చాలామంది పురుషుల్లో శృంగారం గురించిన అతిపెద్ద ఆందోళన..నేను నా భాగస్వామిని ఎంతసేపు సంతృప్తి పరచగలను? అనేది. సినిమాలు, ఇంటర్నెట్ వీడియోలు చూసి, శృంగారం అంటే గంటల తరబడి సాగే ప్రక్రియ అని చాలామంది భ్రమపడుతుంటారు. ఈ అపోహల వల్ల తెలియని మానసిక ఒత్తిడికి గురవుతారు. అసలు నిజంగా ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? దీనిపై సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం.
సగటు సమయం ఎంతంటే..
రీసెర్చ్ ప్రకారం చూస్తే.. శృంగారంలో ఒక పురుషుడు సగటున గడిపే సమయం కేవలం 5 నిమిషాల 24 సెకన్లు మాత్రమే. 10 నుంచి 30 నిమిషాల పాటు శృంగారం చేయాలనేది కేవలం ఒక అపోహ మాత్రమే. ఇలాంటి అవాస్తవాలను నమ్మడం వల్లే పురుషుల్లో అనవసరమైన ఆందోళన పెరుగుతుంది. మీరు 5 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు చేయగలుగుతున్నారంటే మీ లైంగిక ఆరోగ్యం ఖచ్చితంగా నార్మల్ అండ్ హెల్దీ'గా ఉన్నట్లే లెక్క.
శీఘ్రస్కలనం అంటే ఏమిటి?
లైంగిక జీవితం ప్రారంభించిన మొదటిసారి నుంచే, ప్రతిసారీ కేవలం 1 నిమిషంలోపే స్కలనం అయిపోతుంటే దానిని సమస్యగా పరిగణించాలి. అలాగే, గతంలో ముందంతా బాగానే ఉండి.. ఇటీవల కాలంలో హఠాత్తుగా 3 నిమిషాల్లోపే స్కలనం జరిగిపోతుంటే కూడా దానిని శీఘ్రస్కలనం అంటారు.
ఈ సమస్యకు కారణాలు ఏంటి?
శీఘ్రస్కలనం సమస్య రావడానికి శారీరక లోపాలే కాకుండా, మానసిక కారణాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
మానసిక ఒత్తిడి, ఆందోళన: ఆఫీసు టెన్షన్లు, భయం లేదా శృంగారం గురించిన ఆందోళన.
మధుమేహం (డయాబెటిస్): రక్తంలో చక్కెర స్థాయిలు నరాలపై ప్రభావం చూపడం వల్ల.
థైరాయిడ్ సమస్యలు: శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం.
ఇన్ఫెక్షన్లు: ప్రోస్టేట్ లేదా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు ఉండటం.
డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?
-సమస్య పదే పదే పునరావృతం అవుతున్నప్పుడు.
-ఈ సమస్య వల్ల మీకు, మీ భాగస్వామికి మధ్య ఇబ్బందికర వాతావరణం నెలకొని, అసంతృప్తి కలుగుతున్నప్పుడు.
-శృంగార సామర్థ్యంలో అకస్మాత్తుగా ఊహించని మార్పులు వచ్చినప్పుడు.
ఏ డాక్టర్ ను కలవాలి?
చాలామంది పురుషులు సిగ్గుపడి, నామోషీగా ఫీలయ్యి ఈ సమస్యను దాచిపెడుతుంటారు. కానీ ఇది మెడికల్ ట్రీట్‌మెంట్ ద్వారా పూర్తిగా నయం చేయదగిన సమస్యే. దీనికోసం మీరు యూరాలజిస్ట్ లేదా పురుషుల లైంగిక సమస్యల నిపుణుడైన ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ను సంప్రదించాలి.
More Articles
- భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.!
- Beer vs Whisky: బీర్ సేఫా? విస్కీ బెటరా? మందుబాబులు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు!
- మొటిమలు, చుండ్రుకు శాశ్వత పరిష్కారం: వన తులసితో మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం!
- రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
- రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
- మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!