నాకు 19 ఏళ్లు, నేనింకా పెద్దమనిషిని కాలేదు కారణం ఏమంటారు? అందులో పాల్గొనచ్చా? పిల్లలు పుడతారా?

వయసు 19 ఏళ్లు. నా తోటి వాళ్లంతా స్కూల్ లైఫ్ లోనే మెచ్యూర్ అయ్యారు. కానీ నేను ఇంత వరకు పెద్దమనిషిని కాలేదు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ లో ఉండి చదువుకున్నాను. ప్రస్తుతం జాజ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస


ప్రశ్న : నా వయసు 19 ఏళ్లు. నా తోటి వాళ్లంతా స్కూల్ లైఫ్ లోనే మెచ్యూర్ అయ్యారు. కానీ నేను ఇంత వరకు పెద్దమనిషిని కాలేదు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ లో ఉండి చదువుకున్నాను. ప్రస్తుతం జాజ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా నాన్న పెరాలసిస్ తో బాధపడుతున్నారు.

Advertisement

మెచ్యూర్ కాలేదనే ధ్యాస లేదు

నాకు చిన్నప్పటి నుంచి కష్టాలే. ఏవేవో ఆలోచనలతో బతుకీడుస్తున్నాను. దీంతో మెచ్యూర్ కాలేదనే ధ్యాస కూడా నాకు లేకుండా పోయింది. ఈ మధ్య నా స్నేహితురాలు పీరియడ్స్ తో బాధపడింది. నాకు ఆ పెయిన్ గురించిగానీ, బ్లీడింగ్ గురించిగానీ సరిగ్గా తెలియదు. ఆమెను అడిగితే మొత్తం వివరాలు చెప్పింది.

Advertisement
పీరియడ్స్ రాలేదు

అయితే నాకు ఇప్పటి వరకు పీరియడ్స్ రాలేదు. అసలు నేను పుష్పవతినే కాలేదు. మా ఫ్రెండ్స్ మొత్తం నువ్వు పుష్పవతి కావాల్సిన ఏజ్ అయిపోయింది. ఇక ఎప్పటికీ కాలేవు అంటున్నారు. నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది. పెద్ద మనిషిని కాకుండానే నేను కాబోయే నా భర్తతో అందులో పాల్గొనొచ్చా. పిల్లలు కనొచ్చా? పుష్పవతిని కావాలంటే ఏం చెయ్యాలి. అసలు నేను ఇంత వరకు కాకపోవడానికి కారణం ఏమిటి? నేను త్వరగా రజస్వలను కావాలనుకుంటున్నాను. ఏం చేయాలో చెప్పగలరు.

త్వరగా రజస్వల కారు

సమాధానం : సాధారణంగా బక్కగా ఉండే అమ్మాయిలు త్వరగా రజస్వల కారు. చాలా మంది 11 నుంచి 16 ఏళ్లలోపు రజస్వల అవుతూ ఉంటారు. మీరు 19 ఏళ్లు వచ్చినా ఇంకా కాలేదు అంటే మీ బాడీలో ఏదైనా హర్మోన్ల సమస్య ఉండొచ్చు. అలాగే అండాశయాలు సరిగ్గా లేకపోవడం కూడా కారణం కావొచ్చు.

Most Read :నా భర్త పోర్న్ కు బానిసయ్యాడు, బలవంతంగా ఆ భంగిమల్లో నన్ను అనుభవిస్తున్నాడు, కారణం నేనే #mystory238

జీన్స్ పరంగా ఏర్పడే సమస్యలు

జీన్స్ పరంగా ఏర్పడే సమస్యలు కూడా కారణం కావొచ్చు.

మొదట మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో డాక్టర్ ని సంప్రదిస్తే తెలుస్తుంది. దాన్నిబట్టి మెడిసిన్ వాడితే మెచ్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది.

ఆందోళన చెందకండి

మీరు ఈ విషయంలో ఆందోళన చెందకండి. మీరు టెన్షన్స్ లో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యకు గురై ఉంటారు.

మంచి పోషకాహారం తీసుకోండి. త్వరగా మెచ్యూర్‌ అవుతారు. రజస్వల కాకుండా అందులో పాల్గొంటే గర్భం రాదు. పీరియడ్స్ తర్వాత అండం విడుదల కావడం వల్ల శుక్రకణం ఫలదీకరణం చెంది గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. రజస్వల కాకపోతే అండం విడుదల కాదు. గర్భం రాదు. అయితే మీరు ఏమీ టెన్షన్ పడకండి. డాక్టర్ని సంప్రదించండి. అంతా బాగైపోతుంది.

Most Read :దేశంలో కంటికి నచ్చిన ప్రతీ అమ్మాయిని అనుభవించాడు,మనుషుల మాంసం తిన్నాడు, ఇలాంటి నియంత ఇంకెవ్వరూ ఉండరు

~

English Summary

I am 19 and I Don't Have My Period Yet Is This Normal?