మీ చేతి వేళ్ల గోళ్లు, ఆకృతి మీ ఆరోగ్య సమస్యల గురించి తెలియజేస్తుందని మీకు తెలుసా.. గోళ్లు పెరిగినప్పుడల్లా కట్‌ చేసుకోవడమే చాలా మందికి తెలుసు. కానీ వాటిపై ఉండే కొన్ని అసాధారణ లక్షణాలు శరీరంలోని కొన్ని భాగాల అనారోగ్యానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి మీ గోళ్లు ఎలా ఉన్నాయి.. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. కనిపిస్తే ఏం చేయాలి.? ఇక్కడ చూద్దాం..

Advertisement

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఇలా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా వరకు ఈ రోగం ముదిరేవరకు కొందరు నిర్లక్ష్యం వహిస్తారు. అయితే మీ కిడ్నీల ఆరోగ్యం ఎలా ఉందనేది ముందుగానే తెలుసుకోవచ్చు. దానికి మీ చేతి వేళ్ల గోర్ల ఆకృతే ఉదాహరణ.

Advertisement

ఒకసారి స్టెంట్‌ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.!

సాధారణంగా గోర్లపై ఒక భాగంలో అర్ధచంద్రాకారం తెల్లగా కనిపిస్తుంది. కొందరిలో ఇది స్పష్టంగా కనిపిస్తే.. మరికొందరిలో ఇది కనిపించదు. కాగా, ఈ నెలవంకకు మూత్రపిండాల ఆరోగ్యంతో సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే గోరుపై అర్ధచంద్రాకారం కనిపించనంత మాత్రాన ఏదో వ్యాధి ఉన్నట్లు కాదని చెబుతున్నారు. గోర్లు సడెన్‌గా రంగు మారినా, ఆకారం భిన్నంగా కనిపించినా, నెలవంక పూర్తిగా కనుమరుగైనా.. ఇది శరీరంలో సమస్యలను సూచించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా

చాలాకాలంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో గోరు చివరిన ఉండే ఈ పొర చిన్నదిగా అవుతుంది. లేదంటే కనిపించకుండా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ కూడా నెలవంక ఆకృతిపై ప్రభావం చూపించవచ్చు. ఇక, గుండె జబ్బులు ఉన్నవారిలో కూడా ఈ పొర రంగు మారడం, ఆకృతి మారే అవకాశాలు ఉన్నాయి. అయితే కేవలం గోళ్లలో ఈ మార్పులు బట్టే వారిలో ఈ వ్యాధులను నిర్ధారించలేమని నిపుణులు అంటున్నారు.

తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు!

ఈ లక్షణాల పట్ల నిర్లక్ష్యం వద్దు..

Advertisement

కేవలం గోళ్లపై ఉండే అర్ధచంద్రాకారం ఆకారం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లలో మార్పులతో పాటు, పాదాలు వాపునకు గురి కావడం, ఆయాసం, ఛాతీ నొప్పి, ఛాతీ బరువుగా అనిపించడం, అదే పనిగా అలసటకి గురికావడం, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

అయితే శరీరంలో రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ లోపాలు, డయాబెటిస్‌, వయసు పైబడటం వంటి కారణాల వల్ల కూడా గోళ్లలో ఇలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. గోళ్ల ఆకృతి సమస్యలు ఎక్కువకాలంగా కొనసాగుతూ ఉన్నా, ఇతర తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నా.. ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించాలి.