కోలన్ శుభ్రపరచడానికి 10 ఆరోగ్యకరమైన ఆహారాలు


పెద్దప్రేగు, సమర్థవంతమైన జీర్ణక్రియలను నిర్వహించడానికి, మరియు పోషకాలను శోషించుకోవడానికి బాధ్యత వహిస్తుంది. ఆ క్రమంలో భాగంగా మీ ఆహారంలోని అనారోగ్యకర అంశాల దుష్ప్రభావానికి ప్రత్యక్షంగా కూడా ప్రభావితం కావొచ్చు. తద్వారా ఇది అనేక రుగ్మతలకు దారితీసే అవకాశాలు ఏర్పడవచ్చు. కావున, పెద్ద ప్రేగును శుభ్రంగా నిర్వహించుకోవడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చునని సూచించబడుతుంది.

Advertisement

బోల్డ్ స్కై, మీ పెద్ద ప్రేగు యొక్క సమర్థవంతమైన కార్యాచరణకు సహాయపడే ఆహార పదార్థాల జాబితాతో ముందుకు వచ్చింది. క్రమంగా, మీరు మీ జీర్ణక్రియల గురించిన జాగ్రత్తలతో పాటు, పెద్దప్రేగు క్యాన్సర్ గురించిన ఆందోళన లేకుండా నిర్వహించవచ్చు. మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

Advertisement

1. ఓట్స్ :

ప్రస్తుత ఆధునిక కాలంలో, ఓట్స్ లోని ఆవశ్యక పీచుపదార్దాలు, మరియు అధిక పోషక విలువల కారణంగా అనేకమంది ప్రజలు వీటిని అనుసరించడం జరుగుతూ ఉంది. ఓట్స్ అనేవి ఫినోలిక్స్, కెరోటినాయిడ్స్, ఫైటిక్ ఆమ్లం, బీటా గ్లూకన్ మరియు విటమిన్ E వంటి బయోయాక్టివ్ పోషకాలతో కూడిన ప్రత్యేక సమ్మేళనాన్ని కలిగి ఉంటాయని చెప్పబడింది. ఇది ప్రేగు కదలికలను పెంచుతుంది. వోట్స్ లోని పిండిపదార్ధాలు, జీర్ణ ప్రక్రియను నిర్వహించడానికి మరియు వాటి పనితీరును పెంచడానికి సహాయపడే ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లను అందిస్తుందని చెప్పబడింది. ఈ ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లు, కోలిక్ బ్యాక్టీరియాను నిర్వహించడంలో ఉత్తమంగా సహాయపడుతాయి. అంతేకాకుండా, ఓట్స్ పెద్దప్రేగు జీవక్రియలను పెంచడంలో సహాయపడే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లను కూడా అధికంగా కలిగి ఉంటాయని చెప్పబడుతుంది.

2. సిట్రస్ పండ్లు :

పెద్దప్రేగును శుభ్రపరచడంలో నిమ్మ, ఆరెంజ్ మరియు గ్రేప్ ఫ్రూట్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ అత్యంత అవశ్యకంగా ఉంటాయని చెప్పబడుతుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గించడంలోనే కాకుండా, కోలన్ క్యాన్సర్ (పెద్ద ప్రేగు కాన్సర్) నిరోధించడంలో కూడా అనుకూల ఫలితాలను ఇవ్వగలవని చెప్పబడుతుంది. సిట్రస్ పండ్ల రసంలో చురుకైన సహజ జీవక్రియల శక్తి ఉన్న కారణంగా, ప్రేగులలో ప్రత్యక్ష శోషణను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఈ సిట్రస్ పండ్లలోని ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ మూలంగా, పెద్ద ప్రేగు సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పబడుతుంది.

3. అవకాడో :

అవకాడో, పెద్దప్రేగు నిర్వహణకు అత్యుత్తమమైన మెడిసిన్ గా చెప్పబడుతుంది. ప్రేగులలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను సమర్థవంతంగా నిరోధించగల సామర్ధ్యం ఈ అవకాడో సొంతం. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ సమస్యకు కాంప్లిమెంటరీ చికిత్సగా కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అవకాడోలు విషతుల్య రసాయనాలను తగ్గించడంలో పనిచేస్తూ, తద్వారా పెద్దప్రేగు కుహరం మరియు పక్కనున్న కణజాలాల లోపలి ఒత్తిడిని తగ్గించడంలో, మరియు నిర్వహించడంలో అద్భుతంగా పనిచేయగలవని చెప్పబడుతుంది.

4. చియా సీడ్స్ :

కేవలం 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ ను మీ ఆహార ప్రణాళికలో చేర్చుకోవడం ద్వారా, జీర్ణక్రియ ప్రక్రియలు సక్రమంగా జరిగి, మీ పెద్ద ప్రేగు ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా, చియా గింజలు పెద్దపేగు నిర్వహణలో సహాయపడే, డైటరీ ఫైబర్ నిల్వలను అధికంగా కలిగి ఉంటాయని చెప్పబడుతుంది. ఈ పీచుపదార్థం ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా, అన్ని విషతుల్య రసాయనాలను తగ్గించడంలో సహాయపడుతూ, మీ శరీరం నుండి కొలెస్ట్రాల్ను బయటకు పంపడంలో కూడా పనితీరు కనబరుస్తుంది.

5. పెరుగు :

పెద్దప్రేగు జీర్ణక్రియల గురించి జరిపిన అనేక పరిశోధనలలో, వాటి ఆరోగ్యంలో పెరుగు/యోగర్ట్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తేల్చాయి. క్రమంగా, పెద్దప్రేగు ఆరోగ్యాన్ని మరియు జీర్ణక్రియలను నిర్వహించుకోవడానికి, పెరుగు లేదా యోగర్ట్ తరచుగా తీసుకోవడం ఉత్తమమని సూచించబడుతుంది.

పెరుగు, పెద్దప్రేగు యొక్క మైక్రోఫ్లోరా మీద ప్రభావాన్ని చూపగలిగే ఆవశ్యక బాక్టీరియాను కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పోషక శోషణలోనే కాకుండా, సమర్థవంతమైన ప్రేగు కదలికలకు కూడా ఉత్తమంగా సహాయపడగలవు. క్రమంగా జీర్ణక్రియలు ఆరోగ్యకర స్థాయిలో మెరుగుపడుతాయి. అధిక మొత్తంలోని ఈ మంచి బాక్టీరియా ఉనికి ఆహార పదార్ధాలలోని పోషకాలను శోషించుకోవడానికి, మరియు జీర్ణాశయ మార్గాలలో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

6. బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ను మీ ఆహార ప్రణాళికలో జోడించుకోవడం ద్వారా పెద్దప్రేగు ఆరోగ్యాన్ని ఉత్తమంగా నిర్వహించుకోవచ్చునని చెప్పబడుతుంది. తరచుగా తీసుకునే వైట్ రైస్ తో పోల్చితే ఇది అధిక పరిమాణంలో ప్రోటీన్స్ మరియు మైక్రోన్యూట్రియంట్లను కలిగి ఉంటుంది. బ్రౌన్ రైస్ వినియోగం, అల్సర్స్ మరియు పేగుకోతల చికిత్సలో ఉత్తమంగా సహాయపడుతూ, గట్ బాక్టీరియా పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. కొలిటిస్ సమస్యతో బాధపడుతున్న రోగులకు, ఇది ఒక ఆవశ్యక ఔషధంగా చెప్పబడుతుంది.

7. పాలకూర :

ఆకుపచ్చని ఆకుకూరలు, విస్తృత స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలను అందించగలిగే గట్ బాక్టీరియాను పెంచడంలో కీలకపాత్రను పోషిస్తాయని చెప్పబడుతుంది. పాలకూరలో అధికంగా ఫైబర్ నిక్షేపాలు ఉంటాయి. ఇది పెద్ద ప్రేగులో జీర్ణ క్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రేగుల ద్వారా మృదువుగా ప్రయాణించేలా చూడగలుగుతుంది. క్రమంగా పెద్దపేగుమీద పడే అదనపు ఒత్తిళ్లను గణనీయంగా తగ్గించగలుగుతుంది.

8. వెల్లుల్లి :

ప్రాచీనకాలం నుండీ, వెల్లుల్లి వివిధ శ్రేణుల రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుందని సూచించబడుతూ ఉంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పెద్దప్రేగులలో క్యాన్సర్ కణాల విస్తరణ తగ్గుదలలో ఉత్తమంగా పనిచేస్తాయని చెప్పబడుతుంది.

9. దానిమ్మ రసం :

కోలన్ క్యాన్సర్ మరియు దాని తరువాతి క్రియాత్మక దశలను కొన్ని రకాల ఆహర పదార్ధాల సహాయంతో నియంత్రించవచ్చునని ఇటీవలి అధ్యయనాలు చెపుతున్నాయి. దానిమ్మ రసం ఒక గుర్తింపు పొందిన ఆహారం. ఇది అధిక గాఢత కలిగిన ఫినోలిక్స్ మరియు ఫ్లేవనాయిడ్లను కలిగి ఉన్న కారణంగా, పెద్దప్రేగును అంటువ్యాధులు మరియు కాన్సర్ బారిన పడకుండా చూడడంలో సహాయం చేయగలదని చెప్పబడుతుంది. అంతేకాకుండా కాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించడంలో పనిచేస్తాయని కూడా కొన్ని అద్యయనాలలో తేలింది. సిట్రస్ పండ్ల రసాలతో పాటుగా, దానిమ్మ రసాన్ని తీసుకుంటున్న ఎడల, మరింత సమర్థనీయమైన ఫలితాలను చూడగలరని చెప్పబడుతుంది.

10. యాపిల్స్ :

మీ ఆహార ప్రణాళికలో యాపిల్స్ చేర్చినప్పుడు, గట్ లో మైక్రోబయల్ ఫ్లోరా యొక్క విస్తృతమైన పెరుగుదలను ప్రోత్సహించగలవని శాస్త్రీయ ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది ప్రేగు కదలికల యొక్క మృదువైన ప్రవాహాన్ని పెంచుతుంది మరియు పోషకాలను శోషించడంలో సహాయం చేస్తుంది. యాపిల్స్ తరచుగా తీసుకోవడం మూలంగా, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు గుండె సంబంధిత వ్యాధులను కూడా అదుపులో ఉంచుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Toxins from your gastrointestinal tract can cause a variety of health problems such as high blood pressure and arthritis. Colon cleansing can improve one's health by removing toxins, boosting energy and enhancing the immune system. Modifying your diet with the incorporation of colon cleansing foods can take you a long way in keeping a healthy gut.