోయి మార్చాల్సి రావడం, పెద్దపెద్ద రక్తపు గడ్డలు పడటం ఏమాత్రం సాధారణం కాదు. ఇది ఇలాగే కొనసాగితే శరీరంలో రక్తం తగ్గిపోయి ప్రాణాంతకమైన రక్తహీనత బారిన పడే ప్రమాదం ఉంది. దానికి తోడు భరించలేని పొత్తికడుపు నొప్పి, కడుపులో గడ్డలు ఉన్నట్లు అనిపించడం గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా అండాశయ సమస్యలకు బలమైన సంకేతం.

Advertisement

రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు..

PCOS, జీవనశైలి ప్రభావం

ఈ రోజుల్లో చాలా మంది మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్య పీసీఓఎస్ (PCOS). ముఖంపై లేదా శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, పదేపదే మొటిమలు వేధించడం, అకస్మాత్తుగా బరువు పెరగడం దీని ప్రధాన లక్షణాలు. నెలల తరబడి రుతుస్రావం ఆగిపోయి, హఠాత్తుగా విపరీతమైన రక్తస్రావం కావడం కూడా జరుగుతుంది. దీనికి తోడు నిద్రలేమి, జంక్ ఫుడ్ తినడం, అధిక బరువు, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి.

Advertisement

ఏం చేయాలి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?

అప్పుడప్పుడూ రెండు మూడు రోజులు నెలసరి ఆలస్యం కావడం సహజమే. కానీ నెలల తరబడి రాకపోవడం, విపరీతమైన నొప్పి, అధిక రక్తస్రావం, లేదా శారీరక మార్పులు కనిపిస్తే తక్షణం గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. డాక్టర్లు థైరాయిడ్, హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్ స్థాయిలను తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయిస్తారు. గర్భాశయ పరిస్థితిని అంచనా వేయడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా అవసరమైతే MRI కూడా సూచిస్తారు.