భార్య ప్రెగ్నెన్సీతో పుట్టింటికి వెళ్లడంతో ఆమెతో సంబంధం పెట్టుకున్నా, ఇప్పుడు భయమవుతోంది

నా భార్య డెలివరీ అయి మళ్లీ సెక్స్ కు రెడీ అయ్యేంత వరకు నేను ఆవిడతోనే ఆ సుఖం అనుభవించేవాణ్ని. ఆవిడ నాకు తెలిసిన ఆమెనే. దాంతో కండోమ్ కూడా యూజ్ చేయకుండా సెక్స్ చేశాను.


ప్రశ్న : నా వయస్సు 32 సంవత్సరాలు. నాకు నా భార్య అంటే చాలా ప్రేమ. అయితే ప్రెగ్నెంట్ అయ్యాక పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో నేను కోరికలను అణిచివేసుకోలేక ఒక ఆవిడ దగ్గరకు వెళ్లాను.

Advertisement

నా భార్య డెలివరీ అయి మళ్లీ సెక్స్ కు రెడీ అయ్యేంత వరకు నేను ఆవిడతోనే ఆ సుఖం అనుభవించేవాణ్ని. ఆవిడ నాకు తెలిసిన ఆమెనే. దాంతో కండోమ్ కూడా యూజ్ చేయకుండా సెక్స్ చేశాను.

Advertisement

చాలా మందితో లైంగిక సంబంధాలు

అయితే ఆవిడకు నాతో పాటు చాలా మందితో లైంగిక సంబంధాలున్నాయనే విషయం నాకు తెలిసింది. దీంతో నాలో భయంపట్టుకుంది. ఆవిడకు ఎయిడ్స్ ఉందేమోనని వెంటనే టెస్ట్ లు చేయించాను. తర్వాత నా భార్యకు అసలు విషయం చెప్పి ఆమెకు టెస్ట్ లు చేయించాను. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను. మా ముగ్గురికి నెగెటివ్ అని వచ్చింది.

విండో పీరియడ్ టైమ్

కానీ మా ఫ్రెండ్స్ మాత్రం హెచ్ ఐవీ ఉన్నంత మాత్రానా వెంటనే బయటపడదని చెప్పారు. ఆ వ్యాధి ఉన్నా కూడా విండో పీరియడ్ టైమ్ లో అది బయటపడదని చెప్పారు. అసలు ఆ పీరియడ్ ఏమిటో నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. దయజేసి వివరించగలరు.

Most Read :నా పెళ్లాం నగ్నంగా పడుకుంటుందిగానీ సెక్స్ చేయవనివ్వదు, ఫ్లోర్ ప్లే, మందు సర్వ్ చేయాలి #mystory241

ఆవిడతో మీరు సెక్స్ లో పాల్గొనడం వల్ల

సమాధానం : వివాహేతర సంబంధాలు మంచివికావు. చాలా మందితో సంబంధాలున్న ఆవిడతో మీరు సెక్స్ లో పాల్గొనడం వల్ల మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. పైగా మీరు కండోమ్ కూడా వాడలేదని చెబుతున్నారు.

హెచ్ ఐవీ ఉంటే మీకు వచ్చే అవకాశం

కండోమ్ యూజ్ చేయకపోతే మీరు పాల్గొన్న వ్యక్తికి హెచ్ ఐవీ ఉంటే మీకు వచ్చే అవకాశాలుంటాయి. హెచ్ ఐవీ సోకిన వెంటనే పరీక్షలు చేస్తే బయటపడదు. అప్పుడు నెగెటివ్ అనే తేలుతుంది. వైరస్ క్రమంగా ఇన్ ఫెక్షన్ కు గురి చేస్తూ తర్వాత వ్యాధి బారిన పడేలా చేస్తుంది. ఈ సమయాన్ని వైరస్ విండో పీరియడ్ అంటారు.

More Read :నా భర్త నా పిన్ని, చెల్లెలు, స్నేహితురాలితో ఒక్క రోజే గడిపాడు, రాత్రి మళ్లీ నాతో సెక్స్ #mystory240

కొన్ని రోజులు వెయిట్ చేసి

ఈ విండో పీరియడ్ దాదాపు 4 నెలల వరకు ఉంటుంది. మీరు మళ్లీ ఒక నాలుగు నెలల తర్వాత, మళ్లీ కొన్ని రోజులు వెయిట్ చేసి టెస్ట్ లు చేయించుకోవడం ఉత్తమం. క్షణికానందం కోసం చూసుకుంటే మీరు జీవితాంతం ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అక్రమ సంబంధాలకు దూరంగా ఉంటేనే హ్యాపీగా ఉండొచ్చు.

~

English Summary

What is the window period in fourth generation tests